కవిత నెం :78
సానుభూతి
******************************************
మనం నిస్సహాయస్థితిలో ఉన్నప్పుడు
మరొకరు జాలిగా చూసే చూపు ''సానుభూతి ''
ఒకరి సహాయం మనకు అందినా ,అందకపోయినా
ఆత్మీయ పలకరింపుగా కనపడేది ''సానుభూతి ''
మనపై మనకే తెలియని చిరాకును విసిరేది ''సానుభూతి ''
ఒక్కొక్కసారి ఆ ''సానుభూతి '' కొంత ఆశా సంతృప్తి ని కలుగచేసినా
మరొక్కసారి ఇంత దయనీయ స్థితిలో ఉన్నామే అనే ప్రశ్నను పుట్టిస్తుంది
ఒకరి సహాయాన్ని ఆశించక పోయినా -మానవత్వ మనసుని చూపించేది ''సానుభూతి ''
హృదయస్పందనను కొలిచే మానం ''సానుభూతి ''
హృదయ వేదనను పోగొట్టే తంత్రం ''సానుభూతి ''
మనుషుల ప్రేమలు...