Thursday 17 July 2014

కవిత నెం37(తొలకరి జల్లు)

కవిత నెం : 37

తొలకరి జల్లుల తిమ్మిరితనం 
మేలుకుంటుంది తుంటరితనం
ఆడుకుంటుంది చిలిపితనం 
అలుపెరుగదు అల్లరితనం 
చిన్నపిల్లలకు కేరింతతనం 
పెద్దవాళ్ళకు మది సంబరం 

వర్షం చినుకు చినుకుగా పడుతుంటే 
వడగళ్ళు వడి వడిగా తడుతుంటే 
మేఘాలు మబ్బు మబ్బుగా కదులుతుంటే 
చల్లగాలులు చలి చలిగా చుట్టేసుకుంటుంటే
వయసు వయసెరుగక నవ్వుకుంటుంటే 
మట్టి ముద్ద పరిమళాలను జల్లుతూఉంటే
ప్రకృతి పాపాయిలా మారి పలకరిస్తుంటే 

ఆ అనుభూతులు వర్ణనాతీతమై 
ఆ ఆహ్లాదము ఆనందభరితమై 
చిట పట చినుకుల నాట్యపు అడుగులతో 
బుడి బుడి నడకల అడుగులు కలిసి 
వర్షపు వాకిట చిన్నారి తాళం కలిపి 
మై మరచి ముద్దలా తడిసి తడిసి 
వానా  వానా వల్లప్ప గానంతో 
కాలాన్ని వదిలి నీతోనే ఉండిపోనా అని ...




Saturday 12 July 2014

కవిత నెం36:వాయువు

కవిత నెం :36 //వాయువు //

పంచభూతములలో ఇది ప్రముఖమైనది
విశ్వమంతటా నిరాకారంగా వ్యాపించినది
ప్రకృతి లో అదృశ్య రూపమై ఆవిర్భమైనది
సకలచరాచరసృష్టి కి జీవనాదారమైనది
ప్రపంచమంతటా సంచరించే ఏకైక వాహిని ఇది
ప్రాణవాయువును ప్రసరింపచేసే ప్రాణాధార రూపం
జీవులలో అంతర్లీనంగా ఆత్మగా కొలువున్న రూపం
కనపడదు కాని దీనికి మారుపేర్లు అనేకం .......

మనసుకు ఆహ్లాదమును అందించు వేళ ఇది '' చిరుగాలి ''


పరిమళాలను గుప్పించు  వేళ ఇది ''పిల్లగాలి''


పచ్చని పైరు చేలల నడుమ వీచు గాలి ఇది ''పైరుగాలి ''


వాతావరణము మార్పు చెందిన వేళ ఇది ''వీదురుగాలి''


గ్రీష్మఋతువులో అతలాకుతలమై వీచు గాలి ''వడగాలి ''


దుమ్ము దూలితో విజృబించు వేళ ఇది ''సుడి గాలి ''


వినాశనం కోసం ప్రళయించు వేళ ఇది ''పెను గాలి''


గాలి ,నీరు కలగలిపి విజృంభిస్తే ''సునామీ'' ల బీభత్సం చూడాల్సిందే 

అల్లరికైనా ,ఆహ్లాదానికైనా ,వినాశనానికైనా ఈ పవనమే కారణము 

అందముగా నర్తించి ''వేణు'' వును పలికించగలదు 

ఆగ్రహము మోహించిన వేళ నాశనాన్ని సృస్టించగలదు  

మానవాళి జీవనానికి ఇది ఎంతో అవసరం 

దీనిని స్వచ్చంగా కాపాడుకొనుట మనకు ఇంకా అవసరం 

ఎప్పుడైతే పచ్చని  చెట్లుతో పర్యావరణం పండుతుందో 

అప్పుడే ఈ ''ప్రాణ వాయువు '' సురక్షితంగా ఉండగల్గుతుంది 






  

Friday 11 July 2014

కవిత నెం 35:నదీ స్నానం

కవిత నెం :35 //నదీ స్నానం//
*****************************
సకల ప్రాణ రాశులకు  ఇది జీవ ధరణి
ప్రవహించే నదిలో చేయు నదీస్నానం
పవిత్ర ఆరోగ్యాబివృద్దికి ఆస్కారం
పరమ పవిత్రతను ప్రసాదించే పుణ్య స్నానం
గంగేచ యమునే చైవ గోదావరి ,సరస్వతి ,నర్మదే సింధు కావేరి
జలే స్మిన్ సంనిధం కురు అని స్మరించుచూ స్నానమాచరించిన
సకల నదీ జలాలతో స్నానం చేసిన పుణ్యం కలుగును
పాప పరిహారమునిచ్చును నదీ స్నానం 
సంతోష సిద్ది కలిగించును నదీ స్నానం 
తనువంతా పులకింత నిచ్చును నదీ స్నానం 
పుష్కరం గా పలకరించును నదీ స్నానం 
పితృ దేవతల దీవెనలు అందిచెడి నదీ స్నానం
సకల కార్య బలం , ఆయుష్షు పెంచే అమృత తీర్ధం ఈ నదీ స్నానం  



Monday 7 July 2014

కవిత నెం34:ద్రాక్ష

కవిత నెం :34//ద్రాక్ష//

ద్రాక్ష - ఫలములలో రాణి అని దీని పేరు
వైటాస్ కుటుంబం నుంచి వచ్చిన ఫలము
బెర్రీ ఫ్రూట్ అన్ని దీనికి ఉంది మరొక పేరు
ద్రాక్షలో మన శరీరానికి కావాల్సిన పిండి పదార్ధాలు ,ప్రోటీన్స్ లబిస్తాయి
అనేక రోగాలకు ఔషధంగా పనిచేయును ఈ ద్రాక్ష
(మైగ్రేన్ తలనొప్పి,ఆస్తమా కి ,అజీర్ణం,దంత సంరక్షణ్ ,కంటి చూపు మొ //నవి )
ద్రాక్ష రసం శరీర భరువును ,మరియు రక్త పోటును తగ్గిస్తుంది
ద్రాక్షలో ఉండే పీచు పదార్ధం కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది


Friday 4 July 2014

కవిత నెం33:ఉద్యోగం

కవిత నెం :33

ఈ రోజుల్లో యువకులకి ప్రదానమయిన సమస్య ''ఉద్యోగం ''
చదువుకున్నది అంతా ఒక ఎత్తు అయితే చదువు అయిన తరువాత వారి వారి అర్హతలకు సంబంధించి
ఉద్యోగం దొరకటం ఈ రోజుల్లో బహు కష్ట తరమయిన ప్రధమ మయిన సమస్య . వీళ్ళు ఆ ఉద్యోగం కోసం దేనికైనా తయారుగా ఉండే వారు కొంతమంది అయితే దొరికిన అవకాశాన్ని వదులుకుని ఇంకా మంచి స్థానాల కోసం ఆశించే వారు మరికొంత మంది .ఒకరికి ఉద్యోగమే వారి జీవనోపాది లా ఉంటే మరొకరికి అది ఒక ప్యాషన్ లా లేదా ఒక గౌరవసూచకంగా ఉంటుంది . ఉద్యోగం దొరకక రోడ్ల వెమ్మట ,కొన్ని కంపనీల వెమ్మట పడే వారు కొంతమంది అయితే దొరకిన ఉద్యోగంలో కాలక్షేపం చేస్తూ , పై అధికారుల మాటలకు ,అడుగులకు మడుగులు పడుతూ జీవిత కాలం అంతటా బ్రతికేసే వారు మరికొంతమంది . అయితే ఉద్యోగి యొక్క కష్టాన్ని , నిజాయితీని పనిలో తనకు ఉన్న ఏకాగ్రతను ,పట్టుదలను ,నిబద్దతను చూసి వారికి చేయుట అందించే కొన్ని కంపెనీలు కూడా ఈ రోజుల్లో లేకపోలేదు . అలాగే మరి కొన్ని కంపెనీలలో మాత్రం తాము చెప్పించే చట్టం ,తాము చేసేదే న్యాయం అంటూ ఉద్యోగుల బాగోగులు పట్టించుకోకుండా తమ కంపెనీ యొక్క లాభాల కోసం స్వార్ద రహితంగా వ్యవహరిస్తాయి కూడా . ఇదంతా కంపెనీల గురించి అయితే ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయాలు కొన్ని ఉన్నాయి అవి ఏమిటో చూద్దాం :

1) మొదట నిరుద్యోగి అంటే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తీ
   > ఒక ఉద్యోగం కోసం ఏ అర్హతలు అయితే కావాలో వాటిని మినిమమ్ అన్నా అవగాహన కలిగి ఉండటం

   > ఒక ఉద్యోగం సంపాదించటానికి మొదట అతనికి /ఆమెకి సహనం ,పట్టుదల ,తపన ఇలాంటివి కలిగి ఉండాలి

  > ముఖ్యంగా తన మీద తనకు నమ్మకం కలిగి ఉండాలి

  > ఉద్యోగం కోసం ప్రయత్నించే బాటలో దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలి

  > తనకు ఉద్య్గోగం అవసరం యొక్క ప్రాముక్యత ఎంత ఉందో గుర్తించి కార్య సాధన కోసం ప్రయత్నించాలి

  > ఈ విషయంలో మనం కొన్ని సార్లు ఓడిపోవచ్చు మరికొన్ని సార్లు గెలవవచ్చు దానికి తను నిరాశ పడకుండా
     ఆశా వాదిగా ముందుకు పోవాలి

   > అదృష్టాన్ని ముందు నమ్మక నీ కష్టాన్ని నమ్మి ముందుకు పోవాలి కష్టంలో విషయం ఉంటే అదృష్టం అదే మన వెమ్మట వస్తుంది .

    > ఉద్యోగ వేటలో సంబంధించి అన్ని వెబ్ సైట్ లలో మీ డేటా ని అప్డేట్ చేసుకోవాలి తరచుగా మీరు మీ ప్రొఫైల్
      ని చెక్ చేసుకుంటూ ఉండాలి .

  > ఇంటర్వ్యూ లలో మీరు మీ ఉద్యోగం కోసం ఎంత ప్రాదాన్యత నిస్తున్నారో అదే విదంగా మీరు చేరబోయే కంపెనీ
    కి కూడా అంతే ప్రాదాన్యత నివ్వాలి

  > ఉద్యోగం అవసరం అనే హడావిడిలో కంపనీ యొక్క ప్రతీ నిభందనకి లోబడకండి . అలాగే మొహమాటం కూడా చూపించ వద్దు ,నిర్మొహమాటంగా అన్నీ అడిగి తెలుసుకోండి అలాగీ మీకు కావలసిన వాటి గురించి కూడా
    గౌరవ సూచకంగా అడగండి. ఆ తర్వాతనే ఓకే నో కాదో అని ఆలోచించుకుని బదులు నివ్వండి .

2) కంపెనీల విషయానికి వస్తే :

   > మీకు ఏది కావాలో అది సంక్లిప్తంగా ఉద్యోగికి  తెలియపరచటం

   > ఉద్యోగి మనకు ఎంత అవసరమో ,వారిని అవసరాలను ,అవసరతలను గుర్తించటం

   > ఉన్నవి కదా అని ఏవి పడితే వాటిని నిభందనలుగా వారి మీద రుద్దే ప్రయత్నం చేయకుండటం

   >  ఉద్యోగి ఎంతవరకు పని చెయ్యగలడో ,అంత వరకే తనకి సమయం కేటాయించటం

    > కంపనీ అంటే ఉద్యోగికి గౌరవ కరమయిన వాతావరణాన్ని సృష్టించటం .

    > సకాలంలో జీత భత్యాలు చెల్లించటం

     > అలాగే కంపెనీలో ఉన్న పని మరియు బాద్యతల అవసరతని వారికి అర్ధమయ్యేలా తెలియచెప్పటం 

     > మీ కంపెనీ యొక్క కార్య నిర్వహణకు తగిన శిక్షణా తరగతలును అందించటం 

     > ఉద్యోగుల అందరినీ సమాన స్థాయిలో గౌరవించటం ,వారితో మంచి ఫ్రెండ్లీ వాతావరణాన్ని సృష్టించటం 

     > వారి సామర్ద్యం కన్నా ఎక్కువ పని ప్రభావాన్ని వారిపై చూపకుండటం ,కక్ష సాదింపు చర్యలు లాంటివి 
       చెయ్యకుండటం 

      > పనిమంతులు ఎవరో , పనిని తప్పించుకుంటూ ఉండేవారు ఎవరో అని కనిపెట్టుకుని ఉండటం 
         వారిలో బద్ధకం మరియు కాలయాపన చెయ్యకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవటం 

     > సకాలంలో పని చేసేలా వారిని ప్రోత్సహించటం 

     > ఒకరి మాటలు విని మరొకరిని ఇబ్బందికి గురి చెయ్యకుండా వాస్తవాలకు వెళ్లి 
        సమపాలన సాదించటం 

    > కంపెనీ యొక్క గుర్తింపు కి , పేరు కి ,అభివృద్దికి ప్రతి ఉద్యోగి కారణమే అంటూ 
      సొంత డబ్బా కోకుండా ఉండటం ఒక వేళ మీ వలనే అది జరిగితే దానికి గల కారణాలను వారికి తెలియచేసి 
     మీ కష్టంలో వారిని బాగ స్వామ్యులు అయ్యేలా తెలియ పరచటం 

ఇలా పేర్కొనబడినవి కొన్ని ఉదాహరణలే ఇలా మనం చూసుకుంటూ పొతే చాలా చాల ఉంటాయి వాటిని ప్రతి పౌరుడూ ,ఉద్య్గోగి మరియు కంపెనీలు నిరంతరం అన్వేషణ కొనసాగిస్తూ ఉంటె మంచిది