11, ఏప్రిల్ 2015, శనివారం

కవిత నెం112 :కవనం

కవిత నెం :112 //కవనం //

చిరు భావాన్ని హృదయస్పందన తో 
చెప్పేదే కవిత (కవనం) 
ఆ భావాలకు మన వేషలను ,బాషలను 
జతచేసి జననాడికి తెలిపేదే కవిత (కవనం)
కవిత (కవనం) అంటే కలం పట్టి 
ఏవో గీతలు గీయటం కాదు 
కవిత (కవనం) అంటే కలం పట్టి 
ఏవో రాతల రూపం కాదు 
మన అంతరంగ రూపాంతరం కవిత (కవనం)
మన మనోభావాల పదజాలం కవిత (కవనం) 
కవిత (కవనం) అక్షరాన్ని సైతం 
ఆయుధంగా మార్చేది 
కవిత (కవనం) అంటే భస్మాన్ని సైతం 
స్వర్ణపుష్పం గా చేసేది 
ఉన్న పాటుగా వచ్చే ఊసులని 
ఊపిరి కూడా సలుపకుండా 
ఉద్వేగంతో ,ఉత్సాహంతో నోటి నుంచి 
ఊడిపడే  పదాలగ్రంధం కాదు కవిత (కవనం) 
అభినయరంజన మందారవిందం కవిత (కవనం) 
అజరామర సుందర నేస్తం కవిత (కవనం) 
సంసృతి,గ్రాందిక బాషలు రాస్తేనే కాదు కవిత (కవనం) 
స్వచ్చమైన తెలుగు బావుకతను ఉట్టిగొలిపి 
మన మనసును తట్టి ,మదురార్ధం తెలిపేదే కవిత (కవనం)

!!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా 

1 కామెంట్‌: