Saturday 11 April 2015

కవిత నెం90:happy new year

కవిత నెం :90

అందరికీ అభివందనం
ఆహ్వానాల నీరాజనం
పల్లవి : హిమాలయమంత  మనస్సుతో - happy new year 
నయాగరా ఉషస్సులా - happy new year
ఎవరైనా ఎప్పుడైనా ఎవరెస్టు ఎత్తు ఎదగాలనీ
నేటి -మేటి బాటలతో , నీ వెంట ఉండే నేస్తంతో
చిరు జల్లు పాటలతో , చిగురాకు లేఖలతో
చెప్పే ,కేలెండర్ తిప్పే  - happy new year  //హిమాలయమంత //
చరణం 1: చింతలన్నీ చెరగాలి - వాటికి good  bye  చెప్పాలి
చిరు దరహాసం రావాలి - చిరకాలం దీవాళీ
కష్టాలన్నీ కలకాలం - కాదని చెప్పే good bye
సరదాగా నువ్వుంటూ - సగటు మనిషికి పంచాలి
కాలమే ఓ కాగితం - ఏది కాదురా శాశ్వతం
కలమై నీ పోరాటం - నడిపించు ఓ నేస్తం   //హిమాలయమంత //
చరణం 2: అందమైనా మనస్సుతో happy new year
ఆనందంగా చెప్పే happy new year
మంచిని చేసి మమతను పెంచి
- మమకారం నువ్వు పొందాలి
ద్వేషం త్రుంచి ,కోపం అణచి
- క్రొత్త బాట నువ్వు వెయ్యాలి
అమ్మ నాన్న లన్నది - ఆది గురువులురా
అండలెన్ని  ఉన్నా - వారి దీవెన చాలునురా      //హిమాలయమంత //
చరణం 3: గర్వాన్ని గగనానికెగసి చెప్పే good bye
గౌరవమే good thing అని తెలుసుకోరా అబ్బాయ్
నీ ఆలోచనలో సంకోచానికి చెప్పే good bye
ఆచరణలో అసాధ్యమే చెప్తుంది good bye
వసంతమే వర్షించే వెరైటీ నువ్వు చెయ్యాలి
నీ ఆశయ సాధనలో -అలలే నీ అడుగుకి చేరాలి 
అంతా మంచే జరగాలనీ కోరుకుంటూ
అందరికీ happy new year
ఉల్లాసంగా ఉత్సాహంగా
వచ్చే new year                                //హిమాలయమంత //

*wish you happy new year 2015*











0 comments:

Post a Comment