Saturday 11 April 2015

కవిత నెం89:నేటి పదవులు - వాటి విలువలు

కవిత నెం :89

నేటి పదవులు - వాటి విలువలు 


ఏమిటి ఈ రాజకీయము 
ఎక్కడుంది ప్రజాస్వామ్యము 
మన నాయకుల ఇష్టారాజ్యము 
ఎటువెళ్తుంది ప్రజాక్షేమము 
ప్రజలు అంటారు ,పదవులంటారు 
పదవులుంటే ప్రజా సేవ చెయ్యొచ్చంటారు
పదవికోసం వ్యామోహం 
అది వచ్చుటయే మహా పాపం 
పదవంటే ఏమిటి వారిసొత్తా 
పదవంటే రాజకీయపొత్తా 
ప్రజలంటే దేవుళ్లురా 
పదవికోసం ఆ పేరురా 
సమస్యలు ఎవరికెరుకరా 
వారి స్వలాభమే ముందుచూపురా

లేనోడు, ఉన్నోడురా 
వారికేమి తేడాలేదురా
ఆకలి అరుపేమిటో 
అది వారిదాక చేరబోదురా
ప్రజలముందు పెద్దమనిషిరా
గొప్ప సంఘసేవ తెలిసినోడురా 
తీరాచూస్తే ఏముందిరా 
అది కల్లబొల్లి మాటలేనురా 


మీటింగులు, సభలు అమలురా 
మన గురించే మాటలేదురా
అయినోళ్ళకు వారిసేవరా
ఎన్ని తప్పులైనా చేయవచ్చురా 
సుఖమంటే తెలిసినోడురా 
ఏ కష్టమైనా మర్చిపోవురా 
గెలుపుకోసం, వారి సీటుకోసం 
తాపత్రయం తగ్గబోదురా 

నువ్వు ఓటువేస్తె - నోటు ఇచ్చి 
తీర్చుకొందురు నీ రుణం 
అసలు పదవంటే తెలుసునా వారికి 
దానిమీద గౌరవం ఎవ్వరికీ ?
తెలియని సమస్యకోసం 
ఎంతదూరమైనా సాగే ప్రయాసం 
వారి వారి డాబు కోసం 
చేస్తారు పదవి త్యాగం 

మునిగివున్న సమస్యలు 
మన ప్రజలఅవస్థలు
ఎవరెవరు తెలుసుకొందురు ?
మనకేమి చేయబోదురు ?

ఇకనైనా లేవరా ఓ మనిషి 
ఒక పదవివెనుక ఉందిరా నీ కృషి 
ఒక్క ఓటు విలువరా ఆ పదవి 
దాన్ని కాపాడమనే ఈ  మనవి 

పదవి కోసం అర్హత ఉండాలి 
నిజాయితీలోనే అది రావాలి 
పదవంటే బాద్యత ఉండాలి
ప్రజలకోసం పదవి చేపట్టాలి  


- గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు 

0 comments:

Post a Comment