Saturday 11 April 2015

కవిత నెం107:మౌనం

కవిత నెం :107 //మౌనం //

అంతరంగంగా తరంగాలను సృష్టించే ధ్వని ఈ ''మౌనం'' 
సుముఖంగా భావాలను దాచ గని ఈ ''మౌనం'' 
సూర్యోదయం రాకముందే తన ఉషస్సుతో 
సవ్వడి చేసే ఓ మంచుపోగ ఈ ''మౌనం'' 
వర్షపు నీరు భూమిని తాకగానే 
వెదజల్లే పరిమళం ఈ ''మౌనం'' 
సంక్రాంతి ముగ్గులో గొబ్బెమ్మలా 
పోదిగియున్దేడే ఈ ''మౌనం''
శీతాకాలం చలిబిందువులా 
వెచ్చని ఆవిరి ఈ ''మౌనం''
పండువెన్నెల లో పుత్తడి కాంతుల మాటున 
పయనించే నీడ ఈ ''మౌనం'' 
పెదవుల బయటికి రాకుండా 
గొంతులోపల గరళంలో దాగివుండేది ఈ ''మౌనం''
ఏ  చప్పుడు రాని శబ్దం ఈ ''మౌనం''
మన గుప్పిట మూగ భావం ఈ ''మౌనం''

!!!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా 

0 comments:

Post a Comment