Sunday 28 June 2020

కవిత నెం :340(నీ జ్ఞాపకంలో - నేనున్నా నాన్న )

కవిత నెం :340


కవితా శీర్షిక :
నీ జ్ఞాపకంలో - నేనున్నా నాన్న 



నువ్వంటే ఇష్టం నాన్న

నీ రూపంటే ఇష్టం నాన్న

నీ ఊహ తెలియకుండా ఎదిగా నాన్న



నువ్వంటే ఇష్టం నాన్న

నీ పేరంటే ఇష్టం నాన్న

నిన్ను ''లేటు '' అని చెప్పే పరిస్థితి ఏంటి నాన్న ?



నీ వేలుపెట్టి నడిచానో లేదో తెలియదు

నీ స్పర్శ కావాలనిపిస్తుంది నాన్న

నీ భుజాలపై ఆడానో లేదో తెలియదు

నా విజయకెరటం నీ భుజాలపై నిలపాలనుంది నాన్న

నీ గుండెలపై హత్తుకున్నావో లేదో తెలియదు

నీ హృదయాన్ని హత్తుకోవాలనుంది నాన్న



నా చిన్నప్పుడు మా నాన్న అలా -ఇలా అనే వాడిని  నాన్న

నిన్ను తలుచుకుంటూ బ్రతికేసా నాన్న

నాన్న ఆకాశమంత అంటారు కదా నాన్న

ఆ ఆకాశంలోనైనా ఒక్కసారి కన్పించు నాన్న

గాలిపటానికి కన్పించని దారం నాన్న అంటారు నాన్న

ఏ దారం రూపంలో ఉన్నావో నాకు దారి చూపించు నాన్న



అక్క నీ గురించి చెప్తుంటే నాన్న

నా కెందుకు అదృష్టం లేదనిపిస్తుంది నాన్న

అందరూ నన్ను మోసం చెయ్యాలని చూస్తున్నారు నాన్న

నువ్వుంటే ఆ అందరే నన్ను అక్కున చేర్చుకునేవారేమో నాన్న



మన ఊరి జనాలు నీరూపు నేనని అంటుంటారు నాన్న

నీ రూపుగా నేనున్నా ఒక్కసారి చూసిపో నాన్న

ఎవరో అమ్మమ్మ నీ గురించి గొప్పగా చెప్తుండేది నాన్న

ఇప్పుడు ఆ అమ్మమ్మ జాడ కూడా లేదు నాన్న



అమ్మ నన్ను నాన్నలా సాకింది నాన్న

గుండెధైర్యంతో నా బాధ్యతలో తను బ్రతుకుతుంది నాన్న

నేను కూడా నాన్న నయ్యాను నాన్న

ఒక నాన్నగా మా నాన్న ప్రేమ పొందాలని ఆరాటంలో 
బ్రతుకు పోరాటం గావిస్తున్నాను నాన్నా !!!

నీ ప్రతి జ్ఞాపకం కావాలనిపిస్తుంది నాన్న


అమ్మ నన్ను ''నాన్నా '' అని పిలుస్తుంది నాన్న

నీ దీవెనలు అయినా నిండుగా పంపు నాన్న

'నా ' కోసం 'నీ ' నా ' కుటుంబం ఉనికి ఉన్నతంగా  చూపాలి నాన్న



- గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు

9705793187

కేసరపల్లి ,ఆంధ్రప్రదేశ్