Tuesday 4 October 2016

కవిత నెం 227 :మన హైదరాబాద్ (కవితా రూపంలో )

కవిత నెం : 227
''మన హైదరాబాద్ ''
(కవితా రూపంలో )

తెలంగాణా రాజధాని మన హైదరాబాద్ 
తెలుగు  ప్రజల గుండె చప్పుడు మన హైదరాబాద్ 
నవాబుల నాటి చరిత్ర ఉన్న ఈ హైదరాబాద్ 
ప్రపంచమంతా పేరుగాంచెను మన హైదరాబాద్ 
ఇది భాగ్యనగరం .... ఇది విశ్వ నగరం 
భారతదేశంలోనే 5వ అతి పెద్ద మహా నగరం

ఇచ్చట కుల ,మతాలకు తావు లేదు 

సర్వ భాషల గ్రంధాలయం మన హైదరాబాద్ 
ప్రతీ రంగమూ ఇక్కడ నుండే ఆరంభము 
రాజకీయాలకు పుట్టిన నిలయం భాగ్య నగరం 
సంసృతి ,సమైక్యతల సుస్థిర వారసత్వము 
సుందరమైన కట్టడాలలో ఇది సంపన్న నగరము 

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నది 'హుస్సేన్ సాగర్ '

పిల్ల ,పెద్దలకు ఆహ్లాదమైన సరస్సు ఈ 'హుస్సేన్ సాగర్'
స్వాగతమంటూ పలకరించే ఏకశిలా 'బుద్ధ  విగ్రహం '
చరిత్రను రాసిన  నాయకులతో మలచిన 'టాంక్ బండ '
జంట నగరాలను విడదీసేదొకటి 'హుస్సేన్ సాగర్ '
ఆ జంటనగరాలను కలుపుకుపోయేదొకటి 'టాంక్ బండ '

అందమైన ఉద్యానవనాలు 'లుంబినీ పార్క్ ' 'ఎన్టీఆర్ గార్డెన్స్ '

ప్రజల కోసం నిర్మితమైన ప్రజాఉద్యానవనం 'పబ్లిక్ గార్డెన్స్ '
సాంస్కృతిక కళా భవనము 'రవీంద్ర భారతి '
పాలరాతితో సంపూర్ణంగా వేంకటేశుని 'బిర్లా మందిరం '
ప్రాచీన భారతదేశ కళలకు నిలయం 'శిల్పా రామం '

పాత బస్తీలో ప్రాచీన కట్టడం మన 'చార్మినార్ '

ప్రపంచ ప్రసిద్ధి చెందిన చిహ్నం మన 'ఛార్మినార్ '
గాజులకు ప్రత్యేకమైన ప్రాంతం 'లాడ్ బజార్ '
మక్కా నుంచి ఇటుకలతో నిర్మితమైన 'మక్కా మసీద్ '

గొల్ల కొండ నుంచి పుట్టిన కోట 'గోల్కొండ కోట '

రామదాసు బందీగా ఉంచిన చోట 'గోల్కొండ కోట '
వజ్రాల గనిగా పేరొందిన కోట 'గోల్కొండ కోట '
కళాత్మక వస్తువుల బాండాగారం ''సాలార్ జంగ్ మ్యూజియం '
భారతదేశంలోనే 3వ అతిపెద్ద సంగ్రహాలయం  'సాలార్ జంగ్ మ్యూజియం '

ప్రపంచంలోనే అతి పెద్ద చలన చిత్ర నిర్మాణ కేంద్రం 'రామోజీ ఫిలిం సిటీ '

గొప్ప పర్యాటక ప్రదేశం గా పేరు గాంచింది 'రామోజీ ఫిలిం సిటీ '
అనేక సాఫ్ట్ వేరు సంస్థల సముదాయం 'హైటెక్ సిటీ '
ఐటీ రంగంలో అభివృద్ధి సాధించిన 'హైటెక్ సిటీ '
ఎన్నో సాఫ్ట్ వేర్ సంస్థలకు నిలయం ఈ 'భాగ్య  నగరం '


వీసాల స్వామిగా వరాలనిచ్చే 'చిలుకూరి బాలాజీ' 

తెలంగాణ తిరుమల కొండ నృసింహ స్వామీ 'యాదాద్రి '
భక్తుల కోర్కెలు తీర్చే దేవి జూబ్లి హిల్స్ 'పెద్దమ్మ తల్లి '
భక్తుల పాలిట కొంగు బంగారం ' ఎల్లమ్మ తల్లి '
తెలంగాణ లో ప్రధాన దైవంగా పిలిచే 'అష్ట లక్ష్మీ దేవాలయం '
కృష్ణ తత్వాన్ని బోధించే అంతర్జాతీయ 'ఇస్కాన్ దేవాలయం '


ప్రతీ యేటా ప్రత్యేకంగా దర్శనమిచ్చే 'ఖైరతాబాద్ వినాయకుడు '

 వినాయక చవితి ఉత్సవాల్లో ఆల్ టైం రికార్డ్ మన 'బాలాపూర్ లడ్డు '

విద్యార్థులకు , ఉపాధి కొరకు మూల వృక్షం 'మైత్రీ వనం '

సినీ కళా కారులకు చేయూత  హస్తం 'కృష్ణా నగర్ '

భారతదేశంలో అతి పురాతన విశ్వవిద్యాలయం 'ఉస్మానియా '
తెలంగాణ ప్రాంతంలోనే అతి పెద్ద విశ్వవిద్యాలయం 'ఉస్మానియా '
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పుట్టిన చోటు 'ఉస్మానియా విశ్వవిద్యాలయం '
ప్రముఖ సాంకేతిక విశ్వవిద్యాలయం 'జె ఎన్ టి యు'
హైదరాబాద్ కే ఖ్యాతి  తెచ్చిన విద్యాలయాలు 
'ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్' మరియు 'బిట్స్ ఫిలానీ 'లు 

'శంషా బాద్' రాజీవ్ గాంధీ  అంతర్జాతీయ విమానాశ్రయం  
ఇది 5వ స్థానం లో నిలిచెను ప్రపంచంలోనే 
మూడు రైల్వే స్టేషన్లు కలిగింది మన భాగ్యనగరం 
ఎం. ఎం .టి .స్ లతో గమ్యం త్వరగా చేరగలం 
మెట్రో రైలు నిర్మాణం ఆధునీకరణకు అద్దం 

దూరాన్ని తగ్గించే ఫ్లై ఓవర్లు 
సుఖ ప్రయాణం కొరకు ఔటర్ రింగ్ రోడ్లు 
72 ఫ్లాట్ ఫారం లతో అతి పెద్ద 'మహాత్మా గాంధీ' బస్ స్టేషను 

తింటే వదిలి పెట్టరు మా 'ప్యారడైస్ బిర్యాని '
మీ మనసుని హాయి నిచ్చే 'ఇరాని చాయ్ '
సాయంత్రం అయితే రద్దీగా మారే 'గోకుల్ చాట్ '
మొగలు రుచులతో ఎన్నో తెలంగాణా వంటలు 
'హలీం ' వంటకంతో ఇచ్చే 'ఇఫ్తార్ విందులు' 
అమ్మ లెక్కలు అంతా కలిసి చేసే 'బతుకమ్మ సంబురాలు' 
గుడ్ మార్నింగ్ అంటూ పలకరించే 'రేడియో సీటీ '
ప్రశాంతంగా కనిపించే మన అసెంబ్లీ 'గాంధీ విగ్రహం '
చూపరులను ఆకట్టుకునే 'కరాచీ బిస్కెట్స్ '

అంతా ఇంతా చూస్తే మన హైదరాబాద్ 
ఎంతో ఖ్యాతికి మారుపేరు మన హైదరాబాద్ 
400 వత్సరముల  మన భాగ్యనగరం 
అందమైన అపురూపమైన కళా ఖండం 'హైదరాబాద్ '

- 10. 10. 16 // గరిమెళ్ళ గమనాలు //



















































0 comments:

Post a Comment