Monday 19 September 2016

కవిత నెం 226:దసరా సంబరం

కవిత నెం :226
దసరా సంబరం 

దసరా వచ్చిందండోయ్ - సరదా తెచ్చిందండోయ్ 
''విజయ దశమి '' అను ఒక పేరుగా 
''దుర్గా నవమి ''అను  మరొక పేరుగా 
సకల  జనుల సౌభాగ్యం చూసే   ఆ తల్లి 
కదిలివస్తుంది మన అందరికోసం కనకదుర్గగా 
కలకత్తా నగరంలో విశిష్టంగా కొలువబడే కాళీమాత గా 
తెలంగాణ ప్రాంతంలో '' బతుకమ్మ'' గా 
తమిళనాడులో ''కామాక్షి'' గా 
కర్ణాటకలో శ్రీ చాముండేశ్వరిగా  ......... 


దేశ వ్యాప్తంగా ఆరంభమయ్యే దేవీ  నవరాత్రులు 

ప్రజలంతా సంతోషంగా చేసుకొనే శరన్నవరాత్రులు 
తొమ్మిది రోజులు పూజలందుకోగా దిగివచ్చెను దుర్గామాతగా 

ఆపదలనుంచి రక్షించే ఆదిపరాశక్తి గా 

దుష్టశిక్షణ గావించే మహిషాసురమర్దిని గా 
అమ్మలగన్న అమ్మ .... ముల్లోకాలకు మూలశక్తిగా 
ఒక్కో రోజు ఒక్కో అలంకరణతో ఆ దేవియే ప్రత్యక్షంగా 

హిందూ సంప్రదాయాలలో ఆనవాయితీగా ఈ పండుగ 

విశిష్టంగా ,వైభోగంగా ఊరూ -వాడలా జరిగెగా 
 బొమ్మల కొలువులు , శమీవృక్ష పూజలు ప్రముఖంగా 
ఆటలు -పాటలతో భక్తుల హృదయాలు హృదయాలు సంబరంగా 
వివిధ దేవుళ్ల రూపాలలో పగటివేషాలు సాగంగా 

పాఠశాలలకు వచ్చెను దసరాసెలవలు 

ఆట పాటలతో  చిన్నారుల కేరింతలు 
ఇంటింటా కొనసాగెను దసరా మామూళ్లు 
ప్రతి ముంగిళ్లలో మురిసెను ముత్తైదువుల పేరంటాళ్లు 
బాణసంచలతో చేసే రావణ బొమ్మల వధలు 
ఊరు ఊరా హోరా హోరీగా సాగే దసరా ఉత్సవాలు 

అంబపరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి గౌరీ .... 

ఎంతెంత కీర్తించినా మది ఆనందభరితమే 
మధురాతి మధురమే ఆ దేవి గానామృతం 
కుంకుమపూజ ఆ దేవికి ప్రధానం 
పుణ్య దంపతులకు ఆ దుర్గమ్మ కటాక్షం 

జయహో దుర్గా భవాని 
పాహిమాం శ్రీ భవాని 
జయజయహే మహిసాషురమర్దిని 
ఆదిలక్ష్మి మృదు పాలయమాం  !












0 comments:

Post a Comment