Saturday 11 April 2015

కవిత నెం 99:హాయైనా జీవితం

కవిత నెం :99

హాయైనా జీవితం
అందరికీ అద్బుతం
జీవించటం అవసరం
జననం మరణం normal 

అందివచ్చే ఆనందం దరిచేరగా
చెంతవుండే కన్నీరు తడి అవునుగా

కష్టాలు తెలిసుంటే అవిరావుగా
సుఖాలు మరుగుతుంటే అవిపోవుగా

అడగకుండా అదృష్టం అడుగిడినా
నిన్నే కోరుకుంటూ దురదృష్టం వెంటాడునుగా

అష్టైశ్వరములు అధికారం ఇచ్చినా
ఆర్దికఇబ్బంది అవకాసం ఇవ్వదుగా

చల్లని నీడ నీకు విశ్రాంతి నిచ్చినా
మండే ఎండ నీమాడు పగలగోట్టునుగా

విద్యలందు నీకు విజ్ఞానం యుండినా
అమాయకమైన లోకజ్ఞానం శూన్యం చేయుగా

నీవు ఆశించినవి నీడగ్గారికి వస్తున్నా
దాన్ని నీడలా తరిమే నిరాశ వచ్చునుగా

చేలిమిచేసే వారు నీకు తోడున్నా
శత్రుత్వం వచ్చునుగా మరో రూపేనా

ఎలా చెప్పుకుంటూ పొతే ఈ భావనలరూపం
అంతిమ తీరం ఉండదు దానికి ప్రతిరూపం
ఎలాగైనా మానవజన్మలో ఇవి సాదారణం
తెలుసుకుంటూ జీవించు ఓ మానవబంధం

!!!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా

0 comments:

Post a Comment