Monday 13 April 2015

కవిత నెం141:మరచిపో మనసా

కవిత నెం :141

మరచిపో మరచిపో మరచిపో మనసా 
విడిచిపో విడిచిపో విడిచిపో మనసా 
గతం జ్ఞాపకాలు -గుర్తు రానీయకు 
గుర్తుచేస్తూ గుర్తుచేస్తూ -గుబులునే రేపకు 

అందమైన బృందావనం లాంటి 
గతము నాది కాదు 
బందమైన అనుబందమైన 
అది ప్రేమ పొదరిల్లు కాదు 

నా గతమంతా - నీటిముల్లు
నా గతమంతా - చేదుపల్లు
స్మరించి వాటిని సంతోషవాకిటి
నే చేరలేను నే చేరలేను 

ఆహ్వానించే ఆత్మీయఅతిది లాంటి 
గతము నాది కాదు 
ఇష్టమైన ఇష్టపడుచున్న 
నా ప్రియతము ఏది కాదు 
నా గతమంతా -మబ్బుముసురు 
నా గతమంతా - చేదుచిగురు 
పిలిపించి వాటిని పులకింత లోకిలి 
నే చూడలేను నే చూడలేను 

''వెలుతురిని చూసి చేకటి తప్పుకునేలా
వర్తమానాన్ని చూసి గతం గాయమైపోతుంది 
కాని నా ఈ గతం మానలేని గాయమై 
నన్నెందుకిలా వెంటాడుతుంది వెంటాడుతుంది 

!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా 

0 comments:

Post a Comment