Thursday, 17 July 2014

కవిత నెం37(తొలకరి జల్లు)

కవిత నెం : 37

తొలకరి జల్లుల తిమ్మిరితనం 
మేలుకుంటుంది తుంటరితనం
ఆడుకుంటుంది చిలిపితనం 
అలుపెరుగదు అల్లరితనం 
చిన్నపిల్లలకు కేరింతతనం 
పెద్దవాళ్ళకు మది సంబరం 

వర్షం చినుకు చినుకుగా పడుతుంటే 
వడగళ్ళు వడి వడిగా తడుతుంటే 
మేఘాలు మబ్బు మబ్బుగా కదులుతుంటే 
చల్లగాలులు చలి చలిగా చుట్టేసుకుంటుంటే
వయసు వయసెరుగక నవ్వుకుంటుంటే 
మట్టి ముద్ద పరిమళాలను జల్లుతూఉంటే
ప్రకృతి పాపాయిలా మారి పలకరిస్తుంటే 

ఆ అనుభూతులు వర్ణనాతీతమై 
ఆ ఆహ్లాదము ఆనందభరితమై 
చిట పట చినుకుల నాట్యపు అడుగులతో 
బుడి బుడి నడకల అడుగులు కలిసి 
వర్షపు వాకిట చిన్నారి తాళం కలిపి 
మై మరచి ముద్దలా తడిసి తడిసి 
వానా  వానా వల్లప్ప గానంతో 
కాలాన్ని వదిలి నీతోనే ఉండిపోనా అని ...




Related Posts:

  • కవిత నెం266:అది చాలు కవిత నెం :266 *అది చాలు* కన్నులతో పలకరిస్తే పులకరించిపోతావు   కలలోన కిన్నెరవై వీక్షించిపోతావు నా మాటల మృదులతకు మురిసిపోతుంటావు నా సాంగత్య… Read More
  • కవిత నెం32:పటమట లంక కవిత నెం :32 పటమట లంక  నేను ఉండేది పటమటలంక అది ఉంటుంది అందంగా ఎంచక్కా  దాని మూలం విజయవాడలోని బెంజి సర్కిల్ పక్కన   నాలుగు జంక్ష… Read More
  • కవిత నెం 234:నోటు నోటు నువ్వేం చేస్తావ్ అంటే ! కవిత నెం :234 నోటు నోటు  నువ్వేం చేస్తావ్ అంటే !!!!!!! నీకు చిల్లర దొరకకుండా తిప్పిస్తా  నీతో ఉంటూ ,నీకే పనికి రాకుండా  ఉంటా  … Read More
  • కవిత నెం264:* జీవన పోరాటం * కవిత నెం :264 *జీవన పోరాటం * పొద్దుగాడ లేస్తూనే పొట్టకూటి కోసం ఎన్నో పనులు మరెన్నో బాధ్యతలు గీ రోజు  మంచిగా గడిస్తే చాలు గీ  దినం మనం బత… Read More
  • కవిత నెం33:ఉద్యోగం కవిత నెం :33 ఈ రోజుల్లో యువకులకి ప్రదానమయిన సమస్య ''ఉద్యోగం '' చదువుకున్నది అంతా ఒక ఎత్తు అయితే చదువు అయిన తరువాత వారి వారి అర్హతలకు సంబంధించి ఉద్యో… Read More

0 comments:

Post a Comment