Saturday 11 April 2015

కవిత నెం126:నిజం

కవిత నెం :126 //నిజం //

నిజం అనేది నీడ లాంటిది 
నన్ను చూసి అది పారిపోతుంది
ఆ తర్వాత ఐనా నాకు కనిపించ లేదు నిజం 
అది నాలోనే ఉంటుంది
నాతోనే ఉంటుంది 
కాని నా చుట్టూ అది మాత్రం కనపడదు 
అన్నీ నిజమే అని అనుకుంటూవుంటాను
అంటా మనదే అనే బ్రమలో ఉంటాను 
హాయినిచ్చే ఊహల్లో విహరిస్తుంటాను 
స్వర్గం ఉందొ ,లేదో కాని 
సమస్త సుఖాలు నావే అనుకుంటాను 
వీటన్నింటిలో ఉండదు నిజం 
నిజం లేని జీవితం కల్పితం 
అంటా ఒక నాటకం 
బందాలు,బంధుత్వాలు ఏవీ కాదు శాశ్వతం 
అనే ఒకే ఒక్క నిజం తెలుసుకున్నా ఈ క్షణం 
క్షనమన్నది ఒక బ్రమనం
అది కాలంతో పాటు మారుతూ ఉంటుంది 
విశ్వం చుట్టూ వెర్రి గంతులు వేస్తూ తిరుగుతుంటుంది 
నిజమా ! నీవెక్కడ అంటే ?
నా పుట్టుక - చావు రెంటిని మాత్రమె 
రెండు కల్లులా చూపిస్తూ వాటి వరకే నేను ఉండేది 
వాటిమధ్య జీవితంలోనే నీవు బ్రతికేది అంటూ 
వేలు పెట్టి నాకు చూపిస్తుంది 
ఆకాశంలోని హరివిల్లులా
మరి ఎక్కడ నువ్వు ఉంటావు అంటే 
కనిపించని కాలంలో 
కాలబ్రమనం చేస్తూ వుంటా 
అంటూ ఉడాయిస్తుంది

!!!!!!!!!
గరిమెళ్ళ రాజా








0 comments:

Post a Comment