Saturday 11 April 2015

కవిత నెం114:ఆహా ఏమి ఈ ప్రపంచం

కవిత నెం :114

ఆహా ఏమి ఈ ప్రపంచం 
బహు అందముగా కనపడుచున్నదే 
ఆహా ఏమి ఈ ప్రక్రుతి అందం 
బహు పులకరింప చేస్తున్నదే 
కొట్టగా నేనిప్పుడే పుట్టినట్టుగా 
నాతోటి నక్షత్రాలే నడుచునట్టుగా 
ఆ తారజువ్వే నాకు స్వాగతం చెప్తున్నట్టుగా 
ఆకాశంలో విహరిస్తున్నట్టుగా 
మేఘాలలో ఆడుచున్నట్టుగా 
పరవసింప చేసే ప్రయాణం ఏదో 
ఎప్పుడే నాకు మొదలైనట్టుగా 
ఎన్నాళ్ళు ఎక్కడున్నా నేను 
ఈ సుందరాలకు దూరంగా 
నేటిరోజు తెలిసికొంటిని కదా 
మనకంటూ మరోప్రపంచం ఉందని 
ఆ ప్రపంచంలో నాలాంటివారు 
స్నేహభావం ఉన్న నేస్తాలు ఉన్నారని 
చిన్నపిల్లలు రైమ్స్ పాడుతుంటే
ఆ ముద్దు ముద్దు మాటలు ఎలా ఉంటాయో 
ఆ పదాలు నేనిప్పుడే నేర్చుకుంటున్నట్టుగా 
కల్మషం లేని మనసే నా వంతుగా 
సరిగమ స్వరాలే సప్త పదాలుగా 
కలకలమంటూ గలగలమంటూ 
నా ఈ కలంతో సాగే నా వయసు 
మరి మరి ముందుకు నడిపించుచున్నది 
కొత్తసృతులు ఎన్నో నాతొ పలికించుచున్నది
ఈ కాలమంతా మనతో నిలిచే ,నడిచే వారు ఉన్నా,లేకున్నా 
మన కలంతో పుట్టిన ఈ కవితలు 
నవ భవితలుగా,చిరు జ్ఞాపికలుగా ,చిరు స్నేహితులుగా 
మనతోనే వుంటాయి చిరంజీవులుగా 

!!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా


0 comments:

Post a Comment