Saturday 11 April 2015

కవిత నెం130: రక్తం

కవిత నెం :130 //రక్తం //

ఒకే రంగుతో లోకంలో ఎప్పుడూ ఉండేది
తన ప్రవాహంతో మనిషిని బ్రతికిస్తూ ఉండేది 
కుల - మత బేదాలకు అతీతమైనది 
అందరు ఒక్కటే అనే సమానత్వాన్ని గుర్తు చేసేది 
మనకు చలనం కల్పించేది 
మనకు స్పర్శను తెలియచేసేది
మన అవయవాలకు శ్వాసను అందించేది 
రక్తం ......రక్తం .......రక్తం .....రక్తం 
ఒక తుపాకి గుండుతో మనిషి ప్రాణం పోతుంది 
ఒక రక్తపు బిందువుతో ఆ ప్రాణం నిలుస్తుంది 
ఒక నీటి బొట్టు దాహాన్ని తీరుస్తుంది
ఒక రక్తపుబొట్టు నూతన ప్రాణాన్ని ఇస్తుంది
అన్ని దానాలలో కెల్లా అన్నదానం గోప్పదంటారు 
కాని సుపరిచిత దానం ఈ రక్త దానం 
వెనుకడుగు వేయవద్దు 
నీ రక్తపు ఉనికిని ఆపవద్దు
పరిశుద్దముగా నువ్వుంటూ 
పంచాప్రానాలను నిలిపే శక్తి నీ రక్తానికి ఇవ్వు 



0 comments:

Post a Comment