13, ఏప్రిల్ 2015, సోమవారం

కవిత నెం147:ఎవరు నీవు

కవిత నెం :147
*ఎవరు నీవు * నిన్ను నేను విడువగలనా
నీ చెలిమిని నేను మరువగలనా
నా బాధలో ఆనందం నీవు 
నా కష్టంలో సుఖం నీవు 
నా మనసులో హాయి నీవు 
నా ప్రతి సొంతం నీవు 
రవివర్మ మలచినా చిత్రానివా 
బాపూ రాసిన గేయానివా 
నా ఉషోదయంలో నవ్య ఉదయానివా 
ఆకాశంలోనించి రాలినా శిల్పానివా 
ఈ భువిలో వెలసిన పారిజాతమా
నీ వర్ణన ఒక అభివర్ణన 
నీ మన్నన ఉంటె చాలు ఇలలోన 
ఆ పంచభూతాలే దిగిరావా 


!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి