Wednesday 28 May 2014

కవిత నెం 30:ఆలు మగలు

కవిత నెం :30
*ఆలు మగలు * బార్యా భర్తల బందం ఎంతో పవిత్రమైనది
మూడు ముళ్ళ బంధమది
ఏడడుగుల అనుబంధమది
జన్మ జన్మల బాందవ్యమది
నీకోసం ఒక తోడు నిరంతరం నీతో పాటుగా జీవించటానికి ఏర్పరిచినబంధం  ''పెళ్లి''
బందువులు ,స్నేహితులు ,ఆత్మీయులు అని ఎందరున్నా
నీవంటే ప్రత్యేకంగా , నీ కోసమే తన సావాసం అన్నట్టుగా
నీ కోసమే ఈ జీవితం అంకితంగా నిర్ణయింపబడినదే ఈ బార్య భర్తల బంధం
ఒకరంటే ఒకరు ,ఒకరి కోసం ఒకరు జీవితాంతం వారికి వారే తోడూ నీడా
కష్ట సుఖాలు ,కలిమి లేములు లను సమపాలుగా బావించి సాగేదే ఈ సంసారం
చిన్న చిన్న చిరాకు తుంపరులు మద్య మద్యలో గిల్లుతుంటాయి
దానికి వాన వెలసిన తర్వాత వచ్చే హరివిల్లులా మీ జీవితం విరిసిల్లాలే తప్ప
గాలికి కొట్టుకుపోయిన ఆకులు లాగా ,మోడుగా  మిగిలిన చెట్టులాగా సంసారం ఉండకూడదు
ఆకాశమంత హృదయం చేసుకుని సరదా సరదాలతో ఉల్లాసంగా ఉరుకులేయ్యాలి తప్పితే
తూర్పు పడమరలా ఆలు మగలు మౌనం లంగించకూడదు సుమీ
పైకి ఒకరికొకరు ప్రేమను తెలియపర్చలేక పోయిన ,లో లోపల ఒకరిపై ఒకరు
సముద్రం అంత ప్రేమను పదిలపరుచుకుంటారు అది అవసరం వచ్చినప్పుడు
లావా లాగా పొంగిపొర్లు తుంది అని మరువకండి
ఇద్దరంటే ఒకరులా ,నీలో నేను నాలో నీవు సగ బాగంలా అన్యోనంగా అల్లుకుపోవాలి
అరుదుగా ఉన్న ఈ జన్మలో మీకు మీరే రాణి రాజులు లా
అందమయిన ఈ జీవితాన్ని హాయిగా అనుభవించటానికి ఉన్న ప్రతీ అవకాశాన్ని
సద్వినియోగం చేసుకుంటూ ,ఒకరిఒకరు నూతన స్వగతాలను అందించుకుంటూ
నిరాడంబరంగా , నిరంతరం నిత్య నూతన వసంతంతో మీ సంసారజీవితాన్నివనంలో
సంసారపక్షుల వలే విహరించాలి మీ జన్మాంతం వరకు .







Tuesday 6 May 2014

కవిత నెం29(నీ ఓటే ఒక ఆయుధం)

కవిత నెం :29

***నీ ఓటే ఒక ఆయుధం***

చతికిలపడ్డ సమైక్యత ను నిద్ర లేపటానికి
అలసిపోయిన ప్రజాస్వామ్యాన్ని కదపటానికి
నీ ఓటే ఒక ఆయుధం  //2//
నీ గుండెచప్పుడు గెలవటానికి
నీ మనసు స్వచ్చత ను నిలపటానికి
నీ ఓటే ఒక ఆయుధం //2//
రాజ్యాంగాన్ని తిరగరాసే సిరా ఏరా ఈ ఓటు ఆయుధం
రాజకీయవ్యవస్థను ప్రక్షాళన చేసే ఈ ఓటు ఆయుధం
నీ గళం సుస్థిరం కావాలంటే ఏమ
నవచైతన్య పునాదులు లేవాలంటే
నీ ఓటే ఒక ఆయుధం //2//
అంధకార చీకట్లు తోలగాలంటే
అదికార దాహాలను దించాలంటే
నీ ఓటే ఒక ఆయుధం //2//


 అవినీతిని బహిష్కరించటానికి
నిజాయితీ నీడ మిగలటానికి
నీ ఓటే ఒక ఆయుధం //2//
ప్రజల విలువ తెలియ చెప్పటానికి
ప్రజా క్షేమం కాపాడటానికి
నీ ఓటే ఒక ఆయుధం //2//
ప్రతి మనిషి ఒక సైనికుడై రావాలి
నీ చేతిలో ఆయుధమే ఒక ఓటుగా
దానిని వాడి చూడు ఇక సూటిగా
వెలుగును చూపే సూర్యుడు నీవే
భవితను మలచే సమర్దుడు నీవే
కళ్ళు తెరచి చూడు
కుళ్ళు కడిగెయ్ నేడు
నీ అస్త్రం సందించి అర్జునుడు గా రా రా
శ్రమజీవులు అణ్వాయుధం ఈ ఓటురా
సమ సమాజ నిర్మాణం ఈ ఓటురా
నీ ఓటే ఒక ఆయుధం //2//

Friday 2 May 2014

కవిత నెం 28:ఈ వేళ

కవిత నెం :28

నా కనుల ముందు నీ తోడు లేక 
దాచి ఉంచా అది నీకు చెప్పలేక
నీ జత లేని నా జీవితంలో హరితం హరించుకున్న వేళ 
నీ కోసం రాహదారిలో బాటసారిగా పయనించుచున్న వేళ 
నింగినంతా కళ్ళు చేసుకుని ఎడబాటుతో ఎదురుచూస్తున్న వేళ 
ఎదలో తెలియని ఆశతో నిరంతర నిశబ్దంతో నిలిచున్న వేళ 
నా మౌనం మది అంతరంగమై అదృశ్యమించే వేళ 
 చిరుగాలి సైతం చిన్నబోయి చతికిలపడిన వేళ 
నీ జ్ఞాపకాలతో బ్రతుకుచున్నా చెలీ ఈ వేళ 
నీ తలపుల ఊసులతో ఊపిరిని పోసుకుంటూ గడిపేస్తున్నా