Saturday 11 April 2015

కవిత నెం88:బార్యంటే

కవిత నెం :88

బార్యంటే ఎందుకురా చులకనగా చూస్తావు
బార్యంటే ఎందుకురా భరితెగించి పోతావు
మూడు ముళ్ళ బంధమన్నది నీకు గుర్తురాదా
ఏడు అడుగులు కలిసినప్పుడు నీకు తెలియలేదా
నాతిచరామి అన్న నాలుక మొద్దు బారినదా
చిటికినవేలు పట్టితివి కదా  ఇప్పుడా చెయ్యి నీకు లేదా

బార్యంటే నీకు తోడుగా
నీవెంటే ఉండే నీడగా
నీలోని సగ భాగమురా
నీ రూపానికి ప్రతిరూపమురా
తనకెందరున్నా అన్నీ వదిలి
నిను నమ్మి వచ్చినదిరా
బంధువులు ఎందరున్నా
తన కుటుంభం నీవేరా
నీకు అండగా నిలిచే వృక్షం
నీ ఇంటిలో వెలిగే దీపం
తానేరా నీకు సౌభాగ్యం
నీ భవబంధాలకు అనురాగం 

భార్య  విలువ తెలుసుకో
తన మనసు గెలుచుకో

భార్యంటే కాదురా నీకు బరువు
భార్యంటే కాదు నీ హక్కు
భార్యంటే కాదు నీ అవసరం
భార్యంటే కాదు నీ అహంకారం


0 comments:

Post a Comment