Friday, 2 January 2015

కవిత నెం78:సానుభూతి

కవిత నెం :78

సానుభూతి
******************************************

మనం నిస్సహాయస్థితిలో ఉన్నప్పుడు
మరొకరు జాలిగా చూసే చూపు ''సానుభూతి ''
ఒకరి సహాయం మనకు అందినా ,అందకపోయినా
ఆత్మీయ పలకరింపుగా కనపడేది ''సానుభూతి ''
మనపై మనకే తెలియని చిరాకును విసిరేది ''సానుభూతి ''
ఒక్కొక్కసారి ఆ ''సానుభూతి '' కొంత ఆశా సంతృప్తి ని కలుగచేసినా
మరొక్కసారి ఇంత దయనీయ స్థితిలో ఉన్నామే అనే ప్రశ్నను పుట్టిస్తుంది
ఒకరి సహాయాన్ని ఆశించక పోయినా -మానవత్వ మనసుని చూపించేది ''సానుభూతి ''
హృదయస్పందనను కొలిచే మానం ''సానుభూతి ''
హృదయ వేదనను పోగొట్టే తంత్రం ''సానుభూతి ''
మనుషుల ప్రేమలు తోడు రాకపోయినా
మనుషులమని నిరూపించే తత్వం ''సానుభూతి ''
పంచటానికి తేలికైనది - తీసుకోవటానికి బరువైనది ''సానుభూతి ''
మాటలాగా కదిలొచ్చేది - మమత లాగా తోడు నిలచేది ''సానుభూతి ''

మీ
-//రాజేంద్ర ప్రసాదు //02. 01. 2015//

Related Posts:

  • కవిత నెం :324(నా అభిలాష) కవిత నెం :324 *నా అభిలాష * ఊసులాడుటకు ఊసు కావలెయును నిన్ను పొగడుటకు ప్రాస కావలెయును మిస మిస మనే నీ నొసల మధ్యన ఎర్రటి తిలకమై నుదురు కావలెయును నీ క… Read More
  • కవిత నెం :335 (అన్నపూర్ణా - వందనం ) కవిత నెం :335 అన్నపూర్ణా - వందనం అమ్మలగన్నమాయమ్మ ఏ దీవెన దక్కిందోయమ్మ ఏ దేవత వరమైనవమ్మా మా తల్లి డొక్కా సీతమ్మా మా పాలిట అన్నపూర్ణమ్మ మా ఆకలి తీర్… Read More
  • కవిత నెం :323(ప్రియ మధనం) కవిత నెం :323 *ప్రియ మధనం * పిలిస్తే పలుకుతావు పలకరించే పిలుపునివ్వవు అందుకోమని చేయినిస్తావు నీ చేతివేలు చివర్నైనా తాకనివ్వవు ముద్దమందారంలా మెరిసి… Read More
  • kavita samkya :332(నా మౌనం) kavita samkya :332 శీర్షిక : నా మౌనం  గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు  హైదరాబాద్ కకావికలమై క్రోధిస్తున్నది జకాశకలమై జ్వలిస్తున్నది తపోభూమిలో తపి… Read More
  • కవిత నెం :327(యాదాద్రి -శిల్ప కళా వైభవం ) కవిత నెం :327 ''యాదాద్రి -శిల్ప కళా వైభవం '' నల్లరాతి శిలల నుంచి జీవం పోసిన  అద్భుత కళాఖండాలు యాదగిరీశుడి సన్నిధిలో కొలువుదీరే సౌందర్య రూపాలు… Read More

0 comments:

Post a Comment