Monday 13 April 2015

కవిత నెం144:చెలీ నీవెక్కడ

కవిత నెం :144
*చెలీ నీవెక్కడ * రోజూ గడుస్తున్నదే 
పొద్దు వాలుచున్నదే 
చెలీ నీ జాడ ఏడున్నదే

మబ్బు పట్టుతున్నదే 
చినుకు పడుతూ ఉన్నదే 
చెలీ నీ తోడూ ఏడున్నదే 

సూర్యుడు వస్తున్నాడు 
చంద్రుడు పోతున్నాడు 
నీ గురించి నాకెవ్వరూ చెప్తారు 

పావురాన్ని పెంచాను 
రామచిలుకనే ఉంచాను 
నీ కేరాఫ్ అడ్రస్ వాటికి ఏమని చెప్పను 

అమాంతంగా ఉలిక్కిపాటు 
అనుమానంగా అటు ఇటు చూపు 
చూస్తున్నా నీ రూపాన్నే దిక్కులవైపు 

సీతాకోకచిలుకని అడిగా 
ఈ రంగులరూపం నీవని 
ప్రతి పువ్వుపై తుమ్మెదనడిగా
నా చెలి పరిమళం ఏదని 

వింటున్నావా వెన్నెల కూనా 
ఈ గడిసే రాతిరి జామునా
కంటున్నావా కమలం పువ్వా 
నడిచే నీటి లోతునా 

ఉన్నా, నేనున్నా వేచియున్నా 
రావే, దరిరావే ఓ మైనా 

!!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా

0 comments:

Post a Comment