Tuesday 12 March 2024

ఎవర్రా మీరంతా (363)

ఎవర్రా మీరంతా! 

నీ పుట్ట - పొట్ట నువ్వు చూసుకోకుండా

ఎదుటివాడి తలరాత మారుద్దామనుకుంటావా

నీ గొప్పలు - నువ్వు చెప్పుకో అబ్బీ

ఎదుటివాడి తిప్పల లెక్కలు నీకెందుకు సుబ్బీ

కష్టపడదామనుకో తప్పులే

ఎదుగాదమనుకో అదీ తప్పులే

నువ్వు పడేది మాత్రమే కష్టమనుకుంటే ఎలాగే?


ఎన్నెన్ని వేషాలు ఎంతెంతమంది దగ్గర

నీ అస్సలును కప్పెట్టి

రంగులు మార్చుకుంటూ 

నీ రంగుప్రదర్శన భలేగుందమ్మీ


నీ పేరుకై ప్రాకులాడతావు

పక్కోడికి పేరొస్తే విలవిలలాడతావు

నీవంటే మంచి ,కుంచి అని మార్క్ ఉండాలని

ఎదుటోడినే నీ మాటల బందీగా చేసి 

తియ్యగా చెవిలో జోరీగలా చేరి

మొత్తానికే మనవాడినే మార్చేస్తావు


నిన్ను నమ్మి ,నీతో స్నేహం చెస్తే 

నమ్మినోడికే పంగనామం పెట్టి

నవ్వుతూ వాడినే వెన్నుపోటుల పొడిచి

కాటువేసి ఒంటరిగా చేస్తావు


ఏముంటుంది ఈ జీవితంలో

కాసింత హాయి ,కూసింత మాయే కదా

ఒకర్ని సంతోషంగా ఉంచలేవా ? నీకు చేతకాదా?

సంతోషపు నవ్వులు కూడా నువ్వు చూడలేవా?

అందరినీ ఆ జీవుడు ఆడిస్తుంటే
నీకు తెలిసిన మనిషితోనే నీ ఆట భలా భళి
నువ్వేదో కారణజన్ముడిలా
నువ్వేదో గొప్ప మనుజుడులా
నీ చుట్టూ అందర్నీ తిరిగేలా చేసుకుంటూ
నువ్వుండేది మాత్రం  పదిలంగా నలుగురిలో
నువ్వు మిగతావారిని చూసేది మాత్రం
ఒంటరిగా ,ఒక్కడిగా అందరిలో





Wednesday 7 February 2024

భయంలోనే మనం (362)

 గతాన్ని తలుచుకుంటూ

వర్తమానాన్ని వృధా చేయరాదు

వర్తమానంలో కాలయాపన చేస్తూ

భవిష్యత్తుని కాలరాయరాదు 


నువ్వు భ్రమ పడిన సంఘటనలనుంచి

నువ్వు భయపడిన ఘట్టంల దాకా

ఆ క్షణం ,ఆ నిముషం వరకే తప్ప

భ్రమలకు ,భయ బ్రాంతులు కారాదు 


నువ్వు భయపడేవి నిన్ను భయపెట్టలేవు 

నీ కల్పితమైన ఆలోచనలు తప్ప

అసంకల్పిత ప్రతీకారచర్యలు అనేకమయిన

నీ సంకల్పబలం ముందు అవి అల్పమే


డబ్బులతో పుట్టుకొచ్చే జబ్బులెన్నో

చికిత్సకు లొంగని వ్యాధులెన్నో

ప్రశాంతంగా నీవుంటే ప్రకృతే వరమౌతుంది

ఆస్వాదించే గుణముంటే నీ బాధకూడా మాయమౌతుంది


కంగారుపడి నీ ఖర్మని మార్చుకోకు

చంద్రుడిలా వికసిస్తూ ,సూర్యుడిలా ప్రకాశించు

ఉజ్వలమైన భవిష్యత్తు నీకుండగా

ఉరుము ,మెరుపులకే ఉలికిపాటు ఎందుకురా?

జన్మను ఇచ్చాడు కదా ఆ జీవుడు

అందమైన జీవితంకి ఆహ్వానం పలుకుతుండూ


పోరాటాలు ,యుద్దాలు చేయనవసరం లేదు

పూజలు ,యాగాలు చేయనవసరం లేదు

అంతా మంచికే అనుకో ,అడుగేస్తూ ముందుకు సాగిపో

'భయం' అనే అనుభూతి కూడా ఒక ఆటవస్తువే

ఈ 'ఆట ' లో గెలుపుకొరకు అన్వేషించరా

నీ ధైర్యంతో భయమనే బలహీనతని గెలవరా


మిటుకు మిటుకుమంటూ మొద్దుబారి పోకు

ఆ కిటుకు తెలుసుకుంటూ ,కృష్ణ లీల చూడు



Saturday 3 February 2024

ప్రేమ-పిలుపు (361)

ప్రేమ-పిలుపు 

కమ్మని కల - కౌగిలికి చేరే వేళ

ఉదయించే కిరణం - వెలుగుని ప్రసాదించే వేళ

ఆ హాయిని ,ఉషోదయానికి స్వాగతం చెప్పలేక

విఘాతం కలిగించిన విఘాతకుడిని

అందివచ్చిన ప్రేమఫలాన్ని అందుకోలేక

రాహువులా సూర్యుడినే మ్రింగిన గ్రహణాన్ని

అవకాశం వినియోగించుకోమని సూచిస్తుంటే

అహంకారం తరిమికొట్టమని ఆజ్ఞాపించింది 

అనుభవం వలపు వన్నెలలో విహరిస్తుంటే
ప్రస్థుతం చీదరింపులకి దగ్గరవుతుంది

నా ప్రేయసి పిలుపుని వినలేకపోయాను
మది తలుపుని గట్టిగా బిగించుకున్నాను 

ప్రేమాంతరపు లోతుల్లో తొంగిచూడలేక
ఆలపిస్తూ ,విలపిస్తున్నాను ప్రియమైన దానికోసం

తన చొరవని ,ఆజ్ఞ అనుకుని హద్దు గీసుకున్నా 
తన ప్రేమని ,భ్రమ అనుకుని శిక్షను అనుభవిస్తున్నా

తగిన శాస్త్రి కావాల్సిందే నాకు
తనను అభిమానించలేని ఆభాగ్యుడినిగా 

Sunday 28 January 2024

కవిత(360)

కవిత ఓ కవిత
అందమైన వనిత
నీ పేరులో ఉంటుంది బావాత్మకత
నిన్ను చూడగా ఎదలో ఏదో కలవరింత
నీ స్నేహంతో మొదలైంది నాలో పులకరింత
ఆగదేమో ఇప్పట్లో ఈ కేరింత
అలజడిలా అనిపిస్తుంది తనువంతా
నా మనసు కోరుకుంటుంది నీ జత
కవిత ఓ కవిత 
ఒక కావ్యరూపానివి నీవు





Saturday 27 January 2024

ప్రేమ సిద్దాంతం (359)

ప్రేమ సిద్దాంతం 

ప్రేమించేటప్పుడు నువ్వే నా ప్రాణమనిపిస్తుంది

ప్రేమలో ఉన్నప్పుడు నువ్వే నా సర్వమనిపిస్తుంది


ప్రేమలో గెలిస్తే ,కల నిజమైంది అనిపిస్తుంది

ప్రేమలో విఫలమయితే ,కల కలలానే ఉండిపోతుంది


ప్రేమ విఫలమయ్యి ,దూరం పెరిగితే

మనసులోని బాధ వ్యాదిలా మారిపోతుంది


ప్రేమంటే సత్యమైన ఆరాధన నీకుంటే

ఎంతటి భారమైనా బంధంలా అనిపిస్తుంది

ప్రేమలో ప్రేమించినవారిని వదులుకున్నాక

అర్ధం చేసుకుంటే వారి ఆంతర్యం తెలుస్తుంది

అపార్ధం చేసుకుంటే వ్యర్ధం అనిపిస్తుంది


ఒక్కసారి ఒంటరైతే తెలుస్తుంది

ప్రేమంటే ఏమిటో 

ప్రేమించిన వారి మనసు ఏమిటో


అనుకోని ప్రేమ నీకోసం తిరిగి మళ్లీ వస్తే

అంతకుమించి ఏముంటుంది 

వరమైనది నీకే వశమైందనిపిస్తుంది

మనకు మించి అదృష్టవంతులు ఎవరు అనిపిస్తుంది


ప్రేమలో గెలిచినా ,గెల్వలేకపోయినా

ఆ జన్మాంతం ప్రేమలో ,ప్రేమతో నిలబడగలటం గొప్పతనమే మరి!

- గరిమెళ్ళ రాజేంద్రప్రసాద్


Monday 22 January 2024

358 (వలపుతెర)

 నా మనసు నీ సాంగత్యం కోసం ఎదురుచూస్తుంటే

నువ్వేమో నా మనసుని ఎప్పుడు గెలుద్దామా అని చూస్తున్నావ్

నువ్వు నాతో ఉన్నావని తెలుసుగా 

నీ జతలేని నేను ఒంటరి నే కదా

మరి తుంటరిగా ఎందుకు తూట్లు పొడుస్తున్నావ్

గాయమైనా భరించగలనేమో కాని

నువ్వు పెట్టే ఈ పరీక్షను లిఖించలేను

Thursday 18 January 2024

నేనేప్రేమా(357)

 నాకు లేడీస్ తో మాట్లాడటం రాదు

నా మాట కరుకు

నాకు ఉండదు బెరుకు

అందుకే నేనంటే అందరికీ చిరాకు


నువ్వు దూరంగా ఉండాలని

అనుకోవటంలో తప్పు లేదు

ఆడపిల్లలతో కేరింగా ఉండటం

నాకు చేత కాదు


అందుకే నాకు అమ్మాయిలతో

కాంటాక్ట్స్ తక్కువ

చాలా రోజుల తర్వాత

నాతో మాట్లాడుతున్నావ్

నీకు అర్ధం కావలంటే చాలా టైం పడుతుంది


అస్సలు అర్ధమే కాకపోవచ్చు

నువ్వు ఎంతో సుకుమారం గా పెరిగి ఉండవచ్చు

అందరూ నిన్ను గారాభంగా చూసుకుంటూ ఉండొచ్చు

నాకు అంత ఔధార్యం లేదు

నేను ఊరికే అలుగుతాను

నాకు త్వర్గా కోపం వస్తూ ఉంటుంది

నా మనసు మంచిది కాదు

అస్సలు నేను అనేవాడినే మంచోడిని కాదు

పిచ్చోడిని అంటారేమో 

నాకు తెలియదు


నాతో రిలేషన్ కావాలి అనుకునేవాళ్ళు 

అందరూ నాలో ఎన్నో షేడ్స్ చూసి 

భయపడుతూ ఉంటారు 

నాకు అహం ఎక్కువ

నాకు అణకువ తక్కువ

నీ జీవితం నీ సంతోషం నీకు ముఖ్యం

అప్పుడూ నిన్ను ఇబ్బంది పెట్టాను

దానికి ఇంకా అనుభవిస్తున్నాను


ఇప్పుడు కూడా ఇబ్బంది పెడుతున్నాను

అన్నింటికీ కలిపి 

ఒక పెద్ద క్షమాపణ అడిగినా కూడా సరిపోదేమో

అమ్మాయి ,అమ్మ ,భార్య అందరూ ఒక్కటే కదా

అదేంటో అన్నీ తెలుసు 

అవి పాటించాలంటే ఎందుకో అలుసు


నన్ను క్షమించండి

నా జోలికి ఇంకెప్పుడు రాకండి

నా రాక మీకు తిక్క పుట్టిస్తుంది

నా స్నేహం మీకు జిగుప్సని తెస్తుంది

నా సంతోషం కూడా మీరు కోరుకోనవసరం లేదు సుమీ

ఎందుకంటే అది ఎప్పుడూ నాతో ఎక్కువగా ఉండలేదు

మీరు నాపై చూపే ప్రేమకు ,ఆప్యాయతకు 

దన్యవాధములు

ఇక ఉంటాను మరీ

సెలవు ఇంకా సెలవు

Sunday 14 January 2024

కవిత నెం27

కవిత నెం :27

మనసును చదవగలరా ఎవరైనా
ఆత్మను అవగాహన చేసుకోగలరా ఎవరైనా
అర్ధం పర్ధం లేని జీవితంలో 'అపార్ధాల' పంటలు పండిస్తున్నారు 
మమకారం చూపించే మనసును 'మనోవేదనకు' గురిచేస్తున్నారు 
అందరిలాగే మనము ఆలోచిస్తాము 
అందరిలాగే మనము కూడా చేస్తాము 
తప్పు ,ఒప్పులను నిర్దేశిస్తాం 
మనము మాత్రం ఒక్క మాట కూడా పడలేము 
ప్రేమ అనేది నీకు ఉంటది ,జంతువుకీ ఉంటదీ 
బ్రతికినంతకాలం అందరిలోనూ బ్రతకాలి 
నీవు చూపించే ఆధరణ ,ప్రేమ నీకు నచ్చిన వాళ్ళ పైన మాత్రమే కాదు 
నీవంటే అభిమానించే వాళ్ళ పైన కూడా ఆ ప్రేమ జల్లులను కురిపించు 
చీమకైనా హానిచేయకూడదని కోరుకుంటామే
అలాంటిది ఇతరులను చులకన చేసి బాదించే మనసు నీకెలా వస్తుంది 
నవ్వుతూ పలకరిస్తావు కాని నీకు నచ్చని వాళ్ళను నవ్వనివ్వవు 
కష్టాలు ,కన్నీళ్ళలో సాయం చేయవలసిన అవసరం లేదు 
కాని కనిపించని ప్రేమను మాత్రం ...... 
నీకోసం ,నీ ప్రేమ కోసం నిరీక్షించే వాళ్లకు మాత్రం 
అర్ధం చేసుకోకుండా , ఆ ప్రేమను వారికి దూరం చేయవద్దు

కవిత నెం 26:అర్ధనారీశ్వర తత్వం ...

కవిత నెం :26

అర్ధనారీశ్వర తత్వం ... 
అవనిలో కొలువై యున్న దైవ సమానత్వం 
విధి రాసిన వింత ఫలితం 
అనాధలు కాదు , మన తోటి సమానులు 
శుభ కార్యాలకు కావలి వీరి దీవెన 
అసంకల్పితంగా కనిపిస్తే చూపలేరు  ఆదరన 
ఆక్రోశించే గుండెలు వారు చేయకండి అవహేళన 
గౌరవించి ,మీ హ్రుదయాన్నందించండి అదే వారికి ప్రేరణ 

ఆ బ్రతుకుని దూరం చేసేలా చెయ్యకండి దూషణ 
మన లాగా బ్రతికే అవకాశం వారికి ఇవ్వండి 
మనసున్న వారే వారు ... క్రూరులు కాదు 
ప్రకృతి వైపరీత్యంలో శాపగ్రస్తులైనారు 
అయినా పరిపూర్ణ జీవనానికి ప్రమిదలే వారు 
జవాబులేని ప్రశ్నగా మిగిలిన కావ్య దృశ్యాలు వారు 
భిక్షా టకులుగా వారిని మార్చకండి 
కుళ్ళు ఉన్న ఈ సమాజంలో మలినం పోవాలంటే 
''హిజ్రా'' లను మనుషులని గుర్తించి కాస్త సహాయమందించండి




కవిత నెం 25(అంతా ఒక్కటే)

కవిత నెం : 25

కాలానికి లేదు సమాంతరం 
ధనిక ,బీద గొప్పల తారతమ్యం 
మానవ జన్మ అంటే ఇంతేరా 
మంచి చెడు ,కష్ట సుఖాల బ్రతుకేరా 
దనముకు ఖర్చు చెయ్యటం తెలియదు 
పేదరికానికి అలుపంటూ ఎరుగదు 
రెండూ పుట్టిన నేలఒక్కటే 
ఇద్దరు తినే తిండి ఒక్కటే
మానవత్వమనేది మనకున్నదొక్కటే 
మన ఉనికిని మరువక ,జీవించినంతకాలం 
సంతోషంగా బ్రతికే ఈ బ్రతుకూ ఒక్కటే 

కవిత నెం24:పట్న వాసం

కవిత నెం :24
*పట్న వాసం *  పల్లెలన్నీమాయమై - పట్నాలవుతుండే 
పెరుగుతున్న పట్నాలలో - ఇరుకుటిల్లు పెరిగెనే 
ఎదుగుతున్న సమాజం -స్వార్ద రహితమై 
మనసు ఉన్న మనుషులేమో - మజ్జిగ నీరై 
విలాసవంత జీవితాలకు -విలువలు పెరిగే 
పేదవారు కనిపించని -ధనప్రభంజనమయ్యే
భూ మాత  బిక్కు బిక్కున నలుగుతూ ఉండే 
భవనములు ఆకాశానికి ప్రాకుతూఉండే 
సహజ వనరుల ఆనవాలు కరుగుతూ ఉండే 
మనిషి పెట్టుకున్న విధానాలే ఈ సమస్యలు 
మంచి అన్న పదానికేమో పుట్టే కష్టాలు 
మారని మనుషులలో ఇరుకు బంధాలు 

కవిత నెం : 23 //మామిడి //

కవిత నెం : 23//మామిడి //

ఫల జాతుల్లో రారాజు పసందైన ఫలరాజు
మధురమైన తియ్యదనం మధురంగా అందించేను 
అందరికీ ఇష్టమైన ఫలం -అన్ని కాలాలకు ఉంది దీని అవసరం 
ఆయురారోగ్య సుగుణములున్న ''అమృతఫలం ''
వేసవికాలంలో దాహాన్ని తీర్చే ''అక్షయఫలం ''  
రుచిలో దీనికిదే సాటి - దీనిని మరువగలగటం ఎవ్వరి పాటి 
పండుగ దినములలో ''మామిడి తోరణం '' స్వాగతానికి చిహ్నం 
వంటలలో ''మామిడి పప్పు ''ఆస్వాదించగల వంటకం 
తెలుగు సంవత్సరారంబానికి ''ఉగాది పచ్చడి '' గా శుభసూచకం
సువాసనల గుభాలింపులలో దాగుంది ఒక తియ్యని కమ్మదనం 
నోరూరించే షర్బత్తులు ,మామిడితాండ్ర లు, జామ్ లు ,ఇలా మధుర పానీయాలు 
పర్యావరణానికి ప్రాణాన్నందించే ''మామిడి వృక్షం'' లోన అమ్మదనం 
వసంత వెలుగులలో ''మామిడి సొగసుల '' దే హవా 
''జాతీయ ఫలం '' గా వెలుగొందుచున్న మన ''మామిడి '' నిచ్చే 
సందడి ఆనదించదగినది .... ఆహ్లాదభరితమైనది  

  

కవిత నెం : 22 //కర్ణుడు //

కవిత నెం : 22 //కర్ణుడు //

భాస్కరుని తేజంతో జన్మించిన కుంతీ వరపుత్రుడు
పుట్టుకతోనే సహజ కవచకుండలములు దరియించినవాడు
అర్జునుడితో సమానంగా సకలవిద్యల యందు ప్రావీణ్యుడు
దానము చేయుటలో ''దాన గుణ శీలి '' అని పేరుగాంచిన వాడు
కుచితబుద్ది గల దుర్యోదనుడితో స్నేహమోసగినవాడు
కర్ణుడు లేనిదే 'భారతం ' లేదు అన్పించుకున్న యోధుడు
విది విదానాలయందు విశ్వాసపాత్రుడు
అహంకారమున్నా ధర్మము తప్పని ధీరుడు
రణరంగములో శాపగ్రస్తముచే విస్మరింపబడి ప్రాణము కోల్పోయి
ఈ దరణి ఒడిలో అమరుడై అజరామరంగా నిలచినవాడు ''కర్ణుడు''

మల్లె పువ్వు (21)

కవిత నెం :20

***** మల్లె పువ్వు *****

ఇది మనసును దోచే పువ్వు 
ఇది మనసుకు హత్తుకునే పువ్వు 
ఇది మన ఊసుల్ని కదిలించే పువ్వు 
ఇది హృదయమున్న అందమైన పువ్వు 
స్వచ్చతకు మారుపేరై పరిమళించే పువ్వు 
పూదోట విరిరాణిగా ప్రకాశించే పువ్వు 
వెన్నెల రాత్రులకు విందునిచ్చే పువ్వు
విరికాంతులను కురిపించేది పువ్వు 
మగువలకు ఇష్టసఖి గా పిలువబడే పువ్వు 
మధుమాస మధురాలకు మేలి సోయగం ఈ పువ్వు 
సహజాకృతి వన్నెల కిన్నెరసాని ఈ మల్లె పువ్వు 
కుసుమాల కమలాంకిత కన్నె పువ్వు ఈ మల్లె పువ్వు  

తొలకరి జల్లు(20)

కవిత నెం :20
*తొలకరి జల్లు * ఆకాశం ఆనందించి
నాపై కురిపించెనే మంచు ముత్యాలువాన
నా మనసు పరవశించి
ఆ చిరుజల్లుల పుప్పొడులను నాలో దాచుకోనా
నింగిసైతం నా చెంత కొచ్చి
హరివిల్లు వెలుగులతో నాతో కలిసి నాట్యమాడా
నా తనువు  పులకరించి
ఈ ప్రకృతి మెరుపుల సోయగంలో నే నడచిపోనా
  

ఓ మధూ (6)

ఓ మధూ (6)
ఓ మధూ నా మధూ

'మధు' ర మైన నీ నవ్వు 
అదే నాకు 'మధు' రామృతము 
'మధు'వులను కురిపించే నీ కనులు 
నా రూపమును చూపించే దృశ్య బింబములు 
నువ్వంటేనే నాకు 'మధు' మాసం 
నీ తలపే నాకు 'మధు' ర భావం 
నీవు నాతోటి ఉన్న క్షణములే 
నాకు 'మధు' ర క్షణములు 
ఎంత తెలిపినా చాలదు 
నాలోని నీపై 'మధు' ర ప్రేమను 
నిన్ను అర్దాంగిగా చేసిన 
నా ఆ 'మధు' ర స్వప్నము 
నిజమై ,నిత్య సంతోషమై 
సాగిపోతున్న మన ఈ 'మధు' ర బంధము 
'మధు' ర వసంతాలను అందుకోవాలని 
'మధు' ర జ్ఞాపకాలను దాచుకోవాలని 
'మధు' రానుబంధంగా మన జీవితం 
ముచ్చటగా ,'మధు' రంగా గడవాలని 
నిన్ను ఎల్లప్పుడూ సంతోష సంబరాలలో 
ముంచెత్తాలని ... 
ఆ భగవంతుడు నీకు మంచి ఆరోగ్యం 
ప్రసాదించాలని ..... 
నీ ఈ పుట్టిన రోజు దినమున 
నా ఈ హృదయపూర్వక 'మురళీ ' గానముతో 
శుభాకాంక్షలు తెలుపుతూ 
నా ఈ 'మధు' ర మైన 
నా 'మధు' కొరకు 
నా 'మధు' కోరిక

నా 'మధు' 
నీకు 
పుట్టిన రోజు శుభాకాంక్షలు 

manogna(4)


కవిత నెం : 4









మానవ శిధిలాలు(9)

కవిత నెం : 9
*మానవ శిధిలాలు * మానవుడు చేస్తున్న అమానుష చర్యలకు
మనిషి తనలో తానూ నలిగిపోతున్న వైనం
తనను తానూ ఆత్మ వంచన చేసుకున్నప్పుడు
చేసిన పాపములకు శిక్షను ఊహించుకుంటూ
శిధిలమై పోతున్నట్టు అగుపించే దృశ్యం
నీవు చేసిన క్రియలే నిన్ను వెంటాడుతుంటాయి
నీవు జీవించి ఉన్నంతకాలం ............
మట్టిలోనుంచి పుట్టిన మనం
మట్టిలోన కలిసిపోక తప్పదు
కాబట్టి ఎక్కువగా ఏదీ చెడుగా ఆశించవద్దు
శ్రమపడి చెడుకొరకు జీవించవద్దు




నీవేమి -నేనేమి (8)


// నీవేమి -నేనేమి //

నిన్ను చూడక

నా మది గది తలుపును తెరువకున్నదే
నీవు నాతోన లేని ఈ క్షణమున
నా నయనం ఏ దృశ్యమును చూడలేకున్నదే
ఎందుకు ఎందుకు ఎందులకు ?
నీవంటే అంట ఇష్టం ఎందులకు ?
నీవుంటే ఆ ఉత్సాహం నా మనసుకు ఎందులకు ?
నీతోటి ఉండినచో
నా పలుకు అధికమగును
నా స్వరము సుకుమారమగును
నా గాత్రం ఏదో ఆలాపన చేయును
ఎందుకు ఎందుకు ఎందులకు ?
అదే నీవు ,లేదా నీ ఉనికి కాసేపు మాయమైనచో
నా మనసు స్ధితి గతి తప్పును
నా చేష్టలు ,నా కతీతంగా ప్రవర్తించును
ఎందుకు ఎందుకు ఎందులకు ?
నీ స్పర్శ చాలునే కదా
నాలో జీవమును బ్రతికుంచుటకు
నిన్ను తాకిన పావనము చాలును కదా
నా శ్వాషకు ఊపిరినిచ్చుటకు
ఎంత వెతికినా సమాధానం తప్పించుకొనుచున్నదే
ఎంత ఆలోచించినా నా తలపులకు ,నా ఊహలకు
మాయాజాలం కమ్ముచున్నదే
అహో ! ఏమి ఈ వైపరీత్యము
నాకు పైత్యము పట్టినదా ఏమి ?
ఏమి ఈ నా మనో కుచలత్వము
నీ జాప్యమునకు ఈ తాపము గుర్రుపట్టు చున్నదే
అందకారమా ? మందకారమా ?
ప్రేమ అనే పేరుతోన
నా మనసు చేస్తున్న గారమా ఏమి ?
చూచితివి కదా దేవీ
నన్ను ,నా ప్రేమను గని
ప్రణయామృతము అందించగా రావేమి ?
తేది : 17. 02. 2014

ఓ ఓటరు మహాశయా! (350)

కవితా శీర్షిక : ఓ ఓటరు మహాశయా!


మన పోరాటం వ్యవస్థ కోసం 

కాని ఒక వ్యక్తి కోసం కాకూడదు.


మన ఆరాటం చెడుని జయించటం కోసం

కాని మంచిని ముంచటం కోసం కాకూడదు.


మన లక్ష్యం అభివృద్ది వైపు కోసం

కాని అధికార పరపతులకోసం కాకూడదు


మనం చేసే యుద్దం ప్రజాహితం కోసం 

కాని మన స్వార్ధ ప్రయోజనాల కోసం కాకూడదు.


మార్పు అనేది మొదలవ్వాలంటే

ముందుగా మనం మారటానికి సిద్దపడాలి

రాజ్యాంగం ఇచ్చిన మన నైతిక హక్కుని

నిజాయితీగా ,నిర్భయంగా 

నీ ''ఓటు '' అనే అయుధంతో కొట్టి చూడు


వాడెవడో ,వీడెవడో అని కాదు

మరో వాడు రావాలన్నా ''ఓటు '' కి తల దించాల్సిందే

తప్పు చేయరాదని భయపడాల్సిందే


ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం

ప్రతీ ఓటరూ విచక్షణతో ఆలోచన చేస్తే


వచ్చే ప్రతీ నాయకుడు సుపరిపాలన ఇవ్వటానికే ప్రయత్నిస్తాడు

మనలో సఖ్యతతో కూడిన ఐక్యత ఉండాలి

మన గళం వినిపించటానికి సిద్దంగా ఉండాలి

మన నాయకుల్ని మనమే నడిపించుకోవాలి 

మంచి నాయకుల్ని మనమే గెలిపించుకోవాలి


కాబట్టి 

ఓ ఓటరు మహాశయా !

మన తల రాతలు ఎలా ఉన్నా

మన రాత మన భవిష్యత్తుకై 'ఓటు ' అనే అక్షరంతో 

మనకి మనం రాసుకోవాల్సిందే 

నిన్ను నిన్నుగానే ప్రేమించా(11)


''నిన్ను నిన్నుగానే ప్రేమించా''
నిన్ను నిన్నుగానే ప్రేమించా

నీకోసం నిరీక్షించా ,పరితపించా
నా జీవితంలో ఇక నీవే నా పట్టపురాణివి
నీ  పలుకుల   సుగంధాలను ఆస్వాదిస్తున్నా
నీ ప్రేమ పరువాలలో పయణిస్తున్నా
నీవు  రాకముందు నేను ఒంటరి
నీవు వచ్చినాక ఆ బాధ లేదు మరి
 నువ్వంటే నాకు ఇష్టం ,గౌరవం ,ప్రేమ
మాటలకేం ఏమైనా చెప్పొచ్చులేమ్మా
అని అనుకుంటావా ఏమోనమ్మా
మనిద్దరి తనువులు వేరేమో
నీ మనసునెరిగి నే ఒకటిగా ఉంటున్నాగా !
నీకన్నా నాకు వేరే ఎందుకమ్మా ?
నీకన్నా నాకు ఎక్కువ ఏమీ లేదు చిలకమ్మా
నను నమ్మి అడుగు వేసినావు కాదు కాదు
నా అడుగులో నీ అడుగు కలిపి నడిచావు
మూడేళ్ళ బంధమై ,ఏడడుగుల అనుబంధమై
ముచ్చటగా నన్ను పరిణయమాడావు
నీ కంట చెమ్మ రానీయకుండా
నీ పెదవి నవ్వు వాడిపోకుండా
నీకు తోడై -నీడై నీ వెంట ఉంటా నిత్యమై
ఏ కష్టము రానీయకుండా నిన్ను చూసుకుంటా
నిన్ను నాలో సగభాగము చేసుకొని
ప్రతి రోజూ ఆహ్వానము పలుకుతా
నీ హృదయమునకు నా హృదయమును
అర్పించుకుంటూ ..........




ఐ లవ్ యు ప్రియా (7)

కవిత నెం : 7ఈ సముద్రం సాక్షిగా
నింగి సాక్షిగా ,నీరు సాక్షిగా 
నేను నిన్ను ప్రేమిస్తున్నా ప్రియా 
సముద్రం ఎన్నో జీవరాసులను 
తనలో దాచుకుంటూ కాపాడుతుందో 
నేను నీ ప్రేమను  నా హృదయంలో 
నింపుకున్నా మన  ప్రేమ తోడుగా 
ఎగసే అలలు కూడా నా ప్రేమకు 
మద్దతుగా నీ పాదాలను తాకి 
నా ప్రేమను తెలుసుకోమంటున్నాయి 
ఇసుక తుంపరులు సైతము 
ప్రేమ అనే సింబల్ ని ఇచ్చి 
మన ప్రేమకు దీవెన ఇచ్చుచున్నది  
ఐ లవ్ యు ప్రియా 
మేరా దిల్ నీదే ప్రియా 

మాయ మనిషి(356)

శీర్షిక :మాయ మనిషి
నిజంగా మేడిపండు ఫలమే కాదు
మన జీవితానికి ఉదాహరణగా నిలచే రాశిఫలం
ఎందుకో ఎత్త ఎత్తుకి ఎదుగుతున్న మనిషి
తన బుద్ధిలో మాత్రం మందగిస్తూనే ఉంటాడు
పైకి మాత్రం మేడిపండులా కనపడుతున్నా
తన లోపల మాత్రం కుళ్లుని పెట్టుకుని కంపుకొడతాడు
తన విజయంలో ఆనందాన్ని ఆస్వాదించలేడు
పక్కవాడి ఓటమిలో కళ్లలో విషపు కాంతిని నింపుకుంటాడు
తన ఏడుపుని సైతం దిగమింగుకుని 
పక్కవాడి బాధలో పైశాసికత్వానికి పురుడుపోస్తాడు
ఒకడి మాటల్లో మంచి వినటానికి ఇష్టపడని ఈ మనిషి
జీవిత సలహాలు ఇవ్వటానికి మాత్రం ముందుంటాడు
పైకి మాత్రం పెద్ద మనిషి తరహాగా వ్యవహరిస్తూ
తన స్వభావాన్ని సమయం వచ్చినప్పుడు 
రాక్షస గుణాన్ని భయట పెడుతూ ఉంటాడు
ఆశ చావదు చుట్టూ ఎంత ఐశ్వర్యం ఉన్నా
ఏదో స్వార్థం ,తన మనసుని కమ్మేస్తూ ఉంటుంది
ఎక్కడున్నా కీర్తికోసం ఆరాటపడుతూ ఉంటుంది
అంతా నేనే ఉండాలి , అనే అహం ఆవహించి ఉంటుంది
కుతంత్రాలు తెలిసిన మనిషి కృంగుతూ ఉంటాడు
తను అనుకున్నది సాధించ లేకపోతే
సాటి మనిషిపై నెగ్గలెక్కపోతే
తాను కూడా మనిషే అని మర్చిపోతూ ఉంటాడు
సంతృప్తి లేకుండా , సంతోషాన్ని అనుభవించకుండా



భోగి పండుగ(355)

పచ్చ తోరణాలు
పాడి పంటలు
ముంగిట ముగ్గుళ్లు
సంక్రాంతి గొబ్బిమ్మలు
భోగి పండుగ సందళ్లు

ఈ పండగ అప్పుడూ ఇప్పుడూ ఆ ఆహ్లాదమే వేరు
చిన్నా పెద్దా అంతా వారి వారి ఊళ్లకు చేరి
మూడు రోజులకి సరిపడా కొత్తబట్టలు
పండించిన పంట ఇంటికొచ్చే తరుణం
ప్రొద్దున్నే పొగమంచులోనే
పాత చెక్క సామాన్లు, కట్టెలతో భోగి మంటలు
కష్టాలు -బాధలు అన్నీ ఈ మంటల్లో పోవాలని
కొత్త ఆనందాలు సంతోషాలు వెల్లివిరియాలని
ఆ మంటలవేడి మధ్య నీళ్లు కాచుకుని
వాటితోనే స్నానమాచరించి
చేసిన పిండివంటలతో పూజలు చేసి
అందరూ కలిసి విందు ఆరగించి
సాయంత్రం పసి పిల్లలకు భోగి పళ్లు పోసి
భోగ భాగ్యాలతో ,సిరిసంపదలతో
తులతూగాలని దీవించగా
ముగుస్తుంది మన మొదటి రోజు పండుగ
ఈ భోగి పండుగ

Thursday 11 January 2024

హితమే సన్నిహితం (354)

హితమే సన్నిహితం 

అంతా అంధకారమే కనిపిస్తుంది

అహం నీకు ఆవహిస్తే


ప్రశాంతంగా నీ ఆలోచనలు ఉంటే

సంతోషం సగం బలమై తోడుంటుంది


ఎత్తు పల్లాలు ,ఎండ మావులు 

వస్తుంటాయి ,పోతుంటాయి


దూరంగా భారాన్ని చూసి భయపడితే ఎలా

అసాధ్యమంటూ ఏదీ లేదూ

నీ అంతరాత్మలోకి తొంగిచూసుకుంటూ ఉండు


సమాజం నిన్ను ప్రశ్నిస్తుంది అంటే

ఎక్కడో నీ గురించే ప్రస్తావన వస్తుంది అంటే

అక్కడే నీ శక్తి ఏమిటో ,యుక్తి ఏమిటో తెలుస్తుంది

విజయం నీ వైపే వేచియుంది.


పిడుగువచ్చినా ,సునామీ వచ్చినా

భయపడని మనిషి

సాటి మనిషితో మాట అనిపించుకోవాలంటే భయపడ్తాడు

కారణం తన ఆత్మ గౌరవం 

సగర్వంగా బ్రతకమని సూచిస్తుంది


నిలదొక్కుకుని బ్రతికితే నిలకడ ఉంటుంది
అలికిడికి అదిరిపడితే అలజడి మొదలౌతుంది

నీ స్థాయి ,స్థానమంటూ మురిసిపోకు
మనమే స్థాయిలో ఉన్నా ,మన ప్రస్థానం మారకూడదు

నిందపడినంత మాత్రాన నిజం మాసిపోదు
అబద్దపు జీవితాలలో పొద్దు వాలిపోదు

ఆశగా మెరిసిపోవాలి ,నిరాశని నీడకీడ్చాలి
కుమిలిబోతూ కృంగిపోరాదు
కూసింత ఒత్తిడికే ఒంగిపోరాదు 
ధైర్యంతో అడుగు ముందుకేసుకుంటూ సాగిపోవాలి

నిన్ను చూసి గొప్పగా మాట్లాడే రోజు రావాలి
నీ విలువ్లను నీకు నువ్వే కాలరాసుకోకు
ఎవ్వరి విలువనూ తగ్గించాలని ప్రయత్నించకు

కాలమే సమాధానమిస్తుంది కాలానుగుణంగా
నిన్ను సమాధాన పరుస్తుంది పదిలంగా 


కవిత నెం 353 నా గుండె వెనుక ఇంకొక చప్పుడు నా మాటల్లో మరొక శృతి ఇప్పుడు చుట్టూరా జనంతో కూడిన వాతావరణం నా కళ్లలోకి ప్రవహించెను ఏదో మెరుపు వేగం నా అడుగులు వాటి కదలికల్ని మరిచాయి నా శరీరంలో కదలికలకు లేదు చలనం కాలమంతా ఒకేసారి తిరిగినట్టు ఉన్నది గడియారం కాసేపు స్తంభించి యున్నది నన్ను వీడిన నీడ నా ప్రక్కకు వచ్చినట్టు నేను వదిలిన జ్ఞాపకం నా బుర్రకు తట్టినట్టు నీ కనుసైగలను చూస్తూ ఉండిపోయా నా చెలినేనా అని అయోమయంలో పడిపోయా అమాంతం బిగిసిన పెదవులు మౌనంలోనే కుశల ప్రశ్నలు వేసుకుంటున్నాయి నలుగుతున్న నిశ్శబ్దంలో మౌనం మాటల్ని వెతుక్కోవటం మొదలెట్టింది బాగున్నావా అని అడగాలా? ఏమటిపోయావు అని అడగాలా? కొన్ని సంవత్సరాల తర్వాత నీ రూపాన్ని చూస్తూ పసివాడినయ్యిపోయాను తడిచిన కనులతో స్వాగతం చెప్తున్నాను తనివితీరా పలకరించలేక బరువెక్కిన గుండెతో విలపిస్తున్నాను నీ ప్రశ్నలు కావాలి, నీతో ముచ్చటించాలి ఆ పాత హృదయం పలకాలి నీ స్పర్శ నాకుకావాలి నువ్వేనా నా చెలీ అనీ తెలియాలి

హహహహ