11, ఏప్రిల్ 2015, శనివారం

కవిత నెం 101:నాకలం నడుస్తుంది

కవిత నెం :101

నాకలం నడుస్తుంది
అభ్యదయ భావాల వైపు
నాకలం నడుస్తుంది
ఆశల అడుగుల వైపు
నాకలం నడుస్తుంది
రమణీయ సాహిత్యం వైపు
నాకలం నడుస్తుంది
స్వరనీయమైన కావ్యం వైపు
నాకలం నడుస్తుంది
వెలుగుజాడల వెలుతురూ వైపు
నాకలం నడుస్తుంది
అందమైన అనుభూతుల వైపు
నాకలం నడుస్తుంది
ఆలకించే ఆదరణల వైపు
నాకలం నడుస్తుంది
అభిలషించే ఆత్మీయం వైపు
నాకలం నడుస్తుంది
తొంగిచూసే అనురాగం వైపు
నాకలం నడుస్తుంది
తరలివచ్చే ఉషోదయం వైపు
నాకలం నడుస్తుంది
మరలిపోని బంధం వైపు
నాకలం నడుస్తుంది


!!!!!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి