Thursday 5 March 2015

కవిత నెం85:వసంత కేళి

కవిత నెం :85రంగుల రంగేళి - వసంత కేళి 
******************************************
వసంతఋతువు ఆగమనంతో వచ్చు  తొలి వేడుక హోళీ 
ప్రతి సంవత్సరం పాల్గుణ మాసంలో పౌర్ణమి రోజు  వచ్చే హోళీ 
ప్రపంచంలో రంగులన్నీ కలిసి చేసే కోలాహాలం ఈ  హోళీ
రాధా కృష్ణులతో మొదలయ్యిన రమణీయ రసమయ క్రీడ హోళీ 
హోళిక అనే రాక్షసిని సంహరించిన దినం హోళీ

చలికి ,పొగమంచుకి గుడ్ బై చెప్పి ,వెచ్చదనానికి వెల్కం చెప్పే హోళీ
చిన్నా, పెద్దానే తారతమ్యాలు  మరచి చేసే సరదా సందడి  హోళీ
తీపి ,చేదును కలిపి పంచి పెట్టే విందుల పందిరి హోళీ 
ఆనందమే ఆకాశమై ,అత్యుత్సాహంతో చేసే అల్లరే హోళీ
స్నేహితులకు ,ప్రేమికులకు మరో వసంతం ఈ హోళీ

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు ఈ హోళీ 
సుఖం ,దు:ఖం ,సంతోషం విచారంలు కలిసిన రంగే ఈ హోళీ
కొత్త బంధుత్వాలకు ,బాంధవ్యాలను కలిపే పండుగ ఈ హోళీ
రాగద్వేషాలకు అతీతంగా అందర్నీ ఒకే చోట చేర్చే సంగమం ఈ హోళీ

తరతరాల సాంప్రదాయానికి నిదర్శనం హోళీ
హిందూ -ముస్లిం ఐక్యతకు సంకేతం హోళీ
దీనికి వసంతోత్సవం ,కాముని పున్నమి అంటూ పేర్లు అనేకం 
ఆలాగే దీనిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకుంటారు 

హోళీ  అంటే రంగులతో చేసుకునే సంబరం 
ఆట ,పాటలతో అలరిస్తూ జరుపుకునే పర్వదినం 
ఎరుపు -కోపానికి ,ఆకుపచ్చ -అసూయకు 
పసుపు -ఆనందానికి ,గులాభీ -ప్రేమకు 
నీలం -విశ్రాంతికి ,కాషాయం -త్యాగానికి ,ఊద -జనానికి 
అంటూ ప్రతి మనిషి ఓ ఇంద్రధనుస్సు లా మారే పండుగ హోళీ

అందుకే ఇది రంగేళి హోళీ  ,యమ హంగామా కేళి 
ఎన్నో హంగుల హోళీ  ,చమక్కు చెమ్మకేళి  హోళీ 

సహజరంగులతో హలచల్ చేయవచ్చు కాని 
కృతిమరంగులకు పోయి ప్రాణానికి హాని కారాదు హోళీ
సరదాకు మాత్రమే కాని మనసుకు బాధ కారాదు హోళీ

సాహితీ సేవ చిత్ర కవిత పోటీ -14 కొరకు 
//రాజేంద్ర ప్రసాదు //06. 03. 15 //













0 comments:

Post a Comment