Thursday, 17 July 2014

కవిత నెం37(తొలకరి జల్లు)

కవిత నెం : 37 తొలకరి జల్లుల తిమ్మిరితనం  మేలుకుంటుంది తుంటరితనం ఆడుకుంటుంది చిలిపితనం  అలుపెరుగదు అల్లరితనం  చిన్నపిల్లలకు కేరింతతనం  పెద్దవాళ్ళకు మది సంబరం  వర్షం చినుకు చినుకుగా పడుతుంటే  వడగళ్ళు వడి వడిగా తడుతుంటే  మేఘాలు మబ్బు మబ్బుగా కదులుతుంటే  చల్లగాలులు చలి చలిగా చుట్టేసుకుంటుంటే వయసు వయసెరుగక నవ్వుకుంటుంటే  మట్టి ముద్ద పరిమళాలను జల్లుతూఉంటే ప్రకృతి పాపాయిలా మారి పలకరిస్తుంటే  ఆ అనుభూతులు వర్ణనాతీతమై  ఆ ఆహ్లాదము ఆనందభరితమై  చిట పట చినుకుల నాట్యపు అడుగులతో  బుడి బుడి...

Saturday, 12 July 2014

కవిత నెం36:వాయువు

కవిత నెం :36 //వాయువు // పంచభూతములలో ఇది ప్రముఖమైనది విశ్వమంతటా నిరాకారంగా వ్యాపించినది ప్రకృతి లో అదృశ్య రూపమై ఆవిర్భమైనది సకలచరాచరసృష్టి కి జీవనాదారమైనది ప్రపంచమంతటా సంచరించే ఏకైక వాహిని ఇది ప్రాణవాయువును ప్రసరింపచేసే ప్రాణాధార రూపం జీవులలో అంతర్లీనంగా ఆత్మగా కొలువున్న రూపం కనపడదు కాని దీనికి మారుపేర్లు అనేకం ....... మనసుకు ఆహ్లాదమును అందించు వేళ ఇది '' చిరుగాలి '' పరిమళాలను గుప్పించు  వేళ ఇది ''పిల్లగాలి'' పచ్చని పైరు చేలల నడుమ...

Friday, 11 July 2014

కవిత నెం 35:నదీ స్నానం

కవిత నెం :35 //నదీ స్నానం// ***************************** సకల ప్రాణ రాశులకు  ఇది జీవ ధరణి ప్రవహించే నదిలో చేయు నదీస్నానం పవిత్ర ఆరోగ్యాబివృద్దికి ఆస్కారం పరమ పవిత్రతను ప్రసాదించే పుణ్య స్నానం గంగేచ యమునే చైవ గోదావరి ,సరస్వతి ,నర్మదే సింధు కావేరి జలే స్మిన్ సంనిధం కురు అని స్మరించుచూ స్నానమాచరించిన సకల నదీ జలాలతో స్నానం చేసిన పుణ్యం కలుగును పాప పరిహారమునిచ్చును నదీ స్నానం  సంతోష సిద్ది కలిగించును నదీ స్నానం  తనువంతా పులకింత నిచ్చును నదీ స్నానం  పుష్కరం గా పలకరించును నదీ స్నానం  పితృ దేవతల దీవెనలు అందిచెడి నదీ స్నానం సకల...

Monday, 7 July 2014

కవిత నెం34:ద్రాక్ష

కవిత నెం :34//ద్రాక్ష// ద్రాక్ష - ఫలములలో రాణి అని దీని పేరు వైటాస్ కుటుంబం నుంచి వచ్చిన ఫలము బెర్రీ ఫ్రూట్ అన్ని దీనికి ఉంది మరొక పేరు ద్రాక్షలో మన శరీరానికి కావాల్సిన పిండి పదార్ధాలు ,ప్రోటీన్స్ లబిస్తాయి అనేక రోగాలకు ఔషధంగా పనిచేయును ఈ ద్రాక్ష (మైగ్రేన్ తలనొప్పి,ఆస్తమా కి ,అజీర్ణం,దంత సంరక్షణ్ ,కంటి చూపు మొ //నవి ) ద్రాక్ష రసం శరీర భరువును ,మరియు రక్త పోటును తగ్గిస్తుంది ద్రాక్షలో ఉండే పీచు పదార్ధం కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది...

Friday, 4 July 2014

కవిత నెం33:ఉద్యోగం

కవిత నెం :33 ఈ రోజుల్లో యువకులకి ప్రదానమయిన సమస్య ''ఉద్యోగం '' చదువుకున్నది అంతా ఒక ఎత్తు అయితే చదువు అయిన తరువాత వారి వారి అర్హతలకు సంబంధించి ఉద్యోగం దొరకటం ఈ రోజుల్లో బహు కష్ట తరమయిన ప్రధమ మయిన సమస్య . వీళ్ళు ఆ ఉద్యోగం కోసం దేనికైనా తయారుగా ఉండే వారు కొంతమంది అయితే దొరికిన అవకాశాన్ని వదులుకుని ఇంకా మంచి స్థానాల కోసం ఆశించే వారు మరికొంత మంది .ఒకరికి ఉద్యోగమే వారి జీవనోపాది లా ఉంటే మరొకరికి అది ఒక ప్యాషన్ లా లేదా ఒక గౌరవసూచకంగా ఉంటుంది . ఉద్యోగం దొరకక రోడ్ల వెమ్మట ,కొన్ని కంపనీల వెమ్మట పడే వారు కొంతమంది అయితే దొరకిన ఉద్యోగంలో కాలక్షేపం చేస్తూ...