Tuesday 21 April 2015

కవిత నెం148:సీతాకోక చిలుక

కవిత నెం :148

సీతాకోక చిలుక 

వన్నె చిన్నెలున్న సీతాకోకాచిలుక
రెక్కలకు రంగులనే కల్గినావంట
స్వేచ్చకు రెక్కలు తొడిగే ప్రాణివి నీవు
చిరునవ్వుల్ని చిందించే ''సీత '' వు  నీవు
నిన్ను చూసిన వారికి ఆహ్లాదమంట
నిన్ను సృశిస్తేనే మనసుకు హాయి అంట
ప్రకృతి ఒడిలో పెరిగే పట్టుపురుగువు నీవు
నీ సొగసులే మాకు సప్తవర్ణశోభితాలు
ముద్దులొలికే నీ వయ్యారి కదలికలు
చిక్కక దొరకక ఆడుకునే దోబూచులాటలు
అందమైన కుసుమాల తోటలే నీ ఆవరణం
తళుకు మంటూ మురిపించే నీ అందం అజరామరం

Monday 13 April 2015

కవిత నెం147:ఎవరు నీవు

కవిత నెం :147
*ఎవరు నీవు * నిన్ను నేను విడువగలనా
నీ చెలిమిని నేను మరువగలనా
నా బాధలో ఆనందం నీవు 
నా కష్టంలో సుఖం నీవు 
నా మనసులో హాయి నీవు 
నా ప్రతి సొంతం నీవు 
రవివర్మ మలచినా చిత్రానివా 
బాపూ రాసిన గేయానివా 
నా ఉషోదయంలో నవ్య ఉదయానివా 
ఆకాశంలోనించి రాలినా శిల్పానివా 
ఈ భువిలో వెలసిన పారిజాతమా
నీ వర్ణన ఒక అభివర్ణన 
నీ మన్నన ఉంటె చాలు ఇలలోన 
ఆ పంచభూతాలే దిగిరావా 


!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా



కవిత నెం146:బంధాలు

కవిత నెం :146

ఏమిటి ఈ బంధాలు 
ఏమిటి ఈ బావుకతలశ్రావ్యాలు 
ఏమిటి ఈ నేస్తాలు 
ఏమిటి ఈ పరిచయాలు 
ఏమిటి ఈ ఆనంద క్షణాలు 
ఏమిటి ఈ చీకటికారున్యాలు
ఏమిటి ఈ ఆశాకిరణాలు 
ఏమిటి ఈ నిరాశకెరటాలు 
మనిషి అనే రూపమి ఉన్న మనము 
మనసుని అల్లెసుకుని ఉండే బావాలు 
ఇవన్నీ పొందుటకు నిముషము ఆగదు
వాటిని వదిలించుకునే ఉషస్సు మనకుండదు 
నలిగిపోతున్నాము వాటి చెరసాలలో కాసేపు 
నడిచిపోతుంటాము అవన్నీ దాటేస్తూ మరోవైపు 


!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా



కవిత నెం145:నన్ను మార్చిన నీవు

కవిత నెం :145
*నన్ను మార్చిన నీవు * కదలని బండరాయిలా ఉన్నా ఇన్నాళ్ళు 
నన్ను కదిలే శిల్పాని గా చేసావు 
గాలికి ఊగని గోడగా  నిలుచున్నా ఇన్నాళ్ళు 
చల్లగాలిని చూపి స్పందించే  సరాగాన్ని గా చేసావు 
మెదలని మట్టిముద్దగా పోదిగియున్న ఇన్నాళ్ళు 
మెరిసే ముత్యంలా మార్చి మధురాన్ని  ఇచ్చావు 
వలలో చిక్కిన చేపపిల్లలా ఉన్నా ఇన్నాళ్ళు 
వసంతరాగాన్ని వినిపించే వీణ గా నన్ను మార్చావు 
సుడిగుండంలో ఊపిరి అందని ఇసుకరేణువు గా ఉన్నా ఇన్నాళ్ళు 
సువాసనలు పుట్టించే పుష్పాన్ని గా నన్ను చేసావు 
ఇన్నాళ్ళు నేనేరుగని ప్రపంచం 
నా కాళ్ళ ముందుకు తెచ్చావు 
నాకు తెలియని 
ప్రేమాబిమానాన్ని చూపావు 
ఆరిపోయే దీపంలా  ఉన్నా ఇన్నాళ్ళు 
ఆశలు పెంచుకుని పునర్జన్మ ను 
పొందినట్టుగా 
కొత్త జీవితాన్ని నాకు ఇచ్చావు 
నా హృదయాన్ని నిద్దుర లేపావునేస్తం 

!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా

కవిత నెం144:చెలీ నీవెక్కడ

కవిత నెం :144
*చెలీ నీవెక్కడ * రోజూ గడుస్తున్నదే 
పొద్దు వాలుచున్నదే 
చెలీ నీ జాడ ఏడున్నదే

మబ్బు పట్టుతున్నదే 
చినుకు పడుతూ ఉన్నదే 
చెలీ నీ తోడూ ఏడున్నదే 

సూర్యుడు వస్తున్నాడు 
చంద్రుడు పోతున్నాడు 
నీ గురించి నాకెవ్వరూ చెప్తారు 

పావురాన్ని పెంచాను 
రామచిలుకనే ఉంచాను 
నీ కేరాఫ్ అడ్రస్ వాటికి ఏమని చెప్పను 

అమాంతంగా ఉలిక్కిపాటు 
అనుమానంగా అటు ఇటు చూపు 
చూస్తున్నా నీ రూపాన్నే దిక్కులవైపు 

సీతాకోకచిలుకని అడిగా 
ఈ రంగులరూపం నీవని 
ప్రతి పువ్వుపై తుమ్మెదనడిగా
నా చెలి పరిమళం ఏదని 

వింటున్నావా వెన్నెల కూనా 
ఈ గడిసే రాతిరి జామునా
కంటున్నావా కమలం పువ్వా 
నడిచే నీటి లోతునా 

ఉన్నా, నేనున్నా వేచియున్నా 
రావే, దరిరావే ఓ మైనా 

!!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా

కవిత నెం143:ప్రియుడు

కవిత నెం :143

ప్రేయసి రావే నా ఊర్వసి రావే అనే పాటకు
ప్రియురాలి హృదయం స్పందిస్తుందా ?
ప్రియుడితో ప్రేమాయణం సాగించేటప్పుడు
తన కంటి చూపుతో వాడికి కంటిమీద కునుకు ఉండదు 
తన చేతి స్పర్స తో వాడి మనసు నిలువదు 
తన కాలిమువ్వల సవ్వడితో 
వాడి హృదయం తన అడుగుల వెమ్మట 
పరుగులు తీస్తుంది 
తన వాలు జడ వయ్యారి సొగసులకు 
వాడి చూపు మతి తప్పి పరిబ్రమిస్తుంది 
వాడి మాటలు తన ప్రేయసి అందాలను 
ముద్ద మనోహర గంధాలను చెప్పటంలోనే 
వాడి జీవితకాలమంతా గడిచిపోతుంది 
ప్రేయసి పరిచయం ఒక ఉషోదయంలా వస్తుంది 
తన గమనం అస్తమించే సూర్యుని కాంతిలా పోతుంది 
ప్రియుడి చెంత ఉన్నన్నాళ్ళు తనకేమి లోటు ఉండదు 
ఆ ప్రియుడి ప్రణయం ముగిసినా కూడా 
తనకేమి తీపిబాధైనా దరిచేరదు 
చివరకు వెన్నెల్లో నీడలా 
వాడిపోయిన పుష్పం లా 
కాలికింద చెప్పులా 
ఒక ప్రళయం వచ్చి ముగిసినా తర్వాత 
ఉండే నిశబ్దం లా 
ఆ ప్రియుడు అల మిగిలిపోతాడు 
నిజమెంత ఉన్నా లేకున్నా 
ఒంటరిజీవితవేకువ కు 
తోరణ మాల  ఆ ప్రియుడు 

!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా

కవిత నెం 142:గుప్పెడు గుండె

కవిత నెం :142

గుప్పెడు గుండె కోసం 
కొండంత ప్రేమను నేను 
నా మనసులో దాచి ఉంచా

కనురెప్పల మాటున 
కనుపాపై నా కళ్ళలో తన రూపాన్ని 
నా కన్నీళ్ళలో దాచి ఉంచా 

మూగబోయిన  నా మాటలశబ్దంలో 
తనపై రేగిన ప్రేమ ప్రవాహాన్ని 
నా మౌనంలోదాచి ఉంచా 

ఆనందక్షనాలే నా చుట్టూ యున్నా 
తనకోసం కరిగే నా భగ్నప్రేమను 
నా ఊపిరిలో దాచి ఉంచా  

విడిపోయిన తన చెలిమిని స్మరిస్తూ 
గడచినా తన కలిమి బందాన్ని సృశిస్తూ 
వెతకలేక తన కోసం 
వెంటాడుతూనే ఈ నా యెర్రి ప్రేమను 
నా అణువణువునా దాచి ఉంచా 

!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా



కవిత నెం141:మరచిపో మనసా

కవిత నెం :141

మరచిపో మరచిపో మరచిపో మనసా 
విడిచిపో విడిచిపో విడిచిపో మనసా 
గతం జ్ఞాపకాలు -గుర్తు రానీయకు 
గుర్తుచేస్తూ గుర్తుచేస్తూ -గుబులునే రేపకు 

అందమైన బృందావనం లాంటి 
గతము నాది కాదు 
బందమైన అనుబందమైన 
అది ప్రేమ పొదరిల్లు కాదు 

నా గతమంతా - నీటిముల్లు
నా గతమంతా - చేదుపల్లు
స్మరించి వాటిని సంతోషవాకిటి
నే చేరలేను నే చేరలేను 

ఆహ్వానించే ఆత్మీయఅతిది లాంటి 
గతము నాది కాదు 
ఇష్టమైన ఇష్టపడుచున్న 
నా ప్రియతము ఏది కాదు 
నా గతమంతా -మబ్బుముసురు 
నా గతమంతా - చేదుచిగురు 
పిలిపించి వాటిని పులకింత లోకిలి 
నే చూడలేను నే చూడలేను 

''వెలుతురిని చూసి చేకటి తప్పుకునేలా
వర్తమానాన్ని చూసి గతం గాయమైపోతుంది 
కాని నా ఈ గతం మానలేని గాయమై 
నన్నెందుకిలా వెంటాడుతుంది వెంటాడుతుంది 

!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా 

కవిత నెం140:ప్రేమ సందేశం

కవిత నెం :140

ప్రియా అంటూ మొదలెట్టాను 
ప్రేమను నా మనసులోంచి బయటపెట్టాను 
మొట్టమొదటి సారిగా నిన్ను చూసాను 
నీతో చెలిమి చేయాలని సంకల్పించాను 
నిన్ను ,నీ నీడని అనుసరించాను 
నీ పాదముద్రలో నా అడుగు కొనసాగించాను 
ఏనాటి జన్మలోని మన బందమో 
ఈనాడు నిన్ను నన్ను కలుపుతుందని 
హృదయస్పందన వ్యక్తపరుస్తున్నా 


మొదటిసారిగా నే  రాస్తున్న లేఖ 
తొలిసారిగా నీకై పంపుతున్న లేఖ 
తొలిసారి తోలకరిజల్లుల కాంతుల్లో 
నెమలిలా నడుస్తూ వస్తున్నా 
నిన్ను చూసి నా మనసు ఆగలేక
నీ రాస్తున్న చెలి ఈ ప్రేమ లేఖ  
నీ అందమో ,నీ మనసుతో నాకు 
పెనవేసుకున్న బందమో 
నీవు తప్ప వీరే ఈ కాంతిని 
చూడనంతుంది నా నయనం
నిన్నే నిన్నే కోరుకుంటుంది నా ప్రాణం 


''నా మనసును కుంచెగా చేసి 
ఆ హరివిల్లుని ప్రేమలేఖగా చేసి 
ఆకాశంలోని మేఘమాలలతో 
పంపుతున్న చెలి ఈ ప్రేమ సందేశం ''


అక్షరాల సత్యం - నేను నిన్నుప్రేమిస్తున్నా 
ఆకాశమే సాక్ష్యం - నేను నిన్ను ప్రేమిస్తున్నా
అనునిత్యం -నిన్ను ప్రేమిస్తూనే ఉంటా 
రేపటి రోజున నీ జవాబుకోసం -నీ వేచి ఉంటా 


!!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా 





కవిత నెం139:నీ పిలుపు

కవిత నెం :139

ప్రియా నీ పిలుపు విన్న ఈ క్షణం 
మరణలోకాల అంచులకి వెళ్ళిపోతున్న నా మనసుకి 
మరోజన్మ ఎత్తినట్టుగా ఉంది. 
నీ ప్రేమే నాకు వరం ,నీవెక్కడున్న నీవు చూపించే ప్రేమే 
నన్ను ఒంటరివాడు అనే బావాన్ని వెళ్ళగొట్టి , 
నా గొంతులో అమృతాన్ని పోసి,
నా తనువుకి నూతన తేజస్సునిచ్చి,
నా హృదయద్వారాలను తెరిపించి 
దానిలో నీ స్థానాన్ని ఎప్పుడూ పదిలపరిచేలా చేస్తుంది. 
ఏదో అత్మస్తైర్యం నా అంతరంగంలోకి అడుగుపెడుతుంది 
నీ స్వర సవ్వడి వింటే .
నాలో దాగివున్న నిరాశల కెరటాలు ఒక్కసారిగా 
ఉప్పెనలా ఎగిరిపోతాయి నీ చిన్ని మాట వినపడితే 
నీతో చాలా మాట్లాడాలనిపిస్తుంది 
ఏదో గొప్ప కావ్యమే రాయాలి అనిపిస్తుంది 
నీకోసం ఇంక ఏదో ఏదో చెయ్యాలి అనిపిస్తుంది 
నీవు నాతొ మాట్లాడుతున్న 
ఈ నిముషం కాదు కాదు 
ఈ సమయం కాదు కాదు 
ఈ కలం నిర్విరామంగా కొనసాగితే 
బాగుండు అనిపిస్తుంది 
నా గుండెలోపల దాగివున్నఈ  ప్రేమతరంగ బావాలు 
నీ ప్రేమబందంతో పంచుకోవాలి అనిపిస్తుంది 
నీవు మాట్లాడుతూ ఉండే ఈ సున్నితసమయంలో 
నేను నీవుగా మారినట్టు, నీవే నాలోన చేరినట్టు అనిపిస్తుంది 
నేకు నేను కాని ,నాకు నీవు కాని ''ఐ లవ్ యు '' 
ఒకరికిఒకరం చెప్పుకుంటుంటే నా తనువు తిమ్మిరెక్కి 
నీ ప్రేమ తన్మయత్వంలో తడిసిపోయి 
ఈ లోకంలో మనమిద్దరమే ఒకరికోసం ఒకరు 
ఉన్నారన్న సత్యాన్నే ఆ పంచభూతాల సాక్షిగా 
స్పష్టంగా ఈ కాలంతో సంబంధం లేకుండా 
నిజమైన ప్రేమ అంటే ఏమిటో 
కొత్తగా చూస్తున్నట్టు ఉంది 
ఈ మన ''ఐ లవ్ యు'' అనే పదంలో 
ఏదేమైనా నా ప్రియసఖి నీవు నన్ను పలకరించిన 
ఈ సమయం చిరంజీవి అవునో కాదో తెలియదు కాని 
నా మనసుకు అయుస్సును పోసింది ఇంకొంతకాలం .


!!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా 

కవిత నెం138:నా ప్రేమకిరణం

కవిత నెం :138

ఒక వెన్నెల దీపం నాకెప్పుడూ కావాలి 
నా నీడతో పాటు నడవాలి 
నా తనువులో నాకు తోడూ కావాలి
నా అడుగుల వెంట తన కాంతి ప్రసారం కావాలి 
తను ఇచ్చే కాంతికి నా హృదయద్వారాలు తెరుసుకుని  
నా మనసు ఈ కాలంతో పాటు నడవాలి 
అలా సాగిపోయే నా మనసుకు నా వెన్నెల నవ్వే కదా
నా మనసుకు అందం ,ఆనందం 
నా వెన్నెల చల్లని చూపుకు నా నడకకు ఊపిరి రావాలి 
నా ఊపిరి నా వెన్నెల కోసమే ప్రతిక్షణం కరిగిపోవాలి  
నా ఊపిరి కరిగిపోతున్నా నేను బ్రతికివున్నట్లే కదా 
నా వెన్నెల కాంతుల్లో 
కరిగే కొవ్వొత్తి లాగా 
నా ప్రాణం అంతా తనకోసమే 
నా ప్రనవస్వరూపం తన ధ్యానమే 
నా ప్రేమకిరణం తనే తనే తనే 




!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా 




కవిత నెం137:143

కవిత నెం :137

చెలియా నీ 143 
నా కదే 2  by 3 
అదే కదా హ్యాపీ హ్యాపీ 
143 అంటే అర్ధం ఎముంటుందే
అనుకున్నా నే ఇంతకూ ముందే 
తెలిసింది నాకు ఈరోజు నీవల్లే 
143  వరము
అది నాకే దొరికిందిలే 


చెలియా ఐ లవ్ యు 
సఖియా ఐ లవ్ యు 
నేను నిన్ను ప్రేమిస్తున్నా 
मैंने तुमसे प्यार खिया 
मे पागल होगया 
చెలియా నీ వాళ్ళ 
చలిజ్వరం వస్తుందేమో మైనా // చెలియా//


చూసాను 143  లో నీ ప్రేమను 
చెప్పను నేనే నేకు ఐ లవ్ యు అని 
143 లో ఉన్న కేరింగ్ 
143 లో ఉన్న ఫీలింగ్ 
143 లో ఉన్న డ్రీమింగ్
143 లో ఉన్న స్ట్టఫ్ఫింగ్
143 లో ఉన్న కిక్కింగ్
143 లో ఉన్న లవ్వింగ్ 

తెలిసింది నాకు ఈరోజు నీవల్లే 
143  వరము
అది నాకే దొరికిందిలే 

143  అనే పదం మూడక్షరాలైనా 
మూడు ముళ్ళ బంధానికి కూడా 
ఇదే పునాది అని తెలుసుకున్నా 

నీ స్వరంలోంచి పుట్టే ఆ మాట 
నా గుండెలోతుల్లోకి ఒక తూటాలా 
దూసుకుపోతుంది 
నా నరనరం వేడెక్కిపోతుంది 
నా రక్తంలోకి చేరి నా బ్లడ్ గ్రూప్ ని 
కూడా ''143 '' లా మార్చేస్తుంది చెలీ 

143 అంటే

నేను నిన్ను ప్రేమిస్తున్నా 
నేను నీకోసమే జీవిస్తున్నా 
ఇది చూస్తానికి సింపుల్ గా ఉన్నా 
దాని అర్ధం అహోబిలం 
దానిలో ఉంది ఓ తన్మయత్వం 
దానిలో ఉంది 'ప్రేమ' అనే ఓ రూపం 
దానిలో ఉంది 'నువ్వు-నేను' అనే ప్రాణం 

రెండు హృదయాల్ని ఒకటిగా పలికించేది
రెండు మనసుల్ని ఒకటిగా బ్రతికించేది 

ఈ ఐ లవ్ యు 
    ఐ లవ్ యు 

తెలిసింది నాకు ఈరోజు నీవల్లే 
143  వరము
అది నాకే దొరికిందిలే 

!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా




కవిత నెం136:ఓ ప్రియా నీకు ''హ్యాపీ న్యూ ఇయర్ ''


కవిత నెం : 136

*ఓ ప్రియా నీకు ''హ్యాపీ న్యూ ఇయర్  '' *
రచన : 13, హైదరాబాద్


ప్రియా నీవు లేక గడిచిపోయింది క్షణం
ఆ క్షణం క్యాలెండరు నే తిప్పేసింది
ఆ క్యాలెండరు కాస్త సంవత్సరం అయ్యింది
ఎలాగా నీవున్నావు ?
ఏం చేస్తుంటావు అని
నా మనసు పదే పదే ప్రశ్నలే వేసింది
కాని  సమాధానం సాయంత్రానికి నిద్దురపోతోంది కాని
నీ గురించి నాకేమి ముచ్చట నివ్వకుంది
గడియ   గడియకి నా గుండె వేగం పెరిగింది
గడియారం మాత్రం అలా నడుస్తూనే ఉంది
గడిచిన జ్ఞాపకాలను ఒక నిఘంటువు లా మారుతుంది
గడువబోయే కాలాన్ని నిర్దేశించలేక పోతోంది
గువ్వలన్నా నీ  గూడు చేరి
నా సమాచారాన్ని చేరవేస్తాయోమో అనుకుంటే
పోరా పనిచూసుకోరా అంటూ
పోడిముక్కులతో నన్ను ఎద్దేవా చేయసాగాయి
ఇక emiti  నాకు  దిక్కు అని దిగులుపడుతుంటే
అది నా హక్కును గుర్తుచేసింది
ఆ హక్కు ఏమిటో తెలుసా ?
ఇదిగో ilaa  పిచ్చిరాతలు రాసుకోవటం
పొద్దున్నే నుంచి సాయంత్రం వరకూ
ఒక రోజు ఎలా గడుస్తుంది అంటే
ఈ రోజుకైనా నీ కబురు వస్తుందా
మరో రోజుకైనా నీ జవాబు వస్తుందా
అంటూ ఆలోచన ఒక నావలా సాగుతుంది
ఆ రోజులన్నీ నెలలుగా
ఆ నెలలు అన్నీ సంవత్సరం గా మారి పోయింది
మరో కొత్త సంవత్సరం పుట్టింది
మరి నా మతి ఏమైపోయింది
చలించని గుండెరాయిలా చేసి
ఒక గూడ్సు బండిలో దాన్ని పడేసి 
ఆ నూతన సంవత్సరం లోకి మోసుకొచ్చింది 
మరుగుతున్న నా రక్త ప్రవాహం 
నీరు గారుతున్న నా అశ్రు భాష్పం 
జీవం లేని రూపం లా నా శరీరం
అలాగే నిద్దురపోతూ నా పయనం 
ఈ నూతన సంవత్సరం లోనైనా 
నీ నీరాజనం కోసం 
నిరీక్షణను కొనసాగిస్తూ 
ఓ ప్రియా నీకు ''హ్యాపీ న్యూ ఇయర్''

!!!!!!!!!!!!!!!

కవిత నెం135:ప్రేమంటే

కవిత నెం :135

కవిత పేరు : ప్రేమంటే
రచన : రాజేంద్ర ప్రసాద్
రచన సంఖ్య : మార్చి (3 ),త(27 )
 స్థలం : హైదరాబాద్, ఆంద్ర ప్రదేశ్
తేది: 30 -03 -2012 
సమయం : 6  గం // 52  ని. లు

ప్రేమంటే ఒక ఆకర్షణ
రెండు హృదయాల సంఘర్షణ 
రెండు తనువుల బంధం తో సాగే ఆత్మీయ ప్రేరణ 
ఇది స్నేహంలా పరిచయమవుతుంది 
మోడులా మారిన వృక్షానికి చిగురు నిస్తుంది 
గుండెలో ఎగసిపడే మంటకి దాహాన్ని తీరుస్తుంది 
సున్నితమైన చిచ్చర పిడుగు ఇది 
చిరునవ్వులా నిన్ను చుట్టేస్తుంది
మరుమల్లెలా పరిమళిస్తుంది
నీ నీడలా నిన్నే follow  అవుతుంది 
క్షణకాలంతో మొదలై
ఈ కాలాంతరం నీతో ఉండిపోతుంది
వర్షపు చిన్నుకులా వచ్చి వరదై పొంగుతుంది 
సంద్రంలోని అలలా నీ గుండెలో చేరిపోతుంది
నీకోసం ఒక తోడును ఏర్పాటు చేస్తుంది 
ఆ తోడుతోనే నీ ప్రయాణాన్ని లిఖిస్తుంది 
అద్బుతమైన ఆంతర్యం ఈ ప్రేమ
సంచలన సంగమం ఈ ప్రేమ
చరితలను సృష్టించేది ఈ ప్రేమ
జన్మ జన్మల బంధం ఈ ప్రేమ 
జనమంతా వెంటాడే చెలిమి ఈ ప్రేమ
ప్రేమ పుట్టుకకు పునాది ఉండదు
ప్రేమకు మరణం సంభవించదు
కాని ఈ ప్రేమ రక రకాలుగా ఉంటుంది
దీనికి ఒక రూపం అంటూ ఉండదు
కాని ఊసరవెల్లిలా రంగులను మారుస్తుంది
ప్రేమకు నిర్వచనం చెప్పలేము
ఎందుకంటే అది నిర్వచించ టానికి అందదు

కవిత నెం134:నువ్వంటేనే

కవిత నెం :134

నువ్వంటేనే మోహం 
నువ్వంటేనే ద్వేషం 
ఎందుకు చెలియా నాలో ఈ రోషం 

నువ్వంటేనే  ప్రాణం 
నువ్వంటేనే శూన్యం 
ఎందుకు చెలియా నాకీ అయోమయం 

నువ్వంటేనే ఇష్టం 
నువ్వంటేనే కష్టం 
నువ్వంటేనే నాలో ఉన్న ఉద్రేకం

చెలియా చెప్పే కధలా
చెలియా చెరుగని వ్యధలా 
ఏముందే  ఇంతలా మన మధ్యనా 

గుండెలో బరువై నీవు
కళ్లలో  వెలుగై నావు
కనిపించక కసి రేపావు

గుండెచాటున చెలిమై నీవు
నా నీడమాటున అడుగైనావు
నేనంటే నీవుగా మార్చేసావు

ఇన్నాళ్ళు తెలియనే లేదే - ఎడబాటంటే
ఇప్పుడే అలవాటవుతుందే - ఒంటరి అంటే             

నువ్వంటేనే మౌనం
నువ్వంటేనే ఒక ఉదయం  
నువ్వంటేనే నా చుట్టూ తిరిగే భూగోళం      

కవిత నెం133:ఎక్కడికీ నీ పరుగు

కవిత నెం :133
*ఎక్కడికీ నీ పరుగు * చెప్పినా విననంటివి - ఈ వెర్రి మాటలు 
ఆపినా ఆగనంటివి - ఇదే ఆఖరి చూపులు 
ప్రేమగా ఒక్కసారి పిలుపైనా లేదేమరి 
నే పిలుస్తున్నా నీ గుండె తాకలేదే 
ఏదో ఏదో ఏదో పిచ్చిగా అయిపోతుందే చెత్తగా 
ఏంటో ఏంటో ఏంటో వింతగా నీ యవ్వారముందే తంటగా 
చినుకైనా చెంపను తాకి - చిరు ప్రేమనిస్తుంది 
కునుకైనా నిద్రపోమ్మంటూ - జోల కొడుతుంది 
నువ్వుంటే చాలనేల -చిరుగాలి సంగీతం 
నేనుండే చోటనేగా -వెన్నెల హాయివాటం 
ఏది ఏమైనా పట్టనే పట్టదు 
ఎవ్వరేమన్నా మళ్ళీ తిరుగదు  నీ మనసు 
ఎదగోల పెట్టి - ఎవ్వరు నువ్వంటూ 
ఎగురుకుంటూ పోతున్నావు 
తెలుసుకుంటావో
నాకే తెలియదనుకుంటావో
మన మద్య దాగియున్న ఈ ''ప్రేమ'' ఏదని ?

Saturday 11 April 2015

కవిత నెం132 :వినాయకా

కవిత నెం :132 //వినాయకా //

ఆది  దేవ నీవయా
అభయహస్తం నీదయా
జై బోలో గణేషాయా

మొట్టమొదటి దీవెన
ప్రధమమైన  పండుగ
నీ చవితి నేగ వినాయకాయ

అందుకో అంజలి 
ప్రతి ఇంటింటా వాకిలి
వెల్కం అనే వాక్కుతో మరి

గణ గణ గణ గణ గణపతి దేవా
శరణు శరణు శరణు నీయగా రావా


శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం 
సుభసూచికం నీ పదం 
సుభకార్యవరణం నీవున్న ఆవరణం


ఇష్టంగా పూజిస్తే నిన్ను
ఈ కష్టమంటూ దరిచేర నివ్వవూ


అండ దండ నీవేలే
అందరి బందువు నీవేలే




గణ గణ గణ గణ గణపతి దేవా
శరణు శరణు శరణు నీయగా రావా




విఘ్నేశా వినాయక
అందుకో మా హారతిని
చల్లంగా చూడు ఈ బారతిని

విద్యనిమ్ము వినయము నిమ్ము
వివేకంలేనివారికి బుద్ది నిమ్ము

మంచినివ్వు ,మనస్సునివ్వు
అవిరెండు లేనివారికి ఆలోచన కలగనివ్వు

ప్రేమనివ్వు,సేవ నివ్వు
రెండిటిని ఏకంచేసే మైత్రినివ్వు

నీతినివ్వు,నిరతినివ్వు
నేటి గాంధి  లేకున్నా మంచి నడవడినివ్వు

సుఖమివ్వు ,శాంతి నివ్వు
వాటిలో అనడాన్ని చూపే సంతృప్తి నివ్వు

ఆస్తులివ్వు ,అంతస్తులివ్వు
మనదేశం పేదరికం మార్చే మార్పు నివ్వు

విజయమివ్వు ,గర్వం నివ్వు
పక్కవారు గెలిచినా చిరునవ్వు ఇవ్వు

స్నేహం ఇవ్వు,ఐక్యత నివ్వు
మత కుల గోడలు కట్టలేని సమైక్యతా నివ్వు

గణ గణ గణ గణ గణపతి దేవా
శరణు శరణు శరణు నీయగా రావా

!!!!!!!!
గరిమెళ్ళ రాజా























కవిత నెం131:ఇంకా ఇంకా అనుకుంటే

కవిత నెం :131
ఇంకా ఇంకా అనుకుంటే
ఇంకా ఇంకా అనుకుంటే
ఏముంటుంది ?
ఇంకా ఇంకా అనుకుంటే
ఏమి వస్తుంది ?
ఆశకి కావాలి ఇంకా ఇంకా
అవకాశానికి కావాలి ఇంకా ఇంకా
అన్వేషణ కి కావాలి ఇంకా ఇంకా
అత్యుత్తమ  స్థానానికి కావాలి ఇంకా ఇంకా
ఆత్మీయత చూపించే వారున్నామన పరిచయాలు ఇంకా ఇంకా 
బంధాలు ఎన్ని వున్నా మనం వెతికేది  ఇంకా ఇంకా
పాత జబ్బులు ఎన్నివున్నా కొత్త జబ్బులు పుట్టేవి ఇంకా ఇంకా
డబ్బు ఎంత వున్నా దాని జాడ తెలియదు ఇంకా ఇంకా
గెలుపు మన వెంట వున్నాదాని గమనము ఇంకా ఇంకా
అపజయాలు వెంటాడుతున్నా పోరాడాలి ఇంకా ఇంకా
మన చుట్టూ ,మన కంటూ , మన కోసం ఏమున్నా 
మనిషి సంతృప్తి తీరదు ఇంకా ఇంకా

!!!!!!!
గరిమెళ్ళ రాజా



కవిత నెం130: రక్తం

కవిత నెం :130 //రక్తం //

ఒకే రంగుతో లోకంలో ఎప్పుడూ ఉండేది
తన ప్రవాహంతో మనిషిని బ్రతికిస్తూ ఉండేది 
కుల - మత బేదాలకు అతీతమైనది 
అందరు ఒక్కటే అనే సమానత్వాన్ని గుర్తు చేసేది 
మనకు చలనం కల్పించేది 
మనకు స్పర్శను తెలియచేసేది
మన అవయవాలకు శ్వాసను అందించేది 
రక్తం ......రక్తం .......రక్తం .....రక్తం 
ఒక తుపాకి గుండుతో మనిషి ప్రాణం పోతుంది 
ఒక రక్తపు బిందువుతో ఆ ప్రాణం నిలుస్తుంది 
ఒక నీటి బొట్టు దాహాన్ని తీరుస్తుంది
ఒక రక్తపుబొట్టు నూతన ప్రాణాన్ని ఇస్తుంది
అన్ని దానాలలో కెల్లా అన్నదానం గోప్పదంటారు 
కాని సుపరిచిత దానం ఈ రక్త దానం 
వెనుకడుగు వేయవద్దు 
నీ రక్తపు ఉనికిని ఆపవద్దు
పరిశుద్దముగా నువ్వుంటూ 
పంచాప్రానాలను నిలిపే శక్తి నీ రక్తానికి ఇవ్వు 



కవిత నెం129:వామ్మో ఆడవాళ్ళు

కవిత నెం :129 //వామ్మో ఆడవాళ్ళు //

నమ్మొద్దు నమ్మొద్దు ఆడాలని 
నమ్మి వెళ్ళవద్దు నువ్వు పోలో మని
నచ్చితే చేస్తారు ఫ్రెండ్ షిప్పు 
ఆపైన ఎన్నెన్నో గాసిప్సు
ఎన్నున్నా తమకే రెఫెరెన్సు 
చేస్తారు మీకే ప్రేఫరేన్సు 
నువ్వేన్నాడు చూడని డిఫరెన్సు 
కన్పిస్తుందీ వాళ్ళ అప్పీరెన్సు 
పొగడ్తలంటే వాళ్ళకిష్టం 
నువ్వు మారిస్తేనే కష్టం
అమ్మ ప్రేమ వుంటుంది ఆడదిలో 
గొప్ప అప్యయతనిస్తుంది తన ఒడిలో 
ఆరాధనా అంటే అర్ధం చెప్తుంది ఆడదిరా 
అత్మాబిమానం వదులుకోలేదు నీ ముందర
మంచికి మంచి పంచె వైనం అమెదిరా
మాట తేడా వస్తే మొహంచాటుకు పోతుందిరా 
నిన్ను అర్ధం చేసుకునే మనసు అమెదిరా 
వాళ్ళ మాటలకర్డం నీ కంతు చిక్కదురా





కవిత పేరు128:గెలుపు -ఓటమి

కవిత పేరు : 128//గెలుపు -ఓటమి //

ఒక తరుగు ఒక మెరుగు కోసమే
ఒక చెడు ఒక మంచి కోసమే
ఒక బాధ ఒక ఆనందం కోసమే 
ఒక చీకటి ఒక వెలుగు కోసమే
ఒక నష్టం ఒక లాభం కోసమే 
ఒక విత్తు ఒక చెట్టు కోసమే
ఒక ప్రళయం ఒక మార్పు కోసమే
ఒక మరణం ఒక జననం కోసమే
ఒక నిశబ్దం ఒక సంచలనం కోసమే
ఒక కష్టం ఒక సుఖం కోసమే
ఒక ఓటమి ఒక గెలుపు కోసమే
ఒక గతం ఒక భవిష్యత్తు కోసమే
ఏమి జరిగినా అది మంచి కోసమే
ఏమి జరుగుతున్నా అది మన కోసమే
కాబట్టి
జరిగిన వాటి గురించి వద్దు परीशान
జరగబోయే దాని గురించి నువ్వు చెయ్యి सोचन 
!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా



కవిత నెం127:అహం


కవిత నెం :127//అహం //
అహం
అహం అహం అహం 
అహం బ్రహ్మస్మి అనే అహం
నేనే నిత్యం అనే అహం
నేనే సత్యం అనే అహం
అంతా నేనే అనే అహం
పొగడ్తలతో పొంగేది అహం
విజయంలో నిలిచేది అహం
తప్పులను ఒప్పుకోదు అహం
సమర్దతకు ముందడుగు అహం 
ఆలోచనను మలుస్తుంది అహం
అబిమానాన్ని మాపుతుంది అహం 
అనుబంధాన్ని తెన్చేస్తుంది అహం 
అధికారం కావాలంటుంది అహం 
ఆధిపత్య పోరు చేస్తుంది ఈ అహం 
ప్రవర్తనను మారుస్తుంది ఈ అహం 
పంతంను పెంచుతుంది ఈ అహం 
చెడుకి మార్గం వేస్తుంది ఈ అహం 
మంచిని తున్చివేస్తుంది ఈ అహం 
అందమైన రాకాసి ఈ అహం 
మన అందరిలో ఉంటుంది ఈ అహం
అది తెలుసుకోగలిగితే విజయపదంలో ఉంటుంది నీ పయనం
తెలియకుంటే మన మార్గమే శూన్యం

!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా




కవిత నెం126:నిజం

కవిత నెం :126 //నిజం //

నిజం అనేది నీడ లాంటిది 
నన్ను చూసి అది పారిపోతుంది
ఆ తర్వాత ఐనా నాకు కనిపించ లేదు నిజం 
అది నాలోనే ఉంటుంది
నాతోనే ఉంటుంది 
కాని నా చుట్టూ అది మాత్రం కనపడదు 
అన్నీ నిజమే అని అనుకుంటూవుంటాను
అంటా మనదే అనే బ్రమలో ఉంటాను 
హాయినిచ్చే ఊహల్లో విహరిస్తుంటాను 
స్వర్గం ఉందొ ,లేదో కాని 
సమస్త సుఖాలు నావే అనుకుంటాను 
వీటన్నింటిలో ఉండదు నిజం 
నిజం లేని జీవితం కల్పితం 
అంటా ఒక నాటకం 
బందాలు,బంధుత్వాలు ఏవీ కాదు శాశ్వతం 
అనే ఒకే ఒక్క నిజం తెలుసుకున్నా ఈ క్షణం 
క్షనమన్నది ఒక బ్రమనం
అది కాలంతో పాటు మారుతూ ఉంటుంది 
విశ్వం చుట్టూ వెర్రి గంతులు వేస్తూ తిరుగుతుంటుంది 
నిజమా ! నీవెక్కడ అంటే ?
నా పుట్టుక - చావు రెంటిని మాత్రమె 
రెండు కల్లులా చూపిస్తూ వాటి వరకే నేను ఉండేది 
వాటిమధ్య జీవితంలోనే నీవు బ్రతికేది అంటూ 
వేలు పెట్టి నాకు చూపిస్తుంది 
ఆకాశంలోని హరివిల్లులా
మరి ఎక్కడ నువ్వు ఉంటావు అంటే 
కనిపించని కాలంలో 
కాలబ్రమనం చేస్తూ వుంటా 
అంటూ ఉడాయిస్తుంది

!!!!!!!!!
గరిమెళ్ళ రాజా








కవిత నెం 125:సమాజం

కవిత నెం :125//సమాజం //

సమాజం అంటే చరిత్ర కాదు
సమాజం అంటే కధలు కాదు
సమాజం అంటే నేటి నిజం
సమాజం అంటే అబివృద్ది కాదు 
సమాజం అంటే అనుకరణ కాదు
సమాజం అంటే నేటి చైతన్యం
సమాజం అంటే మన అందరి కుటుంబం 
సమాజం అంటే మన ప్రాంతీయం 
సమాజం అంటే మన రాష్ట్రీయం 
సమాజం అంటే మన జాతీయం 
సమాజం అంటే అస్తమిస్తున్న అరుణం కాదు 
సమాజం అంటే ఉదయిస్తున్న ఉదయం 
సమాజం అంటే ఒక అధ్యాయం
సమాజం అంటే ఒక పుస్తకమ
సమాజం అంటే మన సంస్కృతీ 
సమాజం అంటే మన సంపద
సమాజం అంటే మన రాజకీయం కాదు 
సమాజం అంటే మనకుండే రాజసం 
సమాజం అంటే ప్రజల సమూహం
సమాజం అంటే ప్రజల అభిమతం 
సమాజం అంటే మనకున్న గౌరవం 
సమాజం అంటే ఒక సౌష్టవం 
సమాజం అంటే మంచి సంకల్పం 
సమాజం మన ఆలోచనల రూపం
సమాజం భావి భారతుల కల్పవృక్షం 
సమాజం అంటే మన ఐకమత్యం 
సమాజం అంటే మన మనుగడ చిహ్నం 
సమాజం అంటే పురాతనం 
నేటి వారసుల కది నూతనం 
సమాజమే ఒక దేవాలయం 
అందులో మనమందరం అర్చకులం
మనమంతా  ఒకే కులం 
మనమంతా ఒకే గూటి గువ్వళం
సమాజం కోసం తోడ్పడండి 
సమాజం కోసం కొంచెమైనా మారండి
సమాజం అంటే ఒక ఆదర్శం 
మన ఆదర్శాల విలువలను పెంచండి 
మనం ఇతరులకి ఆదర్శం కాకపోయినా 
మన ఆచరణలతో నిర్మించేదే ఈ సమాజం

!!!!!!!!!
గరిమెళ్ళ రాజా










కవిత నెం124:కవిత్వం

కవిత నెం :118//కవిత్వం //

కవిత్వం అనేది కలలు కాదు
కవిత్వం అనేది ఒక కలం 
కవిత్వం అనేది ఒక గలం
కవిత్వం అనేది కల్పితం కాదు
కవిత్వం అనేది ఒక వాస్తవం 
కవిత్వం అనేది ఒక సాహిత్యం 
కవిత్వం అనేది ఒక సంపద
కవిత్వం అనేది ఒక హృదయ స్పందన 
కవిత్వం అక్షరంలో నుంచి పుడుతుంది 
కవిత్వం ఆశలవెల్లువల లో నుంచి పుడుతుంది 
అక్షరజ్యోతి లా వెలుగుతుంది 
అచంచలమైన అయుదమై సాగుతుంది 
కవిత్వం రాసే ప్రతి కలంలో తన గళాన్ని ఎత్తి చూపిస్తుంది 
కవిత్వం తన మనసు స్పందనల్ని 
మేఘ సందేశంగా చేస్తుంది 
కవిత్వం కదిలించిన హృదయంలో నుంచి పుడుతుంది 
జ్వలముఖిలా మెరిసే గుణం కవిత్వానిది 
జన్జామారుతం రమ్యభారితం 
ఈ కవిత్వం సుందర రూపం 
పెనవేసుకున్న పవిత్రజలాల సంగమం ఈ కవిత్వం 
పుష్పించే అరుణోదయ వేకువ జల్లుల ఉదయం 
ఈ కవిత్వం

!!!!!!!!
గరిమెళ్ళ రాజా


కవిత నెం123:జననం


కవిత నెం :123//జననం //
*******జననం ******
సూర్యునితోనే వేకువ జననం 
చంద్రునితోనే వెన్నెల జననం 
మేఘం తోనే వర్షం జననం 
వర్షంతోనే సంద్రం జననం 
సంద్రంతోనే ముత్యం జననం 
పువ్వులలోనే పరిమళం జననం 
అందమైన ఈ ప్రక్రుతి జననం 
జీవంలోని ఊపిరి జననం 
సాగే నడకకు అడుగు జననం 
అడుగులతోనే పయనం జననం 
పయనం చేయగా గమ్యం జననం 
కార్యసాదనలో లక్ష్యం జననం 
లక్ష్యంకోసం సంకల్పం జననం 
కృషి చేయగా  విజయం జననం 
ఏదైనా ఒక కార్యంకోసం మన జననం 
జననం అన్నది ప్రతిజన్మల వరం 
జన్మించిన మనము అదృష్టవంతులం 
ఈ జన్మలో ఏదైనా చేయుట మన దర్మం 
ఎందుకు ఈ జన్మ అని అనుకోవటం కన్నా 
ఆహా! ఏమి జన్మ అనుకుంటూ సాగుదామన్న 

!!!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా 


కవిత నెం122:

కవిత నెం :122

ముసురు కమ్మి చినుకునాపలేదు 
గ్రహణం పట్టి సూర్యుని కాంతిని దాచలేదు
వెనుకడుగు వేసినా పులి పంజా వేట మానదు 
నీటిప్రవాహం ఎంతవున్న సుడిగుండాన్ని తప్పించలేదు 
అగ్ని ఎంత ఎగిసిపడుతున్నా నీటిచుక్క ఓడిపోదు
విషనాగుల ముందు ముంగిస బెదరదు 
నిండు కుండ తొణకదు
సంద్రమేన్నడూ ఎండదు 
తోకచుక్కలు ఎన్నిరాలుతున్నా 
అంతరిక్షం అంతరించదు 
జీవితం అనేది ఒడిదుడుకుల సంగమం 
కష్ట సుఖాల సాగరం 
ఎదురుదెబ్బలు తగులుతూ వుంటాయి 
స్పీడ్ బ్రేకార్స్ మనల్ని ముందుకు వెళ్ళకుండా ఆపుతూ వుంటాయి 
ఎన్ని ఎదురు వస్తున్నా కాలాన్ని ఎవ్వడూ క్యాచ్ చేయలేదని తెలుసుకో
గోడను తన్నిన బంతిలా సాగిపో 
దెబ్బతగిలితే కలిగే బాధ 
మన విజయాన్ని గుర్తు చేసే సంకేతంలా వుండాలి 
అవరోదాలు మన స్నేహితులు 
ఆటంకాలు మన సన్నిహితులు 
ఆపదలు మన అపద్మాన్డవులు 
మంచిని ఆహ్వానించే మనసు నీకున్నప్పుడు 
చెడును స్వాగతించే అబిలాష కూడా ఉండాలి 
తప్పు జరిగిందని తల్లదిల్లవద్దు 
చెడు జరుగుతుందని సంకోచించ వద్దు 
నిరాశతో నీ ప్రయాణాన్ని నిశ్రుహ పరచవద్దు 
అతిశయం లేని జేవితంలో నిర్విగ్నంగా ,నిర్మలంగా 
నీ నడకను సాగించు నేస్తం 

!!!!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా



కవిత నెం 121:ఆడవారు

కవిత నెం :121 //ఆడవారు//

ఆడవారు అందంగా ఉంటారు.
పొగరుగా ఉంటారు,వగరుగా ఉంటారు 
స్వీట్ గా ఉంటారు ,హాట్ గా ఉంటారు.
అమితానందం చూపుతారు కాసేపు 
కారాలు మిరియాలు చూపుతారు కాసేపు 
బుజ్జగింపు కాసేపు 
బొందబెత్తుడు కాసేపు 
తెలివిగలవారు లేడీసు 
పదునుగలవారు లేడీసు 
కైపెక్కించే చూపు ఉంటుంది 
కాళికా దేవి రూపం ఉంటుంది 
భూదేవి సహనం ఉంటుంది 
గరుత్మంతుని గర్వముంటుంది 
నిదానముగా నడుస్తారు 
ఫ్యాషన్ షో క్యాట్  వాక్ చేస్తారు 
దొంగచూపులలో దింపుతారు 
ముక్కుసూటిగా వెళ్తే ప్లేట్ పిరాయిస్తారు 
కమ్మని ఊసులెన్నో చెప్తారు 
కాఫీ లాంటి డేస్ మనకే ఇస్తారు 
చెంప చెల్లుమనిపిస్తారు 
నీ చెంతనే ఉంటూ మంచి స్నేహమిస్తారు 
షేరింగ్ ఇస్తారు సింగిల్ హృదయం నీకే అంటారు 
మంచి కేరింగ్ తో నీ మదిని కొల్లగోడతారు 
మంచి సంప్రదాయముంటుంది వారిలో 
మధుర  చమత్కారముంటుంది వారిలో 
గడసరి సొగసులు కురిపిస్తారు 
దాగుడు మూతలు ఆడుతారు 
గిల్లి కజ్జాలు పెట్టుకుంటారు 
కాని ఎవ్వరి స్థానాన్ని వారి మనసులో చెరుగ నీయరు
మాటలెన్నో చెప్తారు 
అర్ధా లెన్నో  తీస్తారు 
కాని వారి భావాల కారణం  తెలియనీయరు 
ప్రతి మగవానికి తోడు ఆడదిరా 
ప్రతి మగవాని వెనుక ఆడదిరా 
చరిత్రకు మూలం ఆడదిరా 
ఆమెలేని చోటు  ఏడ ఉందిరా

ఆడావారికి గౌరవం - మన సృష్టి గర్వ కారణం

!!!!!!!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా





కవిత నెం120:సారీ సో సారీ అక్కా

కవిత నెం :120

సారీ సో సారీ అక్కా 
ఐ యామ్ రియల్లీ సారీ అక్కా 
చిన్నవాడినే కదా నీముందు 
చిన్న చూపు ఎందుకు ముందు ముందు 
చేసిన తప్పుకు క్షమాపనే చెప్పాగా
ఛీ పో అంటూ కస్సంటే ఎలాగా 
వివరం తెలియకపోయినా 
విధేయత ఉందిలే 
పైపైన మాటలకేమి 
నువ్వంటే గౌరవమే 
నేకన్న ఎక్కువ నాకు ఎవ్వరు 
తోబుట్టువేగా మరో మదరు 
క్షమించు క్షమించు క్షమించు 
కోపం తగ్గించు 
విదించు విదించు విదించు 
ఏ శిక్షైనా విదించు 
మాట్లాడు ఒక్కసారి 
తిట్టు మరో మరో సారి 
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ 

!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా 



కవిత నెం 119:గెలుపు ఓటమిల నైజం

కవిత నెం :119
*గెలుపు ఓటమిల నైజం * గెలిచే వారు ఆనంద విహారాలు చేస్తూ ఉంటారు
గెలిచే వారు వేర్రివిలయతాండవం చేస్తూఉంటారు 
గెలిచే వారు తమ భలప్రదర్సన చేస్తూఉంటారు
గెలిచే వారు లోకంతో పని లేకుండా ప్రవర్తిస్తారు
గెలిచే వారు గర్వబంఘ పడుతూ ఉంటారు 
గెలిచే వారు తమసృతిని తప్పుతుంటారు 
గెలిచే వారు తమ క్యాతిని డప్పు కొట్టుకుంటారు 
మరి
ఓడిన వాళ్ళు విశాధచాయాల్లో గడుపుతుంటారు 
ఓడిన వాళ్ళు తమ గోడుల గోడలలో నలుగుతుంటారు 
 ఓడిన వాళ్ళు కాసేపు ఒంటరితనంలోనే గడపాలనుకుంటారు
ఓడిన వాళ్ళు కసితో రగిలిపోతుంటారు 
ఓడిన వాళ్ళు తమ తదుపరి మార్గాలకై అన్వేషిస్తుంటారు
ఓడిన వాళ్ళు తమ కుళ్ళు కుట్రలలో సతమతమవుతుంటారు 
ఓడిన వాళ్ళు ప్రయాసపయనం  చేస్తూ ఉంటారు

గెలుపు ఓటములు ఆది గురువులు
గెలుపు ఓటములు అన్న దమ్ములు
గెలిచినా ఓడినా మన మంచికే కదా 
గెలుపు నీకు జీవిత మలుపు నిస్తుంది
ఓటమి నీకు విజయకాంక్ష నిస్తుంది 
గెలుపు నీకు సత్యానందం నిస్తుంది 
ఓటమి నీకు లక్ష్యసిద్ది నిస్తుంది

గెలుపైన గర్వపడటం
ఓటమిన నిసృహపడటం
మానవ నైజం
అది మన అసంకల్పిత చర్యం 
అది గ్రహించి తెలుసుకొనుట 
మన దర్మం 
అన్నీ కలిపి సాగితేనే 
మన జీవిత పయనం
.............
!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా



కవిత నెం118:చిలక పలికింది

కవిత నెం :118

చిలక పలికింది చిన్నారి పుట్టిన రోజు అని 
కోయిల కూసింది క్రొత్త కాశ్మీరం చూసింది 
చంద్రుడు వేగంతో వస్తున్నాడు 
తనకి విషెస్ చెబుదామని 
కాని మరి ఈ లోపు 'సూర్యారావు' వచ్చి 
'శుభోదయం' చెప్పి మరీ 'శుభాకాంక్షలు' తెలిపాడు 
మరి మన 'చంద్రారావు' ఆగాడా !
'వెండి మబ్బుల పల్లకిలో' 'వరాలవీణ' బహుమతి గా ఇచ్చాడు 
అంటే 'వీణ' ను మీటి 'వరం' అడగాలాట
పాప ఆ 'వీణ' ను మీటి 'వరం' కోరింది 
అది ఏమిటో తెలుసా ?
'చందమామ' కావాలని 

!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా