Friday, 15 November 2019

కవిత నెం :336(నా భాషలో -నా తెలుగు)

కవిత నెం :336

* నా భాషలో -నా తెలుగు *

సంద్రంలో పొదిగిన ముత్యపు వర్ణం
పుడమిజడలో పరిమళిత ''పద కుసుమం ''
 గగనవీధిలో స్వరాగల గమగతుల సంగమం
వెన్నెల వెలుగులో ప్రకాశించే నా తెలుగు చందం

లక్షణమైన అక్షరాల అపూర్వ సోయగం
మధురిమ లిఖితం -కమనీయ వాచనం
రమణీయ సొగసుల లలితాత్మక కోమలం
సుమధుర సుందరం తెలుగునే ఈ మూలధనం

దేదీప్యమానంగా వెలుగొందే నా తెలుగు తేజం
అనిర్వచనీయమై అజరామరమై
అఖండ ఖండాలకు వ్యాపించిన నా తెలుగుకేతనం
దేశ భాషలందు తెలుగు లెస్స -ఇది తెలుగుతరం
పరభాషలెన్ని ఉన్నా దీటుగా నిలిచినా నా ద్రవిడ తెలుగు భాష

ప్రాచీనమైన భాష - అమ్మప్రేమలా లాలించే బాష
సుధ ధారలా ప్రవహిస్తూ ఇంపు సొంపయిన గ్రాంధిక భాష
చారిత్రక జానపద పలుకుబడులు భాష నా తెనుగు భాష
నిర్మలమై ,సంపూర్ణమై అచ్చమైన స్వచ్ఛమైన భాష

తెలుగువారిని గౌరవాన్ని విరాజిల్లుతూ వరమైన భాష
తెలుగునేల గర్వించే తేట తెల్లమైన భాష
గతమెంత ఘనకీర్తి గల తెలుంగు నా తెలుగు భాష
కవుల అక్షరపాత్రలా వికసించు నా తెలుగు  భాష
తరతరాలకు మూలాధారం మన తెలుగుభాష

తెలుగుని మరువకండి -తెలుగుని త్యజించకండి
తెలుగుని దశ దిశలా విస్తరింపచేయుటకు సిద్ధంకండి
జై తెలుగు తల్లి - ఇది తెలుగు వెలుగుల జావళి




Related Posts:

  • నిన్ను నిన్నుగానే ప్రేమించా(11) ''నిన్ను నిన్నుగానే ప్రేమించా'' నిన్ను నిన్నుగానే ప్రేమించా నీకోసం నిరీక్షించా ,పరితపించా నా జీవితంలో ఇక నీవే నా పట్టపురాణివి నీ  పలుకుల  … Read More
  • హితమే సన్నిహితం (354)హితమే సన్నిహితం అంతా అంధకారమే కనిపిస్తుందిఅహం నీకు ఆవహిస్తేప్రశాంతంగా నీ ఆలోచనలు ఉంటేసంతోషం సగం బలమై తోడుంటుందిఎత్తు పల్లాలు ,ఎండ మావులు వస్… Read More
  • మాయ మనిషి(356)శీర్షిక :మాయ మనిషినిజంగా మేడిపండు ఫలమే కాదుమన జీవితానికి ఉదాహరణగా నిలచే రాశిఫలంఎందుకో ఎత్త ఎత్తుకి ఎదుగుతున్న మనిషితన బుద్ధిలో మాత్రం మందగిస్తూనే ఉంటా… Read More
  • ఐ లవ్ యు ప్రియా (7) కవిత నెం : 7ఈ సముద్రం సాక్షిగా నింగి సాక్షిగా ,నీరు సాక్షిగా  నేను నిన్ను ప్రేమిస్తున్నా ప్రియా  సముద్రం ఎన్నో జీవరాసులను  తనలో దా… Read More
  • భోగి పండుగ(355) పచ్చ తోరణాలుపాడి పంటలుముంగిట ముగ్గుళ్లుసంక్రాంతి గొబ్బిమ్మలుభోగి పండుగ సందళ్లుఈ పండగ అప్పుడూ ఇప్పుడూ ఆ ఆహ్లాదమే వేరుచిన్నా పెద్దా అంతా వారి వారి ఊళ్లక… Read More

0 comments:

Post a Comment