Saturday 11 April 2015

కవిత నెం92:ఓ మతి స్తిమితం లేని మానవ జీవమా

కవిత నెం :92

కవిత పేరు : ఓ మతి స్తిమితం లేని మానవ జీవమా
రచన : రాజేంద్ర ప్రసాద్
రచన సంఖ్య : ఫిబ్రవరి (5 ),T (24 )
స్థలం : హైదరాబాద్, ఆంధ్ర ప్రదేశ్
సమయం : 6  గం // ౩౩ ని.లు


ఎక్కడ ఉంది మానవత
నిన్ను రక్షించే ఓ మమత
చిరంజీవిగా బ్రతుకే నిచ్చునా
చిరునవ్వునే వరముగా నిచ్చునా
అందరి తల్లీ భూమాతా
నీకు మాత్రము అవలేదా
పక్షపాతమే పరిపాలించునా
నిన్ను ఇలానే వదిలివేయునా
ఎన్ని యేళ్ళు నీకు ఉన్నా
నీ మనసు నీకు తెలియదుగా
ఎంతగా నువ్వు ఎదుగుతున్నా
లోక జ్ఞానం నీకు దక్కదుగా
ఏ విదిరాత నిన్ను ఇలా రాసాడో
ఈ జన్మాంతం శాపమిలా ఉంచాడో
మానవత్వం లేని జనంతో
నీ మనుగడ ఏమౌనో
అనాధలు ,అందకారులు
వికలాంగులు అని ఎందరికో
ఆదుకునే ఆశ్రమాలు
వారికవే నివాసాలు
నిన్ను మాత్రం వెర్రితనంలా
వెక్కిరించి ఊస్తారో
పిచ్చి నీకు ఉందంటూ
పగలబడి నవ్వుతూ
పసిమనసులాంటి హృదయాన్ని
పిచ్చి కాగితం చేస్తారు
ఉన్నవాళ్ళు ,గొప్పవాళ్ళు
ఎందఱో ఉన్నా ఈ దేశంలో
దిక్కుమాలిన దినంతో
నీ దినచర్య రాస్తారు
జాలి గల చిన్ని మనసులు
సానుభూతినే నీకు బహుమతి గా ఇస్తారు
ఎవ్వరాదుకుంటారు నిన్ను ఇష్టపడి
నీతో చెలిమి చేయగలరా మనసుపడి
అపద్భాన్ధవులు కొద్ది మంది
నీ కండగా నిలబడినా
అర్ధం చేసుకోలేరు నీ మనసుని
ఒక మదర్ దేరిస్సా లాగా
సూక్తులకే వారి మాటలు
అనుభవాలకు నోచ్చుకోలేవు
ఒక ముద్ర అంటూ ఇస్తుంది ఒక ISI మార్క్ లాగా
మూర్కత్వంలో ఉన్న ఈ మానవసమాజం
ఈ మానవ సమాజం





0 comments:

Post a Comment