Saturday 11 April 2015

కవిత నెం93:ఎక్కడ ఉందొ ఆ జాభిలమ్మ

కవిత నెం :93

కవిత పేరు    : ఎక్కడ ఉందొ ఆ జాభిలమ్మ
రచన           : రాజేంద్ర ప్రసాదు
రచన సంఖ్య  : ఫిబ్ర్రవరి (౩) ,T (21) 
స్థలం            : పలటానా , త్రిపుర
తేది              : 06.02.12
సమయం      : 02 గం// 57  ని.లు

ఎక్కడ ఉందొ ఆ జాభిలమ్మ
ఏమి చేస్తుందో ఆ కూనలమ్మ
ఎదురుచూస్తున్న నా దరికి వచ్చేది ఎప్పుడమ్మా ?
తన రూపం తెలియదు
తన బావం తెలియదు
తన వైనం అసలే తెలియదు
కాని తన కోసం
నా గుండె గదిని విశాలం చేస్తూ
నా హృదయ తలుపుకు ''స్వాగతం'' బోర్డ్ పెట్టి
పగలు రాత్రి అనే తేడ తెలియకుండా
పడిగాపులు అయితే పడుతున్నానో లేదో తెలియదు కాని
తనకోసమే ఇక ప్రతీక్షిస్తూ
తన ద్యాసలోనే ద్యానం చేస్తూ
తనతో ఊహలలో విహరిస్తూ
కాలయాపన చేస్తున్నాను
ఒక్కసారి అయిన తన నీడ ఎలాఉంటుందో చూడాలని ఉంది
చూడగానే తనని పాణిగ్రహణ మాది
తన పరువపు లోగిల్లల్లో
తన ప్రణయపు ఒడిలో
ఒదిగిపోయి ఇకపై తనతోనే
నా కాలగమనాన్ని నిలిపి
తనతో నా బ్రతుకును ముచ్చటగా
పంచుకోవాలనుకుంటున్నా
తను వచ్చిన తరుణాన నా ఇంటికల
తనయొక్క చల్లని చేతి స్పర్సతో కావాలని ఒక కోవెల
పున్నమి వెలుగులు ఎలా ఉంటాయో
నేనింతవరకూ చూడలేదు కానీ
తనయొక్క సొగసు గాలుల పరిమళంతో
నా మది ఆనంద వెలుగులు చూడాలని ఆశిస్తున్నా
తన మది గెలిచినా నా మనసుకు
ఎకాంతమయినా భరించేలా
విరహమయినా సహించేలా
వరూదిని తను కావాలని
ఒక మరో వసంతం నాకు రావాలనీ
వేయికళ్ళు ఉన్నాయో లేవో కానీ
నా రెండు కాళ్ళ మద్య నిలిచే నీటి కాంతులతో
నిలిచి ఉన్నా తనకోసం
ప్రపంచంలో ఎందరు ఉన్నా
మేమిద్దరమే ఒక కుటుంబంలా
మేమిద్దరం ఒక రాధాసారదిలోనే
ఈ జీవిత ముగింపు వరకు మా ప్రయాణం
ఒక సూర్య తెజస్సులా  సాగిపోవాలనీ 
కాంక్షిస్తూ నిలుచున్నా తనకోసం 
ఈ నీటిపడవ లాంటి జీవిత సంద్రమున 
...............


0 comments:

Post a Comment