Saturday 11 April 2015

కవిత నెం132 :వినాయకా

కవిత నెం :132 //వినాయకా //

ఆది  దేవ నీవయా
అభయహస్తం నీదయా
జై బోలో గణేషాయా

మొట్టమొదటి దీవెన
ప్రధమమైన  పండుగ
నీ చవితి నేగ వినాయకాయ

అందుకో అంజలి 
ప్రతి ఇంటింటా వాకిలి
వెల్కం అనే వాక్కుతో మరి

గణ గణ గణ గణ గణపతి దేవా
శరణు శరణు శరణు నీయగా రావా


శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం 
సుభసూచికం నీ పదం 
సుభకార్యవరణం నీవున్న ఆవరణం


ఇష్టంగా పూజిస్తే నిన్ను
ఈ కష్టమంటూ దరిచేర నివ్వవూ


అండ దండ నీవేలే
అందరి బందువు నీవేలే




గణ గణ గణ గణ గణపతి దేవా
శరణు శరణు శరణు నీయగా రావా




విఘ్నేశా వినాయక
అందుకో మా హారతిని
చల్లంగా చూడు ఈ బారతిని

విద్యనిమ్ము వినయము నిమ్ము
వివేకంలేనివారికి బుద్ది నిమ్ము

మంచినివ్వు ,మనస్సునివ్వు
అవిరెండు లేనివారికి ఆలోచన కలగనివ్వు

ప్రేమనివ్వు,సేవ నివ్వు
రెండిటిని ఏకంచేసే మైత్రినివ్వు

నీతినివ్వు,నిరతినివ్వు
నేటి గాంధి  లేకున్నా మంచి నడవడినివ్వు

సుఖమివ్వు ,శాంతి నివ్వు
వాటిలో అనడాన్ని చూపే సంతృప్తి నివ్వు

ఆస్తులివ్వు ,అంతస్తులివ్వు
మనదేశం పేదరికం మార్చే మార్పు నివ్వు

విజయమివ్వు ,గర్వం నివ్వు
పక్కవారు గెలిచినా చిరునవ్వు ఇవ్వు

స్నేహం ఇవ్వు,ఐక్యత నివ్వు
మత కుల గోడలు కట్టలేని సమైక్యతా నివ్వు

గణ గణ గణ గణ గణపతి దేవా
శరణు శరణు శరణు నీయగా రావా

!!!!!!!!
గరిమెళ్ళ రాజా























0 comments:

Post a Comment