Saturday 11 April 2015

కవిత నెం109 (థాంక్స్)

కవిత నెం :109 //థాంక్స్//

తప్పేమీ కాదు ఒక చిన్న ''థాంక్స్'' నువ్వు చెప్తే 
నీ తలేమిపోదు ఒక చిన్న ''థాంక్స్'' నువ్వు చెప్తే 
''థాంక్స్'' అనే పదం మన తృప్తి కి ఓ భావం 
''థాంక్స్'' అనే పదం మన సంతోషానికి చిహ్నం 
తేలికగా తీసుకోకు ''థాంక్స్'' లో ఏముందని 
చిన్న చూపు అనుకోమాకు ''థాంక్స్'' అనే మాటకి 

చింత తీర్చిన చిన్ని సాయంకు 
చెలిమిని తెలిపేదే ''థాంక్స్ థాంక్స్''
అడగకుండా పొందిన వరంకు
అబిమానం తెలిపేదే ''థాంక్స్ థాంక్స్'' 
ఖర్చేమి లేనిది 
ముళ్ళ కిరీటం కాదిది 
నీ దిల్ లో జోష్ ని పెంచే 
గొప్ప ఎనర్జీ యేరా ''థాంక్స్ థాంక్స్'' 
ఎదుటివారిలో హావభావాలు 
పలికించే మంత్రమే ''థాంక్స్ థాంక్స్''

తెలియని వ్యక్తిలో ఏదో మైత్రిని 
పెంచే విత్తనమే ''థాంక్స్ థాంక్స్'' 
మాడిన పెదవులో నవ్వులు పూచే 
అమృత అమ్లమే ''థాంక్స్ థాంక్స్''
అప్పు చెప్పు కానిది 
ఆపద ఏమీ కాదిది 
చిన్న మాటతో చిన్న ఫ్రెండ్ గా 
నీతో వచ్చే నీడేరా ''థాంక్స్ థాంక్స్''
ఈ చరిత్రలో సుఖ శాంతులే 
ఇచ్చే వృక్షమే ''థాంక్స్ థాంక్స్''

!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా 


0 comments:

Post a Comment