Monday 13 April 2015

కవిత నెం143:ప్రియుడు

కవిత నెం :143

ప్రేయసి రావే నా ఊర్వసి రావే అనే పాటకు
ప్రియురాలి హృదయం స్పందిస్తుందా ?
ప్రియుడితో ప్రేమాయణం సాగించేటప్పుడు
తన కంటి చూపుతో వాడికి కంటిమీద కునుకు ఉండదు 
తన చేతి స్పర్స తో వాడి మనసు నిలువదు 
తన కాలిమువ్వల సవ్వడితో 
వాడి హృదయం తన అడుగుల వెమ్మట 
పరుగులు తీస్తుంది 
తన వాలు జడ వయ్యారి సొగసులకు 
వాడి చూపు మతి తప్పి పరిబ్రమిస్తుంది 
వాడి మాటలు తన ప్రేయసి అందాలను 
ముద్ద మనోహర గంధాలను చెప్పటంలోనే 
వాడి జీవితకాలమంతా గడిచిపోతుంది 
ప్రేయసి పరిచయం ఒక ఉషోదయంలా వస్తుంది 
తన గమనం అస్తమించే సూర్యుని కాంతిలా పోతుంది 
ప్రియుడి చెంత ఉన్నన్నాళ్ళు తనకేమి లోటు ఉండదు 
ఆ ప్రియుడి ప్రణయం ముగిసినా కూడా 
తనకేమి తీపిబాధైనా దరిచేరదు 
చివరకు వెన్నెల్లో నీడలా 
వాడిపోయిన పుష్పం లా 
కాలికింద చెప్పులా 
ఒక ప్రళయం వచ్చి ముగిసినా తర్వాత 
ఉండే నిశబ్దం లా 
ఆ ప్రియుడు అల మిగిలిపోతాడు 
నిజమెంత ఉన్నా లేకున్నా 
ఒంటరిజీవితవేకువ కు 
తోరణ మాల  ఆ ప్రియుడు 

!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా

0 comments:

Post a Comment