Saturday 11 April 2015

కవిత నెం94:చదువు

కవిత నెం :94
చదువు 
రచన : 19 , హైదరాబాద్ 

అ, ఆ, ఇ, ఈ ల చదువు 
అమ్మ , నాన్నల పదాలకే చదువు 
ఆరు బయట చదువులు 
వీడి గుమ్మాల చదువులు 
చదివితే ఏమీ రాదనీ వంత నేర్పిస్తుంటే 
గంజి మెతుకు కోసం చదువుని అటకేక్కిస్తుంటే 
విద్యా జ్ఞానం నేర్వవలసిన పసిపాపలు 
కూలీ లాగా మారి హమాలీ చేస్తుంటే
వారి విజ్ఞానం మట్టి ముద్దలకు ,పేడ పిడకలకు
మాత్రమే జత కడుతుంటే 
a ,b ,c , d  కాన్మెంటు లెన్నో కట్టి 
విద్యాబోధ చేయవలసిన వారు 
విద్యావాణిజ్యం ప్రారంభించి 
విద్యనూ బోధించటానికి బదులు 
విద్యనూ అమ్మకానికి మాత్రమె పరిమితం చేస్తుంటే 
zph , ప్రాధమిక ,మాధ్యమిక 
స్కూల్స్ లాంటివి ప్రభుత్వ అండదండలు ఉన్నా 
కాలంతో పాటు అవి కూడా కబ్జా అవుతున్నాయి 
అందుబాటులో విద్యా అంటూ ఎన్ని పధకాలు వచ్చినా 
ఏ గూటికి చేరుతుంది ఒక్క అక్షరం 
అందరికి చదువు అని వేలంపాట వేసి
''దిష్టి బొమ్మగా'' మార్చేసాయి
చదువుకోసం ఒకప్పుడు 
ఎన్ని మైల్లైనా నడించిన తరం అది 
కాని అన్ని సౌకర్యాలు నీ ముందున్నా 
చదువును పక్కన పెట్టి 
పాశ్చాత్త పద్ధతులకు అలవాటు మరిగి 
విచ్చల విడిగా కాలయాపన చేస్తున్న తరం ఇది 
ఒక్కసారి ఆలోచించండి 
చదువంటే ఎందుకు చులకనా 
చదువంటే ఎందుకు ఆ నిర్లక్ష్యం 
చదువు నీకు ఒక అర్హత 
ఆ చదువు నీకు ఒక వరం 
చదువును విడిచి ,చదువును మరచి 
నీవు చేసే కాలయాపనలో ఒక్కొక్క క్షణం 
మీ అమ్మ నాన్నల చమటతో, రక్తంతో,కన్నీళ్ళతో 
నిలిచిన కష్టఫలం
వారు చూడలేని ఆశలు 
చేరుకోలేని ఆశయాలు 
మీలో చూసుకుంటూ , మీ ఆనందంలో 
తమ ఆనందం చూస్తూ గడుపుతారు 
దారిద్ర రేఖ దిగువున వుండి
నిరక్షరాస్యత భాదితులు ఎందఱో ఉన్న ఈ దేశంలో 
చదువు మిమ్మల్ని వరించింది అని 
అది ఒక ''అదృష్టం'' లాగా భావించండి 
చదువే నీ సంపద 
చదువే నీ గమ్యం 
చదువే నీకు గౌరవం 
చదువే నీ స్థానం 
చదువే నీ ప్రతిరూపం 
చదువే నీ ఆయుధం 
చదువే నీకు గర్వ కారణం 
విద్యనొసగు వాడు వివేక వంతుడు 
విద్యాజ్ఞానం లేని వాడు పశువు తో సమానం 
విద్య నీకు తోడుంటే 
విద్య నీ వెంట ఉంటె 
సుదూర ప్రయాణాలు ఎన్నో చేయ వచ్చు 
చరితలను లిఖించవచ్చు
ఆదర్శ వంతుడవు కావచ్చు 
అందరికి ''మార్గదర్శిగా '' నిలవవచ్చు 

!!!!!!!!!!!!!!  


0 comments:

Post a Comment