Friday, 13 April 2018

కవిత నెం :319

కవిత నెం :319
శవాలు తిట్టుకుంటున్నాయి
శవ  రాజకీయాలను చూసి
కళేబరాలు కబలిపోతున్నాయి
భూ కబ్జాల దందాలను చూసి
పచ్చని మొక్కలు విలవిలమంటున్నాయి
వికృతమయమైన వాతావరణాన్ని చూసి
పురాతన దేవాలయాలు పూడిపోతున్నాయి
కొత్త దేవాలయాల కుండపోత చూసి
కొండరాళ్లు బండరాళ్లుగా మారుతున్నాయి
మానవ నిర్మాణాల సావాసాలు చూసి
పూరిళ్లు ,పెంకుటిల్లు మట్టిపాలవుతున్నాయి
బిల్డింగులు , కాంప్లెక్సుల ఏరివేత చూసి
పాడిపంటలు పాటికి పరిగెడుతున్నాయి 
అన్నదాత ఆర్తనాదాలు చూసి
గృహాలు గోడలుగా మారిపోతున్నాయి 
గృహహింస రాక్షసత్వం చూసి 
భ్యాంకులు దివాలా తీస్తున్నాయి 
పెరుగుతున్న హవాలా మార్గాలు చూసి 
పల్లెటూర్లు ఏకాకిగా మిగులుతున్నాయి 
పెరుగుతున్న పట్నపు వ్యవస్థను చూసి
అనాధశ్రయాలు ఆవిష్కారమవుతున్నాయి 
మరుగున పడుతున్న మానవత్వం చూసి 

- గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాద్




Related Posts:

  • కవిత నెం 254 : బాపూజీ కవిత నెం :254 * బాపూజీ * కరెన్సీ నోటుపైన కనిపిస్తాడు  వీధి వీడి వీధి విగ్రహాల రూపంలో నిలుచుంటాడు  మన ముందు తరాల వారికి అయన మహాత్ముడు … Read More
  • కవిత నెం 253 :ఆలోచనల తీరు కవిత నెం  :253 * ఆలోచనల తీరు * స్థిమితమైన ఆలోచన నీకు మేలు చేస్తుంది ఆదుర్దాపడిన ఆలోచన నిన్ను ఆలోచింపకుండా చేస్తుంది ఆవేశపూరిత ఆలోచన నిన్ను అతల… Read More
  • కవిత నెం 250 :గత సంవత్సరపు -జ్ఞాపకాలు కవిత నెం :250 గత సంవత్సరపు -జ్ఞాపకాలు కొన్ని సంఘటనలు గుర్తుండేవి  గుర్తుండి పోయేవి కొన్ని వాస్తవాలు  కదిలించేవి కదిలించి చంపేవి ప్ర… Read More
  • కవిత నెం 255 : పల్లెటూరు పిలుస్తోంది (పార్ట్ -1) కవిత నెం :255 ** పల్లెటూరు పిలుస్తోంది (పార్ట్ -1) ** కొక్కొరొక్కో అంటూ నిద్రలెమ్మని చెప్పే కోడి ఆతృతగా పాలు కుడుస్తూ ఆకలి తీర్చుకునే లేగదూడ అమ్మా … Read More
  • కవిత నెం 251 : అమ్మ ప్రేమాలాపన కవిత నెం :251 ** అమ్మ ప్రేమాలాపన ** తనకంటూ ఉన్నా లేకున్నా  తనకంటూ ఏమీ దాచుకొని అమ్మతనం  తన రెక్కల కష్టంతో బిడ్డలను సాకేదే తల్లి… Read More

0 comments:

Post a Comment