Saturday 11 April 2015

కవిత నెం100:మందుగ్లాసు

కవిత నెం :100

ఒక మందుగ్లాసు పిలుస్తోంది
మత్తు ఇక్కడే ఉందని చెబుతోంది.
కిలాడిహృదయం ఏమంటుంది
కొంటెగా దాన్ని పట్టమంటుంది
మరి మందుగ్లాసు పిలుస్తోంది
నీకు ఏదో హాయి ఇస్తానంటుంది
మందుగ్లాసుముందు
కళ్ళకు నిషాని పుట్టిస్తుంది
చేతులకు దురదనిస్తుంది
మనసుకి కోరిక నిస్తుంది
ఒక్కసారి తాగితే పోలా అనుకుంటే
మరొక్కమారు నిన్ను కవ్విస్తుంది.
ఆ మారు మారు ఎన్ని మార్లైనా
దాని సుగంధం నీ గుండెను
తట్టి నిద్రలేపుతుంది.
బాధను మర్చిపోవచ్చని
ఆనందం అడ్డా  చూడవచ్చని
గాలిలో తేలవచ్చని
మత్తు ఊయలలో ఊగవచ్చని
స్వర్గమేదో అందులో ఉందని
నీ మనసుని గిల్లుతుంది
నీ మనసుకి పాటం చెబుతుంది
తానే  ''భగవద్గీత''  అని కూడా
అంటున్దందోయ్ 
ఒక్కసారి ఆ మందు వ్యసనానికి
నువ్వు బానిస అయితే
జీవితకాలం నీవు బానిసత్వం చేయవలసిందే
అని తెలుసుకున్నవారు వివేకులు
తెలుసుకొన్నవారు మేధావులు
విలాసం అనే మాయలో ఉండే వెర్రివాళ్ళు
విచక్షణ ఉన్న వారు జాగ్రత్తపరులు
క్రమశిక్షణ ఉన్నవారు నిబద్దులు
అనుక్షణం దీన్నే సేవించేవాల్లు పిచ్చివాళ్ళు

!!!!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు 

0 comments:

Post a Comment