Monday 13 April 2015

కవిత నెం139:నీ పిలుపు

కవిత నెం :139

ప్రియా నీ పిలుపు విన్న ఈ క్షణం 
మరణలోకాల అంచులకి వెళ్ళిపోతున్న నా మనసుకి 
మరోజన్మ ఎత్తినట్టుగా ఉంది. 
నీ ప్రేమే నాకు వరం ,నీవెక్కడున్న నీవు చూపించే ప్రేమే 
నన్ను ఒంటరివాడు అనే బావాన్ని వెళ్ళగొట్టి , 
నా గొంతులో అమృతాన్ని పోసి,
నా తనువుకి నూతన తేజస్సునిచ్చి,
నా హృదయద్వారాలను తెరిపించి 
దానిలో నీ స్థానాన్ని ఎప్పుడూ పదిలపరిచేలా చేస్తుంది. 
ఏదో అత్మస్తైర్యం నా అంతరంగంలోకి అడుగుపెడుతుంది 
నీ స్వర సవ్వడి వింటే .
నాలో దాగివున్న నిరాశల కెరటాలు ఒక్కసారిగా 
ఉప్పెనలా ఎగిరిపోతాయి నీ చిన్ని మాట వినపడితే 
నీతో చాలా మాట్లాడాలనిపిస్తుంది 
ఏదో గొప్ప కావ్యమే రాయాలి అనిపిస్తుంది 
నీకోసం ఇంక ఏదో ఏదో చెయ్యాలి అనిపిస్తుంది 
నీవు నాతొ మాట్లాడుతున్న 
ఈ నిముషం కాదు కాదు 
ఈ సమయం కాదు కాదు 
ఈ కలం నిర్విరామంగా కొనసాగితే 
బాగుండు అనిపిస్తుంది 
నా గుండెలోపల దాగివున్నఈ  ప్రేమతరంగ బావాలు 
నీ ప్రేమబందంతో పంచుకోవాలి అనిపిస్తుంది 
నీవు మాట్లాడుతూ ఉండే ఈ సున్నితసమయంలో 
నేను నీవుగా మారినట్టు, నీవే నాలోన చేరినట్టు అనిపిస్తుంది 
నేకు నేను కాని ,నాకు నీవు కాని ''ఐ లవ్ యు '' 
ఒకరికిఒకరం చెప్పుకుంటుంటే నా తనువు తిమ్మిరెక్కి 
నీ ప్రేమ తన్మయత్వంలో తడిసిపోయి 
ఈ లోకంలో మనమిద్దరమే ఒకరికోసం ఒకరు 
ఉన్నారన్న సత్యాన్నే ఆ పంచభూతాల సాక్షిగా 
స్పష్టంగా ఈ కాలంతో సంబంధం లేకుండా 
నిజమైన ప్రేమ అంటే ఏమిటో 
కొత్తగా చూస్తున్నట్టు ఉంది 
ఈ మన ''ఐ లవ్ యు'' అనే పదంలో 
ఏదేమైనా నా ప్రియసఖి నీవు నన్ను పలకరించిన 
ఈ సమయం చిరంజీవి అవునో కాదో తెలియదు కాని 
నా మనసుకు అయుస్సును పోసింది ఇంకొంతకాలం .


!!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా 

0 comments:

Post a Comment