Thursday 26 November 2015

కవిత నెం 208:నేను కవినేనా ?

కవిత నెం :208

నేను కవినేనా 


నేను కవినేనా 

మనసు పెట్టే రాస్తాను 
నా కాలానికి పని చెబుతుంటాను 
మరి నేను కవినేనా ?

అక్షరాలను కలుపుతూ ఉంటాను 

అంతరంగాన్ని పలికిస్తూ ఉంటాను 
మరి నేను కవినేనా ?

పాండిత్యంలో ప్రావీణ్యం లేదు 

సాహిత్యాన్ని అభ్యసించలేదు 
మరి నేను కవినేనా ?

అనుభవాలతో అల్లికలు చేస్తుంటాను 

మనోభావాలతో రాతలు రాస్తుంటాను 
మరి నేను కవినేనా ?

అందంగా వర్ణిస్తానో తెలియదు 

అర్ధవంతంగా లిఖిస్తానో తెలియదు 
మరి నేను కవినేనా ?

పుస్తక పఠనం చాలా తక్కువ

మనసు  పఠనం అంటే కొద్దిగా మక్కువ 
మరి నేను కవినేనా ?

నేను రాసేది బాగుంది అనుకుంటాను 

నేను రాసినది నిరుపయోగం కాదనుకుంటాను 
మరి నేను కవినేనా ?

నేననుకున్నది రాయటమే తెలుసు 

నేచెప్పదలుచుకున్నది నాకు ఇలాగే వచ్చు 
మరి నేను కవినేనా ?

ఒకరి ఆదరణ పొందలేని అనర్హుడిని 
నా మనసుని నమ్మిన నాకు నేనే నేస్తాన్ని 
మరి నేను కవినేనా ?

అనవసర రాద్దాంతాలు నా కలం కి లేవు 
అవసరమైన సందేశం  ఒకటున్నా చాలు 
మరి నేను కవినేనా ?

నా రాతలు పిచ్చి కాగితాలే 
నా భావాలు మట్టి బొమ్మలే 
మరి నేను కవినేనా ?

పెద్దగా ఎవ్వరితో పరిచయాలు లేవు 

ఎటువంటి బిరుదులు నా కంటూ లేవు 
మరి నేను కవినేనా ?

కవి అన్న గుర్తింపు కార్డ్ నాకు లేనే లేదు 

ఏ మహామహులతో నేను పోల్చుకోలేను 
మరి నేను కవినేనా ?

నేనింతే అనే అహంబావి ని కాను 
నేర్చుకునే విద్యార్దినే ఈ కాలంలో ,కవిత్వంలో 
మరి నేను కవినేనా ?

- గరిమెళ్ళ గమనాలు 






Wednesday 25 November 2015

కవిత నెం 207:నాడు -నేడు 'దేశం ' లో

కవిత నెం :207

నాడు -నేడు 'దేశం ' లో 

ఒకప్పుడు 
దేశ స్వాతంత్రం కోసం 
మన స్వేచ్చ కోసం 
ఓడారు ,పోరాడారు -గెలిచారు 

అన్ని కులాలు 
అన్ని మతాలు 
అన్ని గ్రామాలు 
ఒక్కటిగా ,సమిష్టిగా -నిలచారు 

ఆత్మ విశ్వాసంతో ,
గుండె ధైర్యంతో ,
రొమ్ము విరచి ,
శత్రువుల  వెన్ను - విరగగొట్టారు 

పరాయివాళ్ల పాలనలో 
సమాది అవుతున్న 
మన దేశ సమైక్త్యతని 
స్వార్ధపరుల నుంచి - రక్షించారు 

మరి ఆ స్వేచ్చ ,స్వాతంత్రం మన సొంతమయ్యాక 
మనం చేసిన మంచి ఏమి ?
మనవళ్ల దేశానికి ఉపయోగమేమి ?

నీ స్వార్ధం 
నీ లోభం 
నీకు నువ్వే ప్రలోభం 

లేదు న్యాయం 
లేదు ధర్మం 
న్యాయ దేవతకే అంధకారం 

మన వాళ్లే 
మన ప్రజలే 
మన దేశమే 
అని ఆలోచన ఎవ్వరికి ?

దొరికినదా దోచుకో 
నీ కీర్తిని పెంచుకో 
నీ కోరిక కోసం 
మానవ ధర్మాన్ని మరచిపో 

ప్రజాస్వామ్యం అంటూ 
రోజుకొక్క పార్టీ పెడుతూ 
నీ పాలనే నిలవాలి అంటూ 
ఎందుకు రాజకీయం ?

ఉన్మాదం 
ఉగ్రవాదం 
పడగ నీడలో 
మన దేశం ఇరుకున పడుతుంటే 

నీ మతం - నీ కులం 
నీ పార్టీ - నా పార్టీ
ఐకమత్యం లేక 
ఒంటరిగా నువ్వు సాగితే 

ఏది రక్షణ 
ఎక్కడుంది దుష్ట శిక్షణ 
అబాగ్యులు 
అమాయకులు 
మన ప్రజలు 
ఆ వినాశనంలో కొట్టుకుపోతే 

రండి కలిసి రండి 
ఒక్కటిగా ఉండండి 
ఎవ్వరికీ ఇవ్వొద్దు అవకాశం 
మన ప్రజలు - మన దేశం 
క్షేమమే -మన దేశ సౌభాగ్యం  









Tuesday 24 November 2015

కవిత నెం 206:ఫేస్ బుక్ స్నేహాలు

కవిత నెం :206

ఫేస్ బుక్ స్నేహాలు

ముఖాలు కనపడవు - ముఖ చిత్రాలు ఉంటాయి 
మనసు తెలియదు - మాటలెన్నో చెప్తాయి 
చిరునామా తెలియదు - కొత్త స్నేహాలు పుడతాయి 
బంధువులెందరు ఉన్నా - ఏ బందుత్వాలు పట్టవు 
అమ్మా ,నాన్న పక్కనే ఉన్నా -  ఆత్మీయతలుండవు 
మొగుడు పెళ్లాల మధ్య - చిచ్చు రగిలిస్తూ ఉంటాయి 
మన దినచర్యను మొత్తం - పబ్లిక్ కి తెలియచేస్తుంటాయి 
రోజుకొక పోస్ట్ పెట్టించి - స్టేటస్ పరిశీలించమంటాయి 
లైక్స్ ,కామెంట్స్ అంటూ - కొత్త మోజు తగిలిస్తాయి 
తెలియని పబ్లిసిటీ కోసం - ఆరాటం పెరిగేలా చేస్తాయి 
ఫ్రెండ్స్ లిస్ట్ ,చాట్ బాక్స్ లతో - కాలక్షేపం చెయ్యమంటాయి 
మీటింగ్స్ ,ప్రోగ్రామ్స్ అంటూ - కొత్త టైం టేబుల్నిస్తాయి 
నిజమైన స్నేహాలు కొన్ని - మొహమాట మిత్రాస్ కొన్ని 
అనవసర పరిచయాలు కొన్ని - అవసరాలకి అండ కొన్ని 
కొత్త అనుభవాలు కొన్ని - చేదు జ్ఞాపకాలు కొన్ని 
మంచి సంకల్పం కోసం కొన్ని - చెడ్డ కార్యకలాపాలు కొన్ని 
పొగరుగా ,వగరుగా - చిరు చిరు స్నేహాలు చిగురించగా 
కారంగా ,మమకారంగా - మధుర బందాల్ని కలుపంగా 
గుసగుసలు కొన్నైతే - రుసరుసలు చూసేవి కొన్ని 
ఆహ్లాదం ,ఆనందం తెచ్చేవి కొన్నైతే - నిరాశతో చూసేవి కొన్ని 
కొన్ని ప్రయోజనాలే - మరికొన్ని నిస్ప్రయోజనాలు 
సోషల్ మీడియా లో పుట్టే స్నేహాలు మాత్రమే ఇవి 
మన సొంతం అనుకుని -మరీ మునిగి పోకండి 
ఇవే ప్రధానం అనుకుని - మీ పనులను మానుకోకండి 
మరీ శృతిమించకుండా -స్నేహ వాతావరణాన్ని ఉంచండి 
ఆరోగ్యంగా ,అందంగా ఉండేలా -ఫేస్ బుక్ స్నేహాలు చెయ్యండి 

Thursday 19 November 2015

కవిత నెం 205 :ఆడు మగాడు

కవిత నెం : 205

అంతర్జాతీయ మగవారి దినోత్సవం సంధర్భంగా 

********************************************
((((((((((ఆడు మగాడు )))))))
_____________________________________________

చిరిగిన చొక్కానైనా ధరిస్తాడు
తన పిల్లలకు ఏ లోటూ రాకుండా చూస్తాడు
ఆడు మగాడు ఒక 'నాన్న 'గా

మాసిన గడ్డంతో తిరుగుతూ ఉంటాడు
తన భార్య అందంగా ఉంటే చాలనుకుంటాడు
ఆడు మగాడు ఒక 'భర్త' గా

చూస్తానికి జులాయిలా కనిపిస్తాడు
పున్నామ నరకం నుంచి తప్పించే యోధుడవుతాడు
ఆడు మగాడు ఒక 'కొడుకు ' గా

అల్లరిచేస్తూ ,ఏడిపిస్తూ ఉంటాడు
అపురూపంగా తన గుండెల్లో పెట్టుకుంటాడు
ఆడు మగాడు ఒక 'సోదరుడు' గా

ఎనలేని ప్రేమను కురిపిస్తాడు
తన ప్రేమకోసం ప్రాణ త్యాగానికైనా సిద్దపడతాడు
ఆడు మగాడు ఒక 'ప్రేమికుడు ' గా

అన్నివేళలా అందుబాటులో ఉంటాడు
అత్మీయతనందిస్తూ నీ అంతరాత్మ గా నిలుస్తాడు
ఆడు మగాడు ఒక 'స్నేహితుడు' గా

సరదాగా గిల్లి కజ్జాలు పెట్టుకునే 'భావ ' గా

వదినంటే అమ్మతో సమానంగా భావించే 'మరిది 'గా

అత్తింట్లో కోడలికి ఆప్తుడు గా నిలచే 'మామ ' గా

నాన్న తర్వాత నీ మేలుకోరుకునే 'బాబాయి' గా

మంచి ,చెడులను విశ్లేషిస్తూ దారిచూపే 'పెద్ద నాన్న ' గా

ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటూ ,తోడుగా ఉండే 'తాతయ్య ' గా 

కుటుంబ భారాన్ని మోసే ఒక 'కూలీ ' గా 

చెమట చిందించు వేళ ఒక 'శ్రామికుడు ' గా 

బాధ్యతలను సమర్దవంతంగా నిర్వహించే ఒక  'ఉద్యోగి' గా 

నీ లక్షానికి చేర్చుటలో ఒక 'డ్రైవర్' గా 

దేశాన్ని సంరక్షించే ఒక 'సైనికుడు' గా 

కర్తవ్యాన్ని నిర్వర్తించే 'కర్త ' గా 

విశ్వాన్ని నడిపించే 'సృష్టికర్త ' గా 

చెప్పుకుంటూ పొతే ఎన్నో విధులు 

ఈ 'పురుషుడు 'లేనిదే ఏ కార్యమూ ఉండదు 

నేడు జరుగుచున్న ప్రపంచ తీరును బట్టి 

మగాడు 'మృగాడు ' గా మారటం చూసి 

పురుషులలో పుణ్య పురుషులు లేకపోవటం చూసి 

ఒక మగాడిని మగాడుగా  చూడలేని లోకంతీరుకు దారి తీసి 

కాని ఇవన్నీ ఒక్కసారి పక్కన పెడితే 

ఆడు మనసున్న 'మగాడే ' మరీ 




















Friday 13 November 2015

కవిత నెం 204:నేటి చుట్టరికాలు

కవిత నెం :204

**నేటి చుట్టరికాలు **

పేరుకి ఉంటుంది రక్త సంబంధం 
కాని మనసులకి ఉండదు ఏ సంబంధం 

కలిసి యుండలేరు 
కలిసినా మనస్పూర్తిగా మాట్లాడుకోలేరు 

నేనే పెద్ద ,నేను చిన్న అనే ఆలోచన తప్ప 
పలకరింపుకి పెదవుల్ని కదిలించలేరు 

వారి స్వార్ధం ,స్వప్రయోజనమే ముందు 
మన తోటి వారే , మన వారే అని తలంచకుండు 

గౌరవం ఇస్తున్నా అది అందుకోలేరు 
ఇంకేదో కావాలని ,బెట్టుగా కూర్చుంటారు 

కుటుంబంలోని బంధాలు కంటే 
సమాజంలోని డబ్బు ,పరపతికై చూస్తుంటారు 

మనవాళ్లు మన స్థాయి కన్నా తక్కువైతే 
మాటవరసకి పిలిచి అవమానిస్తారు 
ఒకవేళ రాకపోతే రాలేదని సాధిస్తారు 

తనకంటే బంధువులలో గొప్పవాళ్లు ఉంటే 
అతిది మర్యాదలతో సత్కరిస్తుంటారు 

ఒకరిని ఒకరు నమ్మలేరు 
ఒకరిపై ఒకరు ప్రేమను పొందలేరు 

నిజమైన ప్రేమ , వాత్సల్యం మరుస్తారు 
కనిపించే డాబుకి ,డబ్బుకి విలువిస్తారు 

అందరిముందు పలానా అని చెప్పుకోలేరు 
ఒకరు వీరికన్నా బాగుంటే ఓర్చుకోలేరు 

అవసరం ఉంటే మాత్రం ఆత్మీయత కురిపిస్తారు 
అవసరం లేదంటే నీ గురించి ఆరా కూడా తీయరు 

పల్లెటూర్లలో ఉన్నప్పుడు చుట్టమే కదా ఆత్మీయం 
పట్నాలు వచ్చాక ఏకాంతమే నీకున్న ఆతిధ్యం 

పండుగలకైనా ఆహ్వానించు కోగల్గుతున్నారా ఇప్పుడు 
ఎవరి తీరు వారే ,ఎడ ముఖం పెడ ముఖాలే కదా ఎప్పుడూ 

పిలిస్తే ప్రేమగా  పలికే చుట్టరికాలు ఉండాలి కాని 
వచ్చామా ,వెళ్ళామా అంటే మాత్రం అవి చట్టరికాలే 

మారుతున్న కాలంతో పాటు బంధాలు మారుతున్నాయి 
ఆ బంధాలు వలన వట్టి బాధలే మిగులుతున్నాయి 

గుర్తుంచుకోండి అందరూ ....... 
మన వారు ,మనకోసం ఉన్నప్పుడు ఆ బంధాన్ని నిలుపుకోండి ఎప్పుడూ 

- గరిమెళ్ళ గమనాలు 

Tuesday 10 November 2015

కవిత నెం 203:నిజమైన దీపావళి రావాలనీ ........

కవిత నెం :203

నిజమైన దీపావళి రావాలనీ ........ 

స్వార్ధానికి బలవుతున్న అనాధలను చూడు 
కోడిపిల్లలా మారుతున్న ఆడపిల్లల బ్రతుకు చూడు 
వ్యసనపరుల కామ క్రీడలకు ఒత్తిలా కరిగిపోయే ఆడ మనసు చూడు 
ర్యాగింగ్ బూతానికి ఆహారమవుతున్న అక్కా ,చెల్లెలను చూడు 
నిర్ద్యాక్ష్యంగా మగ కామందుల చేతిలో నలిగిపోయే నేటి స్త్రీ ని చూడు 
ఎటువంటి రక్షణ లేని సమాజ అరణ్యంలో చిక్కుక్కున్న శీలం చూడు 
ఆడపిల్లలను కని కన్నీరు మున్నీరవుతున్న అమ్మా ,నాన్నలను చూడు 
అన్నం పెట్టే రైతన్న అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చూడు 
పేదరికాన్ని తట్టుకోలేక రోడ్డున పడుతున్న బిక్షగాళ్ళను చూడు 
చదువుకునే స్తోమత లేక పనికి వెళ్తున్న బాల కార్మికులను చూడు 
మదమెక్కి కష్టపడలేక పెరుగుతున్న దొంగతనాలు చూడు 
పేదలను తోక్కేస్తూ అడ్డంగా పెరిగిపోయే సంపన్నులను చూడు 
మద్య తరగతి బ్రతుకునెక్కిరిస్తూ  మండే ధరలు చూడు 
మురికి వాడల్లో ,అనాధ ఆశ్రమాల్లో రగులుతుండే జీవం చూడు 
 మనం బాగున్నా మన చుట్టూ వాళ్ల బాగు కోరుతూ వెలిగించు దీపం 
వారి వారి జీవితాలలో ఎటువంటి చెడు జరగకూడదని వెలిగించు దీపం 
చెడును ఎంత రూపుమాపుతున్నా పుట్టుకొస్తూనే ఉంటది 
చెడు అంతం ఇంకా మిగిలే ఉంది ఈ భూమి పైనా 
అటువంటి చెడున సంక్లిప్తంగా నాశనం అవ్వాలని 
మూగబోయిన బ్రతుకులలో చిరునవ్వులు తారజువ్వలవ్వాలని 
ఈ దీపావళి పండుగ అందరికీ అన్ని శుభాలని చేకూర్చాలని 
నిండు మనస్సుతో ''దీపావళి పండుగ శుభాకాంక్షలు '' 

Monday 2 November 2015

కవిత నెం 202:రైలంట రైలు

కవిత నెం : 202

రైలంట రైలు
దీనికి ఉండదంట వేలా పాలు
ఇది తిరుగుతాది ఎన్నో మైళ్లు
కూస్తూ ఉంటుంది రైలు బెల్లు 
ఆగిన చోట ఉండదు
ప్రతీ చోటా ఇది ఆగదు
కాలంలో ప్రయాణిస్తూఉంటుంది 
కాలాన్ని వెనక్కినెట్టినట్టు ఉంటది 
సమయానికి గమ్యాన్ని చేరలేనిది 
మూడొస్తే వాయువేగంలో పోతది 
సిగ్నల్ అందకపోతే నత్తలాగా నడుస్తది 
సౌకర్యాలతో సాగిపోయే రెండు పట్టాల ప్రయాణం 
ప్రపంచమంతా చుట్టేసే పొడవైన వాహనం 
అందరికీ ఇష్టమే కదా  రైలంటే 
ఒక్కసారి దీనిలో ప్రయాణించామంటే 
ఆ అనుభూతిని మరువలేము ఇట్టే