Monday, 28 April 2014

కవిత నెం27:నా దేవి

కవిత నెం :27 నాలో సగం నా రూపంలో ప్రతి రూపం నా భావాలకు అక్షర రూపం నా కన్నులకు నీవు కార్తీక దీపం నా మనసుతో ముడిపడిన మరో వసంతం నా హృదయములో నిలచిన పారిజాతం నీ పరిచయం ఓ నందనవనం నిన్ను చేరగా నా జీవితం ఓ బృందావనం నా కలల రాణివి - పద్మ కుసుమానివి నా అంతరంగ తలపుల కావ్య రూపానివి నీ చిరు ధర హాస చినుకుల వర్షం నన్ను నన్నుగా చూపే జల తరంగం నీ నయన జతల మద్యన మేలి సోయగం నా హృదయవాకిలిని వెలిగించే అఖండం నీవుంటే చాలు చెలీ -నిదురంటూ  వద్దు నీవున్న చోటనే కదా - అది నాకు ముద్దు నిన్ను పొందిన నా జీవితం నాకే ఒక వరం నిన్ను నా కందించగా ఈ కాలం చేసుకుంది పుణ్యం నిత్య యవ్వనంగా...