Thursday, 25 April 2019

కవిత నెం :331(కల)

కవిత నెం :331

''కల ''

కల
కలలో కదిలే కల
పాములా మెదిలే కల
నీడలా నడిచే కల
నిజంలా అనిపించే కల
అందంగా అగుపించే కల
అపురూపంగా మెప్పించే కల
క్రీడలా కవ్వించే కల
అదృశ్యం అవుతూ తేలే కల
దృశ్యమై కనిపించే కల
భయమై వేధించే కల
భ్రమలో ముంచే కల
బాధ పెడుతూ వేధించే కల
నవ్వుతూ పలకరించే కల
వింతలా వీక్షించే కల
చెంతనే ఉంటూ దాగే కల
దొంగలా దోచుకునే కల
మింగుడు పడకుండా చేసే కల
గుక్క తిప్పకుండా వెక్కిరించే కల
గురకను కూడా మింగేసే కల
ఎక్కడికో తీసుకుపోయే కల
మధ్యలోనే వదిలేసే కల
ఇక్కడ ఉన్నట్టుగానే ఉండే కల
అక్కడ ఉన్నానేమో ప్రశ్న కల
జవాబు దొరుకుతుందేమో చెప్పని కల
మంత్రాల విద్యలు తెలిసిన కల
మౌనంగా ఉండిపోయే కల
పీక మీద ఎక్కి కూర్చునే కల
శరీరం కదలికలు ఆపేసే కల
రెప్ప వేయకుండా రేయి చూపించే కల
చీకటికి భయపడని కల
వెలుగుకి అందని నీడ కల
అమాంతంగా ఆగిపోయే కల
మళ్లీ  మళ్లీ వెంటాడే కల
సువాసనలు వెదజల్లే కల
ఆకలి రుచులు చెప్పే కల
ఆర్తనాదాలు వినిపించే కల
అమావాస్యను దడపుట్టించే కల
కలలోనే ఎన్ని కలలో
కనులతో చేసే సావాసం కల
మనసుకి విరామం  కల
ఆత్మకు విహారం కల




Related Posts:

  • కవిత నెం :18 //ఉగాది // కవిత నెం :18 //ఉగాది // వసంతకాలాన విరబూసే చైత్ర మాస సోయగం ''ఉగాది'' ప్రకృతిని పులకరింపచేసే  చైత్ర శుద్ధ పాడ్యమి ''ఉగాది '' మనసుని పలకరించే మళ… Read More
  • కవిత నెం276:తెలుగు వెలుగు కవిత నెం :276 శీర్షిక పేరు :  తెలుగు వెలుగు  మరో జన్మకేగినా , మరల జన్మించినా మాతృభాష  తెలుగవ్వాలనీ విదేశాలకేగినా ,విచ్చలవిడి తిరిగినా… Read More
  • కవిత నెం 278: అంతా మిధ్య కవిత నెం :278 * అంతా మిధ్య * ఎక్కువగా ఏదీ కోరుకోకు  పొందినదాన్ని చేతులారా చేజార్చుకోకు  అంతా నీదేనని మిధ్యపడకు  ఇంతలో ఏముందని తేలికప… Read More
  • కవిత నెం274:మన ఆవు గురించి మనం తెలుసుకుందాం కవిత నెం  : 274 అంశం : మన ఆవు గురించి మనం తెలుసుకుందాం (వ్యాస రచన ) గోవు అందరికీ తల్లి . అందుకే వాడుకలో గోమాత అని పిలుస్తాము . గోవు పవిత్రతకు … Read More
  • కవిత సంఖ్య :279 (వస్తుంది ఉగాది !) కవిత సంఖ్య :279 కవితా శీర్షిక : వస్తుంది ఉగాది ! తెలుగింటి ముంగిలి లోకి  ఇష్టం పెంచుకుని మరీ వస్తుంది ఉగాది  స్వచ్ఛమైన మనసులకు ఆహ్లాదం అ… Read More

0 comments:

Post a Comment