Tuesday 10 November 2015

కవిత నెం 203:నిజమైన దీపావళి రావాలనీ ........

కవిత నెం :203

నిజమైన దీపావళి రావాలనీ ........ 

స్వార్ధానికి బలవుతున్న అనాధలను చూడు 
కోడిపిల్లలా మారుతున్న ఆడపిల్లల బ్రతుకు చూడు 
వ్యసనపరుల కామ క్రీడలకు ఒత్తిలా కరిగిపోయే ఆడ మనసు చూడు 
ర్యాగింగ్ బూతానికి ఆహారమవుతున్న అక్కా ,చెల్లెలను చూడు 
నిర్ద్యాక్ష్యంగా మగ కామందుల చేతిలో నలిగిపోయే నేటి స్త్రీ ని చూడు 
ఎటువంటి రక్షణ లేని సమాజ అరణ్యంలో చిక్కుక్కున్న శీలం చూడు 
ఆడపిల్లలను కని కన్నీరు మున్నీరవుతున్న అమ్మా ,నాన్నలను చూడు 
అన్నం పెట్టే రైతన్న అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చూడు 
పేదరికాన్ని తట్టుకోలేక రోడ్డున పడుతున్న బిక్షగాళ్ళను చూడు 
చదువుకునే స్తోమత లేక పనికి వెళ్తున్న బాల కార్మికులను చూడు 
మదమెక్కి కష్టపడలేక పెరుగుతున్న దొంగతనాలు చూడు 
పేదలను తోక్కేస్తూ అడ్డంగా పెరిగిపోయే సంపన్నులను చూడు 
మద్య తరగతి బ్రతుకునెక్కిరిస్తూ  మండే ధరలు చూడు 
మురికి వాడల్లో ,అనాధ ఆశ్రమాల్లో రగులుతుండే జీవం చూడు 
 మనం బాగున్నా మన చుట్టూ వాళ్ల బాగు కోరుతూ వెలిగించు దీపం 
వారి వారి జీవితాలలో ఎటువంటి చెడు జరగకూడదని వెలిగించు దీపం 
చెడును ఎంత రూపుమాపుతున్నా పుట్టుకొస్తూనే ఉంటది 
చెడు అంతం ఇంకా మిగిలే ఉంది ఈ భూమి పైనా 
అటువంటి చెడున సంక్లిప్తంగా నాశనం అవ్వాలని 
మూగబోయిన బ్రతుకులలో చిరునవ్వులు తారజువ్వలవ్వాలని 
ఈ దీపావళి పండుగ అందరికీ అన్ని శుభాలని చేకూర్చాలని 
నిండు మనస్సుతో ''దీపావళి పండుగ శుభాకాంక్షలు '' 

0 comments:

Post a Comment