Saturday 11 April 2015

కవిత నెం115:భక్తి

కవిత నెం :115

భక్తి అనే బావం మదురమైనది 
మనకు అత్మీయమైనది .మన మనసుకు ప్రశాంతంను కలిగించేది 
అచంచలమైన అద్వితీయమైన ఓంకార రూపం 
నిరక్షర జీవాలకు నిర్భయమును  ఇచ్చే హస్తం
ఎవ్వరో వస్తారు ఏదో చేస్తారు అనే ఎదురుచూసే ఆశావాదులకు
అండగా తోడుగా మనతోటి వచ్చే నీడగా 
మన జీవన సాగార ప్రవాసంలో మన తోటి ప్రయాణించే ఆత్మబంధువు 
అబిలాషను పుట్టించే సన్నిహితువు 
కనులార చూడలేని దైవాన్ని 
మనసారా స్మరిస్తూ 
మన గుండెలోతుల్లో దేవాలయమును నిలిపి 
మోక్ష మార్గ తోవలకు  అన్వేషణ చూపి 
మన మార్గ సక్రమ కార్య రూపాలు ఎలా ఉండాలో
అందుకోసం ఏమి చేయాలో ,సత్యాన్వేషణ ఎలా కొనసాగించాలో ,దైవ సన్నిదానాన్ని ఎలా చేరుకోవాలో 
చెడును మన నుంచి చెరిపి వేసి 
మంచి అనే గంధపు చిగురును మనలో మొలకింప చేసి 
మన మార్గ సరాగాలను సరాళం  చేసి 
పాపప్రక్షాలనం చేసి పాపబీతి నుంచి  మనల్ని  తప్పించే 
అద్బుతమైన శక్తి ''భక్తి''


0 comments:

Post a Comment