Wednesday 7 February 2024

భయంలోనే మనం (362)

 గతాన్ని తలుచుకుంటూ

వర్తమానాన్ని వృధా చేయరాదు

వర్తమానంలో కాలయాపన చేస్తూ

భవిష్యత్తుని కాలరాయరాదు 


నువ్వు భ్రమ పడిన సంఘటనలనుంచి

నువ్వు భయపడిన ఘట్టంల దాకా

ఆ క్షణం ,ఆ నిముషం వరకే తప్ప

భ్రమలకు ,భయ బ్రాంతులు కారాదు 


నువ్వు భయపడేవి నిన్ను భయపెట్టలేవు 

నీ కల్పితమైన ఆలోచనలు తప్ప

అసంకల్పిత ప్రతీకారచర్యలు అనేకమయిన

నీ సంకల్పబలం ముందు అవి అల్పమే


డబ్బులతో పుట్టుకొచ్చే జబ్బులెన్నో

చికిత్సకు లొంగని వ్యాధులెన్నో

ప్రశాంతంగా నీవుంటే ప్రకృతే వరమౌతుంది

ఆస్వాదించే గుణముంటే నీ బాధకూడా మాయమౌతుంది


కంగారుపడి నీ ఖర్మని మార్చుకోకు

చంద్రుడిలా వికసిస్తూ ,సూర్యుడిలా ప్రకాశించు

ఉజ్వలమైన భవిష్యత్తు నీకుండగా

ఉరుము ,మెరుపులకే ఉలికిపాటు ఎందుకురా?

జన్మను ఇచ్చాడు కదా ఆ జీవుడు

అందమైన జీవితంకి ఆహ్వానం పలుకుతుండూ


పోరాటాలు ,యుద్దాలు చేయనవసరం లేదు

పూజలు ,యాగాలు చేయనవసరం లేదు

అంతా మంచికే అనుకో ,అడుగేస్తూ ముందుకు సాగిపో

'భయం' అనే అనుభూతి కూడా ఒక ఆటవస్తువే

ఈ 'ఆట ' లో గెలుపుకొరకు అన్వేషించరా

నీ ధైర్యంతో భయమనే బలహీనతని గెలవరా


మిటుకు మిటుకుమంటూ మొద్దుబారి పోకు

ఆ కిటుకు తెలుసుకుంటూ ,కృష్ణ లీల చూడు



0 comments:

Post a Comment