Thursday 12 March 2015

కవిత నెం86:సర్వేంద్రియానాం నయనం ప్రధానం

కవిత నెం :86

సర్వేంద్రియానాం నయనం ప్రధానం 
*************************************

''కళ్ళు ''శరీరంలోని జ్ఞానేంద్రియాలలో ప్రధానమైనవి 

''కళ్ళు '' హావభావాలను విడమరచి చెప్పగలిగేవి
''కళ్ళు''మన సౌందర్యానికి ప్రముఖ పాత్ర వహించేవి
అధ్బుతాలని ,అందాలని  చూపించగల్గేవి  మన కళ్ళు
అందుకే చూస్తున్న వస్తువులో కాదు 
చూసే కళ్ళలో గొప్పదనం ఉంటుందంటారు 
''కళ్ళు '' మనల్ని కవ్విస్తాయి,నవిస్తాయి 
నవ్వుతూ ఏడిపిస్తూ ఆనంద భాష్పాల్ని  కురిపిస్తాయి 
అహంకారం అధికారం పట్టిన వేళలో 
కళ్ళు నెత్తి కెక్కడమంటే  అదే అని చెప్తాయి 
దుర్మార్గం చుట్టూ జరుగుతున్నా ఏమీ  పట్టనట్లు 
చెడు కనకు అనే సామెతను గుర్తు చేస్తుంటాయి 
బాధ  కలిగినప్పుడు దుఃఖాన్ని భయటకు పంపి 
ఓదార్పును అందిస్తూ ఊరటనిస్తుంటాయి 
కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసంటూ 
ఆ పాత మధురాలు చెప్పకనే చెప్పాయి 
కళ్ళు మూగ సైగలు చేస్తూ దాగుడుమూతలాడుతాయి 
గుచ్చి గుచ్చి గుండెల్లో ప్రేమను  పుట్టిస్తాయి 
అందమైన కళ్ళను ఆరోగ్యంగా  కాపాడుకుందాం 
మరణాంతరం మరొకరికి కంటివెలుగై  జీవిద్దాం 

//రాజేంద్ర ప్రసాదు //12. 03. 2015//

0 comments:

Post a Comment