కవిత నెం :20 *తొలకరి జల్లు *ఆకాశం ఆనందించి నాపై కురిపించెనే మంచు ముత్యాలువాన నా మనసు పరవశించి ఆ చిరుజల్లుల పుప్పొడులను నాలో దాచుకోనా నింగిసైతం నా చెంత కొచ్చి హరివిల్లు వెలుగులతో నాతో కలిసి నాట్యమాడా నా తనువు పులకరించి ఈ ప్రకృతి మెరుపుల సోయగంలో నే నడచిపోనా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి