Thursday 17 July 2014

కవిత నెం37(తొలకరి జల్లు)

కవిత నెం : 37

తొలకరి జల్లుల తిమ్మిరితనం 
మేలుకుంటుంది తుంటరితనం
ఆడుకుంటుంది చిలిపితనం 
అలుపెరుగదు అల్లరితనం 
చిన్నపిల్లలకు కేరింతతనం 
పెద్దవాళ్ళకు మది సంబరం 

వర్షం చినుకు చినుకుగా పడుతుంటే 
వడగళ్ళు వడి వడిగా తడుతుంటే 
మేఘాలు మబ్బు మబ్బుగా కదులుతుంటే 
చల్లగాలులు చలి చలిగా చుట్టేసుకుంటుంటే
వయసు వయసెరుగక నవ్వుకుంటుంటే 
మట్టి ముద్ద పరిమళాలను జల్లుతూఉంటే
ప్రకృతి పాపాయిలా మారి పలకరిస్తుంటే 

ఆ అనుభూతులు వర్ణనాతీతమై 
ఆ ఆహ్లాదము ఆనందభరితమై 
చిట పట చినుకుల నాట్యపు అడుగులతో 
బుడి బుడి నడకల అడుగులు కలిసి 
వర్షపు వాకిట చిన్నారి తాళం కలిపి 
మై మరచి ముద్దలా తడిసి తడిసి 
వానా  వానా వల్లప్ప గానంతో 
కాలాన్ని వదిలి నీతోనే ఉండిపోనా అని ...




0 comments:

Post a Comment