Saturday 12 July 2014

కవిత నెం36:వాయువు

కవిత నెం :36 //వాయువు //

పంచభూతములలో ఇది ప్రముఖమైనది
విశ్వమంతటా నిరాకారంగా వ్యాపించినది
ప్రకృతి లో అదృశ్య రూపమై ఆవిర్భమైనది
సకలచరాచరసృష్టి కి జీవనాదారమైనది
ప్రపంచమంతటా సంచరించే ఏకైక వాహిని ఇది
ప్రాణవాయువును ప్రసరింపచేసే ప్రాణాధార రూపం
జీవులలో అంతర్లీనంగా ఆత్మగా కొలువున్న రూపం
కనపడదు కాని దీనికి మారుపేర్లు అనేకం .......

మనసుకు ఆహ్లాదమును అందించు వేళ ఇది '' చిరుగాలి ''


పరిమళాలను గుప్పించు  వేళ ఇది ''పిల్లగాలి''


పచ్చని పైరు చేలల నడుమ వీచు గాలి ఇది ''పైరుగాలి ''


వాతావరణము మార్పు చెందిన వేళ ఇది ''వీదురుగాలి''


గ్రీష్మఋతువులో అతలాకుతలమై వీచు గాలి ''వడగాలి ''


దుమ్ము దూలితో విజృబించు వేళ ఇది ''సుడి గాలి ''


వినాశనం కోసం ప్రళయించు వేళ ఇది ''పెను గాలి''


గాలి ,నీరు కలగలిపి విజృంభిస్తే ''సునామీ'' ల బీభత్సం చూడాల్సిందే 

అల్లరికైనా ,ఆహ్లాదానికైనా ,వినాశనానికైనా ఈ పవనమే కారణము 

అందముగా నర్తించి ''వేణు'' వును పలికించగలదు 

ఆగ్రహము మోహించిన వేళ నాశనాన్ని సృస్టించగలదు  

మానవాళి జీవనానికి ఇది ఎంతో అవసరం 

దీనిని స్వచ్చంగా కాపాడుకొనుట మనకు ఇంకా అవసరం 

ఎప్పుడైతే పచ్చని  చెట్లుతో పర్యావరణం పండుతుందో 

అప్పుడే ఈ ''ప్రాణ వాయువు '' సురక్షితంగా ఉండగల్గుతుంది 






  

0 comments:

Post a Comment