Thursday, 16 April 2020

కవిత నెం :339(జబ్బు మనుషులు)

కవిత నెం :339 కవిత పేరు : జబ్బు మనుషులు మనస్ఫూర్తిగా నవ్వలేరు నవ్వినా ఆనందాన్ని అనుభవించలేరు వయసుకీ ,మనసుకీ సంబంధం ఉండదు విచిత్రదోరణిలోనే బ్రతికేస్తుఉంటారు క్రమశిక్షణ లేని విచక్షణ వైరాగ్యులు క్రమం లేని పరిక్రమించని జీవులు కోపతాపాలను దాచను లేరు ప్రేమాభిమానాలను పంచను  లేరు ఎందుకూ పనికిరాని అనుభవం ఎవ్వరి సంక నాకటానికి ఎందుకు ఉపయోగపడిని జ్ఞానం ఏ విత్తులు సంపాదించటానికి అందరిలో ఉన్నా ఒంటరిగా వైనం తలతిక్కపట్టిన తింగరి వ్యక్తిత్వం కసాయి గుండె కాదు ప్రాణాలు తీసే పాషాణం కానే కాదు వీరి తత్వంలో ఎదుటివారిని సూదిమందులా చంపే మానవ మనోరోగం...

Tuesday, 7 April 2020

కవిత నెం :338(మట్టి మనిషి)

"మట్టి మనిషి " మట్టిలో పుట్టాం  మట్టిలో ఆడుతూ పెరిగాం  మట్టితో సహవాసం సాగిస్తున్నాం  మనం తినే తిండి మట్టిలోనుంచే  మనం కట్టే బట్ట మట్టిలోనుంచే  ఆఖరికి మనల్ని కాల్చే కట్టే కూడా మట్టిలోనుంచే  పల్లెలో పెరిగిన వారిని అడుగు మట్టిగురించి  పల్లెలో తిరిగిన వారినడుగు మట్టితనం గురించి  తొలకరిజల్లు పడే వేళలో అనుభవించు మట్టివాసనని  ఆధ్యాత్మికంగా చెప్పాలంటే మన కాయం ఆణువణువు కూడా మట్టి పదార్థమే  పిడికెడు మన్నుతో అందమైన బొమ్మలు చెయ్యవచ్చు  ఆ పిడికెడు మన్నుతో మన కాయాన్ని ఖననం చెయ్యవచ్చు  ధనికుడైనా,...