7, అక్టోబర్ 2016, శుక్రవారం

కవిత నెం 228:ప్రేమను ఆపగలిగేది ఏది ?

కవిత నెం  :228
*ప్రేమను ఆపగలిగేది ఏది ?*
ఉదయించిన కిరణం  
అస్తమానికి  చేరుకుంటుంది 
పుష్పించిన కుసుమం
వాలిపోయి ,వాడిపోవటానికి సిద్ధంగా ఉంది 

నింగిలోని జాబిలి కోసం వేచి వేచి 
కళ్లకు కళేభరం కాపు పట్టుకుంది 
నిండుగా కనపడే ఉద్యానవనం 
ఎండుగా ,ఎడారిగా మారిపోతుంది 

నాలో  సహనం అసహనమై ఆవహించింది 
నీపై ప్రేమ చిగురుని మాని నిర్వీర్యమై నేలకొరిగింది 

నాలో ఇష్టం ,నీరసించి కృషించిపోయింది 
నీ ప్రేమకు అంతం పలుకుతూ ,పంతంగా బ్రతకలేనంది 

- 08. 10. 2016 // గరిమెళ్ళ గమనాలు //

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి