Monday, 19 August 2019

కవిత నెం :334(నీ -నా లు)

కవిత నెం :334

నీ -నా లు
నేను నీకు ముఖ్యమనుకుంటే
నీవు కూడా నాకు ముఖ్యమే

నా అవసరం నీకుంది అనుకుంటే
సహాయానికి నేను సిద్ధమే

నీతో ప్రవర్తన బాగుండాలనుకుంటే
నీ పరివర్తనం కూడా అవసరమే

నా బంధం నీకు కావాలనుకుంటే
నీతో కలవటానికి నేను సుముఖమే

నా ప్రేమ నీకు దొరకాలనుకుంటే
నిన్ను ప్రేమించటానికి నేను ప్రధముడనే

నాలో మంచి నీవు చూడాలనుకుంటే
నీ మంచితనం కదలడమే

నా సహవాసం నీవు పొందాలనుకుంటే
నీ స్నేహహస్తాన్ని నాకు అందించటమే

నీ వైఖరిని తెలియచేయాలనుకుంటే
నా దారిని నీవు మళ్లించటమే

నా మాట సరళంగా ఉండాలంటే
నీ మాట మృదవుగా ఉండటమే

నీ విలువను నేను గ్రహించాలనుకుంటే
నా విలువను నీవు గుర్తించటమే







Related Posts:

  • కవిత నెం :285(శ్రీ సూర్య నారాయణుడు) కవిత నెం :285 * శ్రీ సూర్య నారాయణుడు * సమస్త విశ్వాన్ని ప్రకాశింపచేసేవాడా - నీకు వందనం స్వయం ప్రకాశ తేజోమయరూపమా - నీకు వందనం సమస్త మానవాళికి జవజీవా… Read More
  • కవిత నెం :287(తనే నా వసంతం) కవిత నెం :287 *తనే నా వసంతం * నడుస్తూ రోజులు గడిచిపోతున్నాయి పరిగెడుతూ నెలలు మారిపోతున్నాయి నా అడుగులో అడుగై నాలో సగమై నా జీవితంలోకి అడుగుపెట్టి … Read More
  • కవిత నెం :284(నా గురించి నా విశ్లేషణ) కవిత నెం :284 * నా గురించి నా విశ్లేషణ * ఆకాశమంత ఆనందం పాతాళంలోకి తరమాలని విషాదం నువ్వంటే నువ్వు కాదని చెప్పే కల్పితం నాలోన మరో కోణాన్ని చూపే వాస్త… Read More
  • కవిత నెం :286ఓ శివ మహా శివ) కవిత నెం :286 ఓ శివ మహా శివ నీ శివాజ్ఞ ఎప్పుడయ్యా మా మీద నీ కృప దయచూపేదెప్పుడయ్యా ఓ శివ మహాశివ అందరి బంధువుడవు మా ఇంట నిలవలేవా ? మాకు కనుల పంట చేయగ… Read More
  • కవిత నెం 283(నేటి చిన్న తనం) కవిత నెం 283 * నేటి చిన్న తనం * వివేకమో ,అవివేకమో తెలియదు గర్వమో , గారాభమో తెలియదు  కదిలిస్తే చాలు నాగు పాము పాము బుసలు క్షణికంలో మారిపోయే మనసు… Read More

0 comments:

Post a Comment