11, ఏప్రిల్ 2015, శనివారం

కవిత నెం 105:శివోహం

కవిత నెం :105

ఓం నమ శివాయ నమః 
శివోహం హరిహి ఓం 
ప్రభోదం ప్రణమాయ నమః 
హరిహర మహాదేవ 
శంబోశంకర హర హర హర 
నీవే ఓంకారం 
సర్వ జగత్ సాక్షాత్కారం 
నీవే విశ్వం 
అఖిల జగాల అనంతరూపం 
అండ పిండ బ్రహ్మాండాల 
అది నాయకత్వం నీ చరణం 
ఆపద మొక్కుల పాపాలు 
తొలగించెను నీ అభయం 


ఈశ్వరా పరమేశ్వరా 
సర్వేశ్వరా నందీశ్వరా  //2 // 


ఆనందమయం నీ దర్శనం 
అనుభవించగా అది పావనం 
సకల లోకాల పుణ్యఫలం 
ప్రభూ నీ నామస్మరణం 
ముక్కోటి దేవతలు ఉండగా 
నీ మనసు స్పందించు ముందుగా 
కోరిన కోరికలు తీర్చును నీ హస్తం 
వరమివ్వగానే ఎల్లలోకములకు  శిరోదార్యం 
భక్తి  ఉన్న నీ భక్త జనులను చూసి 
ముక్తి ఐనా నొసగెదవు  ఇలకు దిగి వచ్చి


ఈశ్వరా పరమేశ్వరా 
సర్వేశ్వరా విశ్వేశ్వరా //2 //










కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి