Saturday 11 April 2015

కవిత నెం103:నిర్ణయం నీ పరం

కవిత నెం :103

ఖాళీగా ఉండే సమయం
ఆలోచన చేసెను పయనం
అదియేరా ఆరంభం
నిర్ణయం నీ పరం


చేసుకో ఉల్లాసం నీ మనసుని
పసిపాపలా చూసుకోరా నీ మనసుని
చిన్నపిల్లల  తత్వం దానిది
ఒక కోరిక అంటూ ఎంచలేనిది


అదియేరా ఆరంభం
నిర్ణయం నీ పరం


అవకాశమంటూ వచ్చాక
తొందరచెట్టు నిలుచునుగా
తను ఇచ్చే పళ్ళే చాలంటావురా
తికమక పడి ఏదో చేసేస్తావురా


అదియేరా ఆరంభం 
నిర్ణయం నీ పరం 

ఖుషీగా ఉంటుంది మనసు 
జల్సా చేస్తుంది మనసు 
బాధ అంటూ చూస్తే
ముడుచుకు పోతుంది 
సంతోషం చూస్తే 
చిందులు వేస్తుంది
అదియేరా ఆరంభం 
నిర్ణయం నీ పరం 

ఒకవైపుకి వెళ్తుంది ద్యాస 
మరువపున వస్తుంది ఘోష 
అర్దమవుతూ ఉంటుంది 
అర్ధం కాలేదంటుంది
ఏమైనా నీ అడుగు 
నిన్నే వెంబడిస్తుంది 

అదియేరా ఆరంభం 
నిర్ణయం నీ పరం 

వెరైటీ అంటుంది మనసు 
సింపుల్ గా వుంటుంది మనసు 
నిముషం నిముషంకు 
నిన్నే మార్చేస్తుంటుంది 
అవసరాలకు అద్దం పట్టే 
అసంతృప్తి అలకకు ఎక్కే 

అదియేరా ఆరంభం 
నిర్ణయం నీ పరం 

నీకే భోదన చేస్తుంది 
సలహాను తోచేస్తుంటుంది 
అందరిముందు వ్యక్తిత్వం అంటూ 
గొప్ప యుగోనే చూపెడుతుంది 
తన తప్పును తానె ఒప్పుకుంటూ 
రాజీ పడుతుంటుంది


అదియేరా ఆరంభం 
నిర్ణయం నీ పరం 




!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా 








0 comments:

Post a Comment